జురాన్ అంటే :-)

జురాన్ అనే పేరు వెనక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏమీ లేదు కానీ, చిన్న షార్ట్ స్టోరీ ఉంది. అప్పుడెప్పుడో బి.టెక్ జాయిన్ అయిన కొత్తలో ఫ్రెషర్స్ డే/టాలెంట్స్ డే లాంటిది జరిగింది. అసలే కొత్తగా యూనివర్సిటీ లో జాయిన్ అయిన ఉత్సాహం, ఉల్లాసం లో ఉండడం వల్ల ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలన్న తపన, తాపత్రయం వల్ల ఎస్వీ ఆడిటోరియం లో మొదటి ప్రోగ్రాం గా ఒక పాట పాడాను.

 

అదేంటంటే “చిటపట చినుకులు పడుతూ ఉంటే” అనే సాంగ్ ని రివర్స్ లో పాడాను. “చిటపట” ని రివర్స్ చేస్తే “టపటచి”, “చినుకులు” ని రివర్స్ చేస్తే “లుకునుచి” అలా మొత్తం పాటన్నమాట – “టపటచి లుకునుచి తూడుప టేఉం” అంటూ. నిజానికి ఇది నా సొంత ఐడియా కాదు. 10th లో ఉన్నపుడో, ఇంటర్ లో ఉన్నపుడో ఏదో నవల చదివాను, మేర్లపాక మురళి రాసింది. నవల పేరు గుర్తు లేదు. అందులో హీరోయిన్ రోడ్ మీద వెళుతుంటే ఎవరో ఆకతాయి ఆమె వెనుక ఈ పాట ఇలా రివర్స్ లో పాడుతూ వస్తుంటాడు. నాయిక వెనక్కి తిరిగి ఇతన్ని చూడదు కానీ ఆ చిన్న పల్లెటూళ్ళోని ఒక ఆకతాయిలో అంత క్రియేటివిటీ ఉండడాన్ని, పైగా అతను శ్రమకోర్చి పాట మొత్తం అలా రివర్స్ లో ప్రాక్టీస్ చేయడాన్ని ఊహించి ముగ్ధురాలవుతుంది. నవల లో ఆ సీన్ చదివాక అదలా గుర్తుండిపోయింది.

 

ఇంజనీరింగ్ జాయినయ్యాక ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలనుకున్నపుడు అది స్ఫురించింది. సరే అని పాట మొత్తం పాడాక నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వచ్చినపుడు ఎస్వీ ఆడిటోరియం లో స్టేజ్ మీద- నా పేరు “మోహన్ రాజు” అని చెప్పకుండా సరదాగా రివర్స్ లో చెప్పాను. “జు-రా-న్-హ-మో” అని. ఆ తర్వాత కూడా నా మీద అభిమానం కొద్దీ/ ప్రేమకొద్దీ /ఫ్రెండ్ షిప్ కొద్దీ  మా ఫ్రెండ్స్  నన్ను అలాగే పిలవడం మొదలెట్టారు. ఆ తర్వాత అది బాగా లెంగ్త్ ఎక్కువయిందని తోక కత్తిరించి జురాన్ అని పిలచేవాళ్ళు. ఇప్పటికీ కొంతమంది కి అది అలాగే అలవాటై, అలాగే పిలుస్తారు. సరే అని నేనూ అలా ఫిక్స్ అయిపోయా.  🙂

స్పందనలు

 1. మీ పేరు వెనక కథ బాగుంది.

 2. interesting ..

 3. బ్రతికి పోయారు.. అదే మా కాలేజీ లో అయితేనా..
  .. just for fun.. no offence.

 4. హ హ హ. భలే.
  @భా.రా.రె. మా కాలేజిలోనూ అంతే, ఒమార్ ముక్తార్ని హోమోముక్తార్ చేసి పారేశారు. 🙂

 5. జురాన్ అంటే ఏమిటని నేనే అడుగుదామనుకుంటున్నా! చాలా తమాషాగా ఉంది మీ పేరు, దాని వెనక కథానూ!

 6. expect chesaaa.. nenu munde expect chesaa.. 🙂

 7. ఫ్లాష్ బ్యాక్ టచ్ చేసింది. నా స్కూలు స్మృతులను జ్ఞప్తికి తెచ్చింది. ధన్యవాదములు. అన్నట్టు, పేరు నాకు మాహా గొప్పగా నచ్చింది బాసు.

  • >>పేరు నాకు మాహా గొప్పగా నచ్చింది బాసు>>>
   ఏదో మీ అభిమానం బాసూ 🙂 ….thanks

 8. ma college lo, same naku alage nick name umdedi…
  satyam -> maytas laga 🙂

 9. పేర్లు ఇలాకూడా పుడతాయన్నమాట.బాగుంది మీపేరువెనుక కథ.

 10. అసలీ జురాన్ ఎమిటి అని చాలా రోజులుగా అలోచిస్తున్నా. మీకు సినిపరిజ్ఞానం ఎక్కువ కదా ఎదైనా గొప్ప కళాఖండమో లెక టెక్నికల్ విషయమో అనుకొన్నా. ఇప్పుడు తెలిసింది అది టివిటియేక్రి అని.

  • చైతన్యా..మీ కామెంట్ కూడా బాగా టియేక్రి-వ్ గా ఉంది.. 😀

 11. ..mmmm.. yrots ecin – ! gnitseretni

 12. 😀 . baagundanDee mee creativity

 13. అదా సంగతి. నేనింకా జురాన్ అనేది హిమేష్ రేషమ్మియా ముక్కు నుండి వెలువడిన సూపర్ హిట్ గీతమేమో అనుకున్నా 🙂 బతికించారు.

 14. హహహ.భలే ఉంది బాస్. నాకూ నా ఇంటర్ రోజులు గుర్తొచ్చయి. నేను ఎక్కువ Reynolds పెన్ను వాడుతుంటా. అదెలా అయిపోయిందంటే…ఫస్టియర్ అంతా అదే వాడటంతో, కనీసం పెన్ కూడా మార్చకుండా… సెకండియర్లో ప్రాబబిలిటీలో డిక్ష్నరీ ఆర్డర్లో ఒక పదాన్ని పెట్టి చేసే ప్రాబ్లంస్ చెప్తున్నారు.

  చివరికోర్జు నాకు DELNORSY అనే పేరు తగిలించారు. All the words of Reynolds in dictionary order.

 15. college lo unna rojulo maku telede nee peru guaran ani.telisinte ammayalamu kuda alage piliche vallamemeo

 16. I thought Juran was a great warrior name! 😉 Good flash back!

 17. జురాన్ గారూ…ఇవాళే మీ బ్లాగు చూడడం.. పాత పోస్టులన్నీ కూడా చదివేశాను. చాలా బాగుంది. నైస్. కీపిటప్. అన్నట్లు తెలుగులో జురాహమా అని ఓ మంచి నాటిక ఉంది. రాజరికం నేపథ్యంలో…ఉంటుంది. చివరకు మహరాజు కాస్త జురాహమ గా మారిపోతాడు. ఎప్పుడో రేడియోలో ఆదివారం నాటిక నాకు గుర్తొచ్చింది. మా స్పేహితుల్లో ఒకరికి అదే పేరు పెట్టుకొని పిల్చుకునే వాళ్లం. ఎనీవే.. ఒక మంచి బ్లాగుని చూసిన సంతృప్తి దక్కింది. ధన్యవాదాలు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: