కాఫీ కి స్పెల్లింగ్ KAUPHY అని ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి సంబంధం లేకుండా చెప్పినట్టు – భారతీ రాజా, జంధ్యాల, సాగరసంగమం -ఏంటీ గోల అనుకుంటున్నారా? ఏమీ లేదు.. ఎప్పుడో చిన్నపుడు చదివిన జంధ్యాల ఇంటర్వ్యూ ఇవాళెందుకో గుర్తొచ్చింది…
భారతీ రాజా దర్శకత్వం లో వచ్చిన సీతాకోక చిలుక సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు. భారతీ రాజా గారు మురళి (తర్వాత కార్తీక్ అయ్యాడు), అరుణ ని హీరోహీరోయిన్స్ గా పెట్టి ఒక మంచి లవ్ స్టొరీ ప్లాన్ చేసారు, 90 శాతం షూటింగ్ కూడా అయింది. ఈ సినిమా కి జంధ్యాల మాటల రచయిత. అయితే ఈ సినిమా కి టైటిల్ ‘సాగర సంగమం’ అయితే బాగుంటుంది అని జంధ్యాల భావించారు.అప్పటికింకా కె. విశ్వనాథ్ గారి సాగర సంగమం సినిమా రాలేదు. భారతీ రాజా గారితో జంధ్యాల గారు చెప్పారట -“ఇది ఒక ప్రేమ కథ..ఒక హిందూ అబ్బాయి కి, ఒక క్రిస్టియన్ అమ్మాయి కి మధ్య ప్రేమ కథ. ఈ రెండు మతాలు రెండు నదులు లాంటివి అయితే ప్రేమ అనే సాగరసంగమం వద్ద నదుల లాంటి ఈ రెండు మతాలు కలవడమే ఈ చిత్ర ఇతివృత్తం. కాబట్టి ఈ సినిమా కి సాగరసంగమం టైటిల్ అయితే బాగుంటుంది ” అని. అందులోనూ అప్పటికే “సాగర సంగమమే..” అనే పాట కూడా ఈ చిత్రం కోసం రికార్డ్ చేసి షూట్ చేసారు. కాబట్టి అన్నివిధాలా ఈ సినిమా కి సాగరసంగమం అనేది అత్యంత యాప్ట్ టైటిల్ అని భావించారు జంధ్యాల.
అయితే దీనికి భారతీ రాజా గారిచ్చిన సమాధానం జంధ్యాల గారిని అబ్బురపరచిందట! ఇంతకీ భారతీ రాజా గారిచ్చిన సమాధానమేంటంటే – ” ఈ సినిమా కి కథాపరంగా సాగర సంగమం అనే టైటిల్ యాప్ట్ అయి వుండొచ్చు, అంత చక్కని టైటిల్ పెట్టామనుకుని మనం సంబర పడిపోవచ్చు..కానీ ఒక్క సారి ప్రేక్షకుడి వైపు నుంచి ఆలోచింఛండి. సాగర సంగమం అనే టైటిల్ చూడగానే ఇదేదో బాగా బరువైన కథ వున్న సినిమా అనుకుంటారు. మనది ప్రేమ కథ. కుర్రాళ్ళని ఆకట్టుకునేలా టైటిల్ వుండాలి కానీ వాళ్ళని బెదరగొట్టేలా కాదు..సాగర సంగమం అన్న టైటిల్ చాలా మంచి టైటిల్. మన సినిమా కథ కి కూడా చక్కగా సూట్ అయ్యే టైటిలే..కానీ మనం ఆ టైటిల్ ని మన సినిమా కి పెట్టలేము..”
ఆ ఇంటర్వ్యూ లో జంధ్యాల గారు భారతీరాజా గారి విజన్ ని ప్రశంసిస్తూ..ఈ విషయాన్ని చెప్పారు.
మంచి సినీకబురు చెప్పారు. ఇద్దరూ ఇద్దరే! ఈ సినిమాఈ సినిమానే!!
By: కె.మహేష్ కుమార్ on 2009/06/25
at 4:21 సా.
Thanks for sharing this with us mohan raaz
By: sasank on 2009/07/01
at 4:49 సా.
most welcome (:-
By: mohanrazz on 2009/07/01
at 5:32 సా.
zuran mama…anthaa cheppi…assalu title Seethakoka Chilaka ani cheppadam marichi poyyava….
BTW..same article anthakumundu ekkado chadiva mama….
CPC (TIDB)
By: cpc on 2009/07/01
at 6:16 సా.
cpc mama..
//zuran mama…anthaa cheppi…assalu title Seethakoka Chilaka ani cheppadam marichi poyyava….//
@ modatlone cheppanu kadaa..”seetakoka chiluka sinima gurinchi jandhyala cheppina visheshaalu” ani (:-
intaku mundu oka saari tidb lo nene thread vesaa….
By: mohanrazz on 2009/07/01
at 6:37 సా.
good ,thats bharatee raaja
By: sriram velamuri on 2009/07/04
at 8:37 సా.