వ్రాసినది: mohanrazz | 2009/06/29

వీకెండ్ – డైరీ, ప్రయాణం చూశా

ముందు డైరీ చూసాను..శివాజీ తో ప్రాబ్లెం ఏంటీ అంటే – ‘మంత్ర’ బాగానే వుంది కదా అని నెక్స్ట్ టైం పరుగెత్తుకుంటూ వెళితే ‘ఇందు’ లో ‘మతి’ ఏమైనా వుందా అనిపించే సినిమాలు తీసి చితక్కొడతాడు..అలా రెండు మూడు సార్లు చితక్కొట్టించుకొని “ఇంక అవసరం లేదు లే బాసూ” అని వదిలేసుకున్నాక సడెన్ గా ఒక మంచి సినిమా వదులుతాడు. కాకపోతే ఈ మంచి సినిమా కి ముందు తీసిన మూడు కళాఖండాలు, తర్వాత వచ్చే మూడు ఆణి ముత్యాల మధ్యలో ఇది కొట్టుకుపోతుంది. మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే – “డైరీ” బాగుంది (Relatively). పూర్తి స్థాయి లో సమీక్షించడానికి ఓపిక లేదు కానీ టూకీ గా చెబుతా.

శివాజీ ఒక బంగళా కొంటాడు (ఊరికి దూరంగా). కొన్న రోజు రాత్రి అక్కడే పడుకుంటాడు. బయట భీబత్సమైన వర్షం. కరెంట్ లేదు. పొద్దు పోక బంగళా లో అటు ఇటు తిరుగుతూంటే ఒక డైరీ కనిపిస్తుంది. ఒక అమ్మాయి (హీరోయిన్) కి ఆ రోజు రాత్రి తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వాల్సి వస్తుంది. సరే – ఇద్దరూ కలిసి ఆ డైరీ చదవడం స్టార్ట్ చేస్తారు. ఆల్బర్ట్ అనే బిజినెస్ మ్యాన్ తన భార్య మోనా ఆ ఇంట్లో వుండేవాళ్ళనీ, ఇద్దరూ ఒకరినొకరు బాగా ప్రేమించే హ్యాపీ కపుల్ అనీ, ఆ తర్వాత అతని భార్య ఆ ఇంట్లో నే చనిపోయింది అనీ తెలుస్తుంది డైరీ చదివితే!. కానీ ఆ డైరీ చదివేకొద్దీ కొత్త కొత్త రహస్యాలు తెలియడం మొదలవుతాయి. మోనా ని చంపింది ఆల్బర్టే అనేది వాటిలో ఒకటి. చంపాక ఎవరికీ తెలీకుండా అదే బంగళా లో బయట పాతిపెట్టాడు అనేది ఇంకొకటి. చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఆల్బర్ట్ కి ఆ బంగళా లో మోనా మళ్ళీ కనించడం మొదలుపెట్టింది అనేది ఇంకొకటి. ఇలా ట్విస్ట్ మీద ట్విస్టు తో కథ ముందుకు పోతూ వుంటే ఆ డైరీ చదవడం ఆపివేయమంటుంది హీరోయిన్ (ఈమె పేరు మాయ) . వినకుండా అలాగే చదువుతానంటాడు శివాజీ. ఇంతలో హీరోయిన్ కనిపించకుండా పోతుంది బంగళా లో . హీరోయిన్ ని వెతుకుతూ, డైరీ చదువుతూ బంగళా లొ తిరుగుతున్న హీరో కి దిమ్మ తిరిగే ఇంకొక షాక్ – డైరీ లో మోనా ఫోటో చూస్తాడు. ఆ ఫోటో ఎవరిదో కాదు – “మాయ”ది . చనిపోయిన మోనా మళ్ళీ మాయ లాగా వచ్చిందా, అసలు ఆల్బర్ట్ బతికే వున్నాడా , ఆ డైరీ ఎందుకు సగమే వ్రాసి వుంది..ఆ తర్వాత ఖాళీ పేజీలు వున్నాయి..ఇలాంటి సందేహాల మధ్య కథ అసలే గందరగోళంగా వుంటే మళ్ళీ ట్విస్ట్. అనుకోకుండా పొరపాటున శివాజీ చేతిలో కత్తి గుచ్చుకుని మాయ చనిపోతుంది. ఇంక ఫైనల్ గా ఒక ట్విస్ట్ మిగిలి వుంది..ఆ ఒక్కటీ మీరు సినిమా లో చూడండి…యండమూరి వీరేంద్రనాథ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తాడు ఈ ఫైనల్ సీన్ లో…

“ప్రయాణం” గురించి ఇంకొక పోస్ట్ లో.


స్పందనలు

  1. అంటే బానే ఉందన్నమాట…చూడాలీ సినిమా!

  2. నేనూ మొన్నే చూసాను.అలా కదలకుండా కుర్చునే చూసాను వీరంద్రనాధ్ ట్విస్ట్ అదిరిపోయింది 🙂 ఇంకొకడెవడో ఇంకో డైరీ చదువుతున్నట్టు ముగించడం సూపర్.మరి ఈ సినిమాకి మంచి రాంకింగ్ ఎందుకు రాలేదో?అలాగే ఇంకో నచ్చిన సినిమా రైడ్.ఈ రెండు సినిమాలకి ఖశ్చితం గా మూడు పైన రాంక్ రావాలి.చిన్న హీరోలు వుండడం,చిన్న సినిమా అవ్వడమే ఈ సినిమాల దురదృష్టం అనుకుంటాను.

  3. నేను డైరీ చూడలేదుగానీ, ప్రయాణం చూశాను. ప్రయాణం కొంచెం భారంగా ఉందనిపించింది. చాలా టైట్ స్క్రిప్ట్.

    మీరు డైరీ కథ చెప్పిన తర్వాత దాన్ని చూసినా బావుండేదనిపిస్తుంది. 🙂

  4. డైరీ చాలా బాగున్నాది. మీ టపా చదివిన తరువత నే చూసాను. చాలా నచ్చినది. thanks for telling us about Dairy.

    • yeah..i liked the story..and yandamuri twist..అయితే కొంత మంది తో మాట్లాడితే వాళ్ళకి యందమూరి ఇచ్చిన కామెడీ ట్విస్ట్ నచ్చలేదుట- “ఉట్టి పుణ్యానికి హీరోయిన్ ని చంపేశారుగా” అని ఫీలయ్యారు..నాకైతే డీసెంట్ మూవీ అనిపించింది.

  5. aithe eppudaina khaalee dorikithe dairy choodaali


Leave a reply to radhika స్పందనను రద్దుచేయి

వర్గాలు