ఏదో మీకేమైనా గుర్తుందా? అప్పుడెప్పుడో ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’ రిలీజ్ అయినప్పుడు అనుకున్నా- “అబ్బో, ఎంత పెద్ద టైటిలో” అని. కానీ ఇప్పటి దాకా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ అయిన టైటిల్స్ లో అతి పెద్ద టైటిల్ – నాకు తెలిసి 94 లో నో 95 లో నో రిజిస్టర్ అయింది. బ్యానర్ ఏంటి, నిర్మాత ఎవరు అని అడక్కండి- నాకూ గుర్తు లేదు. టైటిల్ కూడా పూర్తి గా గుర్తు లేదు. ఆ సినిమా మొదలెట్టాక ఆగిపోయిందో, మొదలెట్టకుండానే ఆగిపోయిందో గుర్తు లేదు కానీ ఆ టైటిల్ అనౌన్స్ చేసినపుడు- తెలుగు లోనే కాదు, ప్రపంచం లోనే ఇది అతిపెద్ద సినిమా టైటిల్ అనీ దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి పంపిస్తున్నామనీ నిర్మాత చెప్పినట్టు అయితే బాగా గుర్తు.
మొత్తానికి ఈ సినిమా టైటిల్ లొ 74 అక్షరాలు (తెలుగక్షరాలు 74) ఉన్నట్టు గుర్తు.
టైటిల్: “రాజాధి రాజా రాజ మార్తాండ రాజ గంభీర…(మధ్యలో కొన్ని పదాలు నాకు గుర్తు లేవు)..శ్రీకృష్ణ దేవరాయ దొంగ రాజా”
ఇదీ ఆ టైటిల్. పూర్తి టైటిల్ ఎవరికైనా గుర్తుంటే చెప్పండి.
నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు వచ్చింది అనుకుంటా. నా ఫ్రెండ్గాడి పుస్తకం అట్టమీద ఉండేది. శివరంజనిలో ఒక పక్క ఇది ఇంకో పక్క భైరవద్వీపం ఉండేవి. నేను ఈ సంగతి చాలా మందికి చెప్పినా ఎవరికీ తెలియక పోయే సరికి నేను అబద్దం చెప్తున్నారు అనుకున్నారు. ఇన్నేళ్లకు నాకు ఒక మంచి సపోర్ట్ దొరికింది.
By: Chaithanya MS on 2009/06/30
at 12:38 సా.
మరి మీకేమైనా పూర్తి టైటిల్ గుర్తుంటే చెప్పండి..(:
By: mohanrazz on 2009/06/30
at 1:48 సా.
ఇదుగోండి పూర్తి టైటిలు. IMDB వాడినడిగితే చెప్పాడు.
శ్రీ శ్రీ రాజాధిరాజ శ్రీ శ్రీ మదన కామరాజ శ్రీ శ్రీ విలాస రాజ శ్రీ శ్రీ మధుబన రాజ శ్రీ శ్రీ కృష్ణదేవ దొంగ రాజా
పైన మధుబన అన్నది మధుపాన యేమో అని నా సందేహం.
By: బ్లాగాగ్ని on 2009/06/30
at 3:41 సా.
మొత్తానికి టైటిల్ పట్టేసారు..పైన వున్నది “మధుపాన” యే అనుకుంటా..అయితే ఇది కూడా పూర్తి టైటిల్ కాదేమోనని నా డౌట్. ఎందుకంటే దాదాపు 70 (or 74) అక్షరాల టైటిల్ అన్నట్టు బాగా గుర్తు.
By: mohanrazz on 2009/06/30
at 5:21 సా.
IMDB లింక్:
http://www.imdb.com/title/tt0391451/
By: mohanrazz on 2009/06/30
at 5:24 సా.
అవునండి, హీరోగా తమిళ నటుడు మస్సూరీ ఆలీ ఖాన్ అని కూడా ప్రకటించారు
By: తెలుగబ్బాయి on 2009/06/30
at 9:43 సా.
అవును బాసూ…బాగా గుర్తు పెట్టుకున్నారే!!!
By: mohanrazz on 2009/06/30
at 10:52 సా.
hi h ru
By: govind on 2011/04/17
at 10:43 సా.