చిరంజీవి సినిమా అంటే మమూలు గా నే ఆంధ్రా లో బాగా క్రేజ్. సినిమా హిట్టా, ఫట్టా అనే దానికి సంబంధం లేకుండా బాగా ఓపెనింగ్స్ ఉంటాయి. అయితే సినిమా హిట్టవుతుందా ఫట్టవుతుందా అనేది సినిమా లో పనిచేసిన వాళ్ళకి జనరల్ గా ఒక ఐడియా ఉంటది (అయితే వాళ్ళ అంచనాలు కూడా ఫెయిల్ అవ్వడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది). చిరంజీవి సినిమాలు రిలీజ్ అవడానికి ముందు జరిగే ఆడియో ఫంక్షన్స్ ని బాగా గమనిస్తే, సినిమా హిట్టా ఫట్టా అని గనక చిరంజీవి కి ముందే ఒక ఐడియా ఉంటే చిరంజీవి మాటల్లో ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది..
ఎందుకంటే- ‘జానీ ‘ సినిమా రిలీజ్ కి ముందు చిరంజీవి ఒక పేద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా వచ్చింది అంటే – “బాగా రాలేదు” అని బయటికి చెప్పలేక – “టెక్నికల్ గా బాగా వచ్చింది” అన్నాడు. ఆ సమాధానం తో తృప్తి చెందని విలేఖరి ఎన్ని సార్లు అదే ప్రశ్న ని ఇటు తిప్పి అటు తిప్పి అడిగినా ఒకటే సమాధానం- “టెక్నికల్ గా బాగుంది”. ఆ రోజే అనుకున్నా – జండా పై కపి రాజా అని. ఆ తర్వాత “అందరివాడు” అనే సినిమా ఆడియో రిలీజ్ చేసేటపుడు – సినిమా గురించి మాట్లాడకుండా కావాలనే – “గోవింద రాజు క్యారెక్టర్ ని ఎవరూ అనుకరించకండి, ఇది కేవలం పాత్ర రీత్యా ఆ క్యరెక్టర్ ని తాగుబోతు లాగా చూపించాం” గట్రా గట్రా మాట్లాడాడు. జై చిరంజీవ అప్పుడు కూడా – “మంచి వ్యక్తులతో పని చేసిన అనుభూతినిచ్చింది ఈ సినిమా” అంటాడే కానీ మంచి సినిమా తీసారు మా వాళ్ళు అనడు. స్టాలిన్ సంగతి గుర్తుండే వుంటుంది..”కమర్షియల్ గా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే మంచి సినిమా తీసామన్న తృప్తి మాకందరికీ ఉంది” అన్నాడు. ఇంక చిరుత కి ఏం చెప్తాడో చూసి దాన్ని బట్టి కొంచెం గెస్ చేద్దాం అనుకుంటే, తెలివి గా ఆడియో ఫంక్షన్ లేకుండా చేసారు. కొంత లో కొంత పాజిటివ్ గా మాట్లాడింది జల్సా సినిమా కే.
ఈ నేపథ్యం లో – మొన్న మగధీర ఆడియో ఫంక్షన్ లో ఏం మాట్లాడుతాడో అని జాగ్రత్త గా చూసాను. చాలా రోజుల తర్వాత చిరంజీవి పూర్తి గా పాజిటివ్ గా మాట్లాడాడు. రాజమౌళి ని నంబర్ 1 డైరెక్టర్ అన్నాడు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడాడు. పాటల గురించి ఏమీ మాట్లాడకుండా ఓన్లీ సినిమా బాగా వచ్చింది అన్నట్టు మాట్లాడాడు. మరి నిజంగానే సినిమా అంత బాగా వచ్చిందా? వాళ్ళు అంచనా వేసినట్టు గానే జనాలకి కూడా ఎక్కుతుందా? అనేది తెలియాలంటే – ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!!!
good to see your blog ..
By: a2zdreams on 2009/07/02
at 8:24 సా.
HIT or FLOP doesn’t matter to me. నేను చూసిన తీరుకు, మీరు చూసిన తీరుకు చాలా వత్యాసం వుంది. చిరంజీవిని నేను రాజకీయ కోణంలోనే చూస్తున్నాను. KEEP WRITING YOUR VIEWS ..
By: a2zdreams on 2009/07/02
at 8:28 సా.
thanks boss..
By: mohanrazz on 2009/07/02
at 10:54 సా.
asalu ilaa raayadam lo mee vuddesham enti mohan razz naaku artham kaaledhu……………..cinema hit fatta ani predict cheyydam chaala kastham…bayataki vacchentavaraku emi cheyyalem
By: sasank on 2009/07/03
at 8:44 ఉద.
పెద్ద ఉద్దేశ్యమేమీ లేదు బాస్..స్టాలిన్ ఆడియో చూసేటపుడు – చిరంజీవి “కమర్షియల్ గా ఈ సినిమా ఎలా పే చేస్తుందనే దాన్ని ప్రక్కన పెడితే …” అనగానే ఫ్యాన్స్ గుండెలు అలా జారిపోయాయి..ఎందుకలా అన్నాడనేది..సినిమా చూసాక క్లియర్ గా అర్థం అయింది..సో చిరంజీవి ఏ ఆడియో అప్పుడు ఏం మాట్లాడాడు అని గుర్తు చేసుకుంటే ఈ చిన్న అబ్సర్వేషన్స్ గుర్తుకు వచ్చాయి. అవి పంచుకుందామనే! అయినా ఇదంతా జస్ట్ పిచ్చాపాటి కబుర్లు !!అంతే!
By: mohanrazz on 2009/07/03
at 10:03 ఉద.
mohanrazz meeru chaala baaga raastunnaru… manchi time pass.. oka manchi coffee lanti blog la vunnadi.. inka ilaage chaala posts vastaayani aasistooo…
Prdaeep,
Oo manchi abbayi…
By: pradeep on 2009/07/09
at 6:34 సా.
[…] రిలీజ్ కు ముందే తెలిసిపోతుందా ? జురాన్ సినిమా బ్లాగులో మగధీర హిట్టేనని చిరంజీవి మాటలలో […]
By: సినిమా హిట్టో, ఫట్టో రిలీజ్ కు ముందే తెలిసిపోతుందా ? « a2z డ్రీమ్స్ on 2009/07/16
at 8:16 సా.
అన్నయ్యా..ఇప్పుడే అక్కడ చదివి ఇటువస్తున్నా.. 🙂
By: mohanrazz on 2009/07/16
at 8:21 సా.
“హిట్” అంతర్గతంగా ముడిపడి వున్నా, చరణ్ ను ఒక పెద్ద హీరోగా ప్రొజెక్ట్ చెయ్యడమే మగధీర సినిమా ప్రధాన లక్ష్యం అని నా వుద్దేశం. 🙂
By: a2zdreams on 2009/07/16
at 10:05 సా.
[…] ఆ మధ్య మగధీర ఆడియో ఫంక్షన్ అవగానే ఇలాంటి హెడ్డింగ్ తో ఒక పోస్ట్ వేసాను. లింక్ ఇక్కడ. […]
By: హిట్టా ఫట్టా ? చిరంజీవి మాటల్లోనే హింట్: నాయక్ « జురాన్ సినిమా on 2012/12/18
at 2:10 సా.