వ్రాసినది: mohanrazz | 2009/07/05

“మహరాజు” Vs “The Pursuit of Happiness”

 అప్పుడెప్పుడో ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ – “The Pursuit of happiness”  సినిమా చూసేటప్పుడు – literally I cried yaar  అన్నాడు. వార్నీ వీడికి ఇంత కళా పొషణ వుందా అనిపించి – అయినా వీణ్ణి కూడా ఏడ్పించిందంటే ఏమి వుంటుందా అనుకుంటూ నెక్స్ట్ డే ఈ సినిమా చూసాను.  మా వాడి రేంజ్ లొ (literally cried yaar ) కాకపోయినా నన్ను కూడా బాగానే కదిలించింది.ఈ సినిమా చూస్తున్నపుడు – నాకు తెలియకుండానే ‘మహారాజు ‘ అనే తెలుగు సినిమా తెగ గుర్తుకు వచ్చింది.

“The pursuit of happiness” కథ:

క్రిస్ గార్డ్నెర్ అనే ఒక సేల్స్-మేన్ తన లైఫ్ లో చాలా ఢక్కామొక్కీలు తిని,కష్టాలు అనుభవించి – చివర్లో ఒక పెద్ద కంపెనీ పెట్టే స్థాయి కి ఎదుగుతాడు – ఒక్క ముక్క లో ఇదీ కథ. ఒక వ్యక్తి నిజ జీవిత గాథ ఆధారంగా దీన్ని తీసారట. క్రిస్ గార్డ్నెర్ సేల్స్ మేన్ గా పని చేస్తూ – తనకి వచ్చే చాలీ చాలని జీవితం తో లైఫ్ గడుపుతూ, తన కొడుకు, భార్య కి ఇంకా మంచి లైఫ్ ఇవ్వడానికి తను ఇంకా సంపాదించడానికి తపన పడుతూంటాదు. అయితే ఇతన్ని అసమర్థునిగా జమకట్టి భార్య ఇతన్ని వదిలేసి వెళ్ళడం,దాంతో కొడుకు ని తనే పెంచటం, ఈ మధ్యలో ఒక స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ లో ఇంటర్న్-షిప్ జాయిన్ అయ్యి జీతం లేకుండా 6 నెలలు పనిచేయడం, ఆ టైం లో ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువయిపొవడం ,అద్దె ఇవ్వట్లేదని వీళ్ళ ఇంటి ఓనర్ ఇంట్లో నుంచి వీళ్ళని బయటకి పంపేయడం, – ఒక పాయింట్ ఆఫ్ టైం లో రక్తం అమ్ముకుని రోజు గడపడం లాంటి చాలా సంఘటన లతో సాగుతుంది కథ. అడుగడుగునా విధి వెక్కిరిస్తూ ఎక్కడా కొంచెం కూడా లక్ అనేది కలిసిరాకుండా..దురదృష్టం వెంటబడి తరుముతూంటే..అన్నిటినీ ఎదుర్కొని నిలబడి చివరికి పేద్ద కంపెనీ కి ఓనర్ అవడం..బాగా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సినిమా…అయితే, సినిమా లో మనల ని కట్టిపడేసే అంశాలు చాలా చాలా వున్నాయి. మొదటిది- ఎన్ని కష్టాలు వచ్చినా తన యాటిట్యూడ్ ని, తన ఆత్మ విశ్వాసాన్ని, తన ఫోకస్ ని సడలించకుండా క్రిస్ ముందుకెళ్ళడం చాలా ఇన్ స్పైరింగ్ గా వుంటుంది.రెండోది విల్ స్మిత్ పర్ఫార్మెన్స్. 6 నెలలు జీతం లేకుండా అప్రెంటిస్ చేసిన తర్వాత తన ఉద్యోగం కంఫర్మ్ అయినపుడు విల్ స్మిత్ యాక్షన్ కదిలించేస్తుంది. అప్పుడు ఆఫీస్ లోంచి బయటికి వచ్చాక – ‘This is happiness” అనే డైలాగు కూడా.

మహారాజు :

అయితే పైన ప్రస్తావించిన ‘మహారాజు ‘ సినిమా కి దీనికి కథాపరంగా ఎలాంటి పోలికలు లేవు. అందులో శొభన్ బాబు హీరో. విజయబాపినీడు డైరెక్షన్. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే, తన తమ్ముళ్ళని, చెల్లెలి ని చదివించడానికి తను పనికి వెళతాడు. తన జీవితమంతా వాళ్ళ గురించే గడుపుతాడు. పెళ్ళి కూడా – డబ్బు అవసరమయితే, పెళ్ళి చేసుకుంటే వచ్చే కట్నం తమ్ముడి చదువు కి పనికి వస్తుంది అని అమ్మాయిని కూడా చూడకుండా పెళ్ళి చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి ఆ డబ్బు ఇవ్వలేకపోయినా ఆమె ని బాగా చూసుకుంటాడు. తమ్ముళ్ళు, చెల్లెలు ఏమో లైఫ్ లో బాగ సెటిల్ అయ్యాక అన్న ని ఛీత్కరించుకుంటారు. ఇంతలో ఒక ప్రెస్ లో ప్రూఫ్ రీడర్ గా చేరడం, కాస్త పుస్తకాలు చదివాక తనకీ రాయాలనిపించడం, తన భార్య ప్రోత్సాహం తో ఆ పుస్తకాన్ని పూర్తి చేయడం జరుగుతాయి. అయితే ఆ పుస్తకం అచ్చు అయి తనకి పేరు, డబ్బు వచ్చే సమయానికి ఒక ప్రమాదం లో భార్య చనిపోతుంది. డబ్బు వచ్చే సరికి దూరమైన తమ్ముళ్ళు చెల్లెలు అందరూ దగ్గరికి వస్తారు – కానీ అతని కష్టాలన్నిటి ని పంచుకున్న భార్య మాత్రం ఆ కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని అనుభవించకుండగానే చనిపోతుంది. మంచి సెంటిమెంట్ తో చాలా బాగుంటుంది సినిమా..

నాకు బాగా ఇష్టం ఇందులోని సాంగ్..

“…….

మనసంటూ లేనోళ్ళే నిరుపేదలు,
మనసున్న మంచోళ్ళే మహరాజులు,
రాజువయ్యా మహరాజువయ్యా… “


స్పందనలు

 1. hello sir,

  ee blog chaala interesting gaa vundi
  I always enjoy going through this blog
  wonderful job
  keep it up

  Kalyan

  (Mellacheruvu Kalyan Ram)

 2. Mohan, that movie name is The Pursuit of Happiness, but not My Pursuit of Happiness.
  See this link for more details
  http://www.imdb.com/title/tt0454921/


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: