వ్రాసినది: mohanrazz | 2009/07/08

“మంచి కాఫీ లాంటి సినిమా”నా లేక “Joy of Life??”

ఆనంద్ సినిమా షూటింగ్ జరిగే కొత్త లో శేఖర్ కమ్ముల ని ఎవరో ఇంటర్వ్యూ లో అడిగారు. మీ సినిమా పేరు “ఆనంద్” అంటున్నారు కదా మరి దానికి కాప్షన్ లాంటిది ఏదైనా తగిలిస్తున్నారా అని.

శేఖర్ అన్నాడు – “అవును ఈ మధ్య ప్రతి సినిమా కి ఏదో ఒక కాప్షన్ పెడుతున్నారు..ఆనంద్ సినిమా కి కూడా పెట్టాలి. ఇప్పటిదాకా కాప్షన్ అంటూ నేనైతే ఏదీ అనుకోలేదు కానీ ఒకవేళ కాప్షన్ పెట్టల్సి వస్తే “Joy of Life” అని పెడతాను అన్నాడు. నాక్కూడా అది బాగానే ఉందనిపించింది. “ఆనంద్” అనే పేరు కి తగ్గట్టుగానే కాప్షన్ కూడా ఉందనిపించింది.
 
అయితే చివరికొచ్చేసరికి “మంచి కాఫీ లాంటి సినిమా” అనేది కాప్షన్ గా సెటిలయిపోయింది. శేఖర్ ఫ్రెండెవరో ప్రివ్యూ చూసాక సినిమా ఎలా వుంది అని అడిగితే శేఖర్ తో అన్నాట్ట- “మంచి కాఫీ తాగినట్టుంది” అని. ఇదేదో బాగానే ఉందనిపించి శేఖర్ కమ్ముల దాన్నే కాప్షన్ గా పెట్టేసాడు. నిజానికి “ఆనంద్” లాంటి చిన్న సినిమా కి ఈ కాప్షన్ చేసిన హెల్ప్ అంతా ఇంతా కాదు. కాప్షన్ చూసాక కొంతమంది లో సినిమా పట్ల ఒక ఆసక్తి కలిగిన మాట వాస్తవమే!! ఓపెనింగ్స్ కొంచెం బాగా రావడానికి కాప్షన్ దోహదపడిన మాటా వాస్తవమే!!!

అయితే సినిమా కథ పరంగా కానీ, సినిమా లో “ఆనంద్” పాత్రపరంగా చూసినా కూడా -“Joy of Life” అనే కాప్షనే సినిమా కి ఇంకా యాప్ట్ అనిపిస్తుంది. అయితే “యాప్టా?” కాదా అనే దానికంటే – మన టార్గెట్ కరెక్ట్ గా రీచ్ అయ్యామా లేదా అనేదే ఇంపార్టెంట్- అది టైటిల్ అయినా లేక కాప్షన్ అయినా..!!!ఏమంటారు???


వ్యాఖ్యానించండి

వర్గాలు