వ్రాసినది: mohanrazz | 2009/07/11

సినిమా స్క్రిప్ట్ రచనా శిల్పం

ఈ పుస్తకం మీలో కొంతమంది చదివే ఉంటారనుకుంటాను. సావిత్రి బ్లాక్ & వైట్ ఫోటో తో కూడిన కవర్ పేజీ తో ఆకర్షణీయంగా ఉంటుంది పుస్తకం. నేను ఇంజనీరింగ్ లో ఉన్నపుడు రిలీజ్ అయిందనుకుంటా. అప్పట్లో తెగ చదివేవాణ్ణి ఈ పుస్తకాన్ని. నేను ఈ పుస్తకం చదివుతూంటే మా ఫ్రెండ్స్ కొంతమంది అడిగే వాళ్ళు నన్ను- “ఇంతకీ ఈ పుస్తకం వ్రాసినాయన ఎన్ని సినిమాలు తీశాడు? వాటిలో ఎన్ని సక్సెస్ అయ్యాయి??” అని. నేను ఏదో కవర్ చేసేవాణ్ణి. సివిల్స్ కోచింగ్ వెళ్తే ఐఏఎస్ లు వచ్చి క్లాస్ తీసుకోరు, అది మిస్ అయిన వాళ్ళే క్లాస్ చెబుతారు అని. ఇంతకీ ఈ పుస్తకం వ్రాసినతని పేరు చిమ్మని మనోహర్. మీరు సిడ్ ఫీల్డ్ వ్రాసిన స్క్రీన్ ప్లే పుస్తకాల తోనూ, ఇంగ్లీష్ లో వచ్చిన ఇంకొన్ని పుస్తకాలతోనూ పోల్చకుండా మన తెలుగు సినిమాల వరకు గనక మీ ఆలోచనల్ని పరిమితం చేస్తూ చదివితే ఇది చాలా మంచి పుస్తకమే! తెలుగు సినిమాల్నే ఉదహరిస్తూ, అన్ని అంశాలు కవర్ చేస్తూ, ఇంట్రెస్టింగ్ గా- బాగుంటుంది ఈ పుస్తకం. నిజానికి ఈ పుస్తకానికి ఆ యేటి నంది అవార్డ్ కూడా వచ్చింది. ప్రతి సంవత్సరం సినిమాల గురించి వచ్చిన ఒక తెలుగు పుస్తకానికి  నంది అవార్డ్ ఇస్తారు.

                                   

ఇదిలా ఉంటే ఓ రోజు ఈనాడు పేపర్ చూస్తే “రాజా” హీరో గా ఒక సినిమా అనౌన్స్ అయింది, ఈ చిమ్మని మనోహర్ దర్శకత్వం లో. “కల” అనే పేరు తో వచ్చిన ఆ సినిమా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కూడా ఏదో ఒక థ్రిల్లర్ తరహా సినిమా అనౌన్స్ అయింది ఆయన దర్శకత్వం లో. అది రిలీజ్ అయిందో లేదో నాకు తెలీదు. అయితే ఓ మూడేళ్ళ క్రింద అనుకుంటా, ఎక్కడో ఆయన మెయిల్ ఐడి కనిపిస్తే ఒక మెయిల్ చేసాను. ఆయన కూడా పాపం ప్రాంప్ట్ గా రిప్లై ఇచ్చాడు. ఆయన పుస్తకానికి నేనెంత ఫ్యానో చెప్తూనే, “తనది కేవలం అకేడమిక్ నాలెడ్జ్ కాదు” అని ఆయనే ప్రూవ్ చేసుకోవాల్సి ఉందని నేనంటే – ఆయన కూడా దాన్ని అంగీకరిస్తూనే పుస్తకాల్లాంటి వాటి లో తాను వ్రాయలేనటువంటి ఫ్యాక్టర్స్ ఎన్నో ఫిల్మ్ మేకింగ్ అప్పుడు ఎదురొస్తుంటాయని, ఎదురొచ్చాయనీ చెప్పుకొచ్చారు.

 

అదండీ సంగతి. ఒక ప్రక్క ఫిల్మ్ మేకింగ్ లో ఓనమాలు తెలీకుండానే కత్తి లాంటి అసిస్టెంట్ లని, కో డైరెక్టర్లని పెట్టుకుని ప్యూర్లీ “పీపుల్ మేనేజ్ మెంట్ ” తో డైరెక్షన్ ని నెట్టుకొచ్చే దర్శకులు ఒక వైపు, అకెడమిక్ నాలెడ్జ్ మాత్రమే వుండి ప్రాక్టికల్ గా ఫెయిల్ అయ్యే వాళ్ళు మరొక వైపు, అకెడమిక్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి ఏదో ఒక కారణం వల్ల ఫెయిల్ అయ్యి సక్సెస్ కోసం మొహం వాచి ఉన్న దర్శకులు ఇంకొక వైపు – అందరినీ ఆకర్షించేది – సిని”మాయే” .


Responses

  1. Hi,
    Nice to see this information, I request you please provide the Manohar Mail id. I am very interested in Film Making side, but i am not financially sound to take course in good film institutes. So if you can provide his mail id i will request him if there is any chance to work under his direction.

    Thanks in Advance,
    Venkata Ramarao
    ramnv4u@gmail.com


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: