వ్రాసినది: mohanrazz | 2009/07/15

టివి 5 యాంకర్ – సెన్స్ ఆఫ్ హ్యూమర్

 

టి వి 5 లో ఉదయం వచ్చే బిజినెస్ బిజినెస్ ప్రోగ్రాం ని ప్రతిరోజూ రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాణ్ణి అప్పట్లో. ఆ ప్రోగ్రాం కి యాంకర్ గా వసంత్ అనే అతను వచ్చాడు కొద్ది రోజులపాటు. ఇతని యాంకరింగ్ ఎలా వుంటుంది, ఇతని బిజినెస్ నాలెడ్జ్ ఎంత అనే విషయాల్ని పక్కన పెడితే ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చేది నాకు. వళ్ళంతా చమత్కారమే ఇతగాడికి.

ఈ ప్రోగ్రాం రోజూ 30 నిమిషాలు వస్తుంది. ఎవరైనా కాల్ చేసి వాళ్ళ ప్రశ్నలడిగితే, ముగ్గురు నిపుణులుంటారు, వాళ్ళల్లొ ఎవరో ఒకరు సమాధానాలు చెబుతుంటారు. కాల్ బాగా బిజీ గా ఉంటుంది కాబట్టి ఫోన్ తగిలిన వాళ్ళు జనరల్ గా “సార్, నేను ఫలానా షేర్ కొన్నను. ఆల్ రెడీ సగం రేటుకి పడిపోయింది ఇంకా వెయిట్ చేయమంటారా లేక వదిలించుకోమంటారా?” అనో, “సార్ నేను కొన్న షేర్ బానే పెరిగింది, ఇంకా పెరుగుతుందా లేక ‘..వచ్చిందే కట్నం’ అనిఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా?” అనో అడుగుతుంటారు. అయితే ఒకసారెపుడో ఒకాయన తన సొంత డబ్బులతో ఫోన్ కాల్ చేసి –
సార్, ఇప్పుడూ.. అది… ఆ రిలయన్స్ మీద కోర్ట్ కేస్ నడుస్తొంది కదా సార్, అది ఏమయింది సార్ ఆ కేస్?” అని అడిగాడు. దానికి మన వసంత్, గంభీరంగా ఫేస్ పెట్టి, బేస్ వాయిస్ లో –

“..చూస్తోంటే, అంబానీ సోదరులతో పాటు మీరు కూడ ఈ కేసు మీద బాగా ఆసక్తిగా ఉన్నట్టున్నారు..”  అన్నాడు.

నేను దీన్ని కరెక్ట్ గా మీకు కన్వే చేయగలిగానో లేదో తెలీదు కానీ ఆరోజు చూసేటపుడు మాత్రం – ఈ వసంత్ అనే క్యాండిడేట్ కి ఒళ్ళంతా చమత్కారమే అనిపించింది. లేక పోతే, తన సొంత డబ్బుతో ఫోన్ చేసిన మనిషి తన షేర్లేమైనా ఉంటే (అది రిలయన్స్ అయినా సరే!) పెరుగుతుందో లేదో కనుక్కోక కోర్ట్ తీర్పు ఏంటి, వీళ్ళ తరపున లాయర్ ఏమంటున్నాడు, వాళ్ళ తరపున లాయర్ ఏమంటున్నాడు, ఇవన్నీ ఆయనకెందుకో!

 

ఆ మధ్య ఒకాయన్ ఫోన్ చేసి –

“సార్, నేను ఫలానా షేర్ నుంచి మొన్ననే ఎస్కేప్ అయ్యాను సార్” అంటున్నాడు. వసంత్ నవ్వాపుకుంటూ ఆయన్ని కరెక్ట్ చేసాడు –

ఏవండీ, ఎస్కేప్ కాదండీ, ఎగ్జిట్, ఎగ్జిట్ అయ్యాను అనాలి”


ఆయన కూడా – “అదే సార్ మొన్ననే ఎగ్జిట్ అయ్యాను ఆ షేర్ నుంచి” అని కవర్ చేసుకున్నాడు.
 

అలాగే ఇంకో సారి ఒకాయన ఫోన్ చేసి ఏదో షేర్ గురించడిగాడు. యువ అనలిస్ట్ శేషుగారేమో –

 “అది ఎక్సలెంట్ గా ఉందండీ, కొనేయండి ఏం పర్లేదు” అన్నాడు. వెంటనే సీనియర్ అనలిస్ట్ కుటుంబరావు గారు –

“అరెరే, వద్దండీ. ఆ షేర్ జోలికి వెళ్ళకండి, ఇంతకంటే వరస్ట్ షేర్ ఇంకొకటి లేద“న్నాడు. చూస్తున్న జనాలకి, ఫోన్ చేసినాయనకి కంఫ్యూజన్ తెగక చస్తూంటే- మధ్యలో ఈ వసంత్ తనకి వస్తున్న నవ్వునాపుకుంటూ –

“అదండీ సంగతి, మీకు శేషు గారి మీదనమ్మకమెక్కువ ఉంటే ఈ షేర్ కొనండి, కుటుంబరావు గారిమీద నమ్మకమెక్కువ ఉంటే మానేయండి” అని తేల్చి అవతల పడేసి అనలిస్టుల మధ్య వాళ్ళలో వాళ్ళకే చిచ్చుబెట్టడానికి ట్రై చేశాడు 🙂


Responses

 1. 🙂

 2. టి.వి 9 వాళ్ళు, ఎక్కడైనా గొడవ జరిగితే చాలు, ఇరు పార్టీల వాళ్ళని ఇంటర్వ్యూ చేసే పధ్ధతి చూస్తే నవ్వొస్తుంది. నిజంగా ఏమీ గొడవ లేకపోయినా సరే, వీళ్ళే ఎదో మొదలెట్టి విపరీతార్ధాలు తీసి, రోజంతా అదే చూపించడంలో వీళ్ళకెవరూ సాటి లేరు.

 3. అబ్బాయి కి తెలివీ, సెన్సాఫ్ హ్యూమరూ ఎక్కువని మనం అనేసుకుంటామని భ్రమ అన్నమాట.ఇలా ఏకేసుకుంటామని తెలీనంత వెర్రి తనమన్నమాట. ఇలాంటి అతి తెలివి రాయుళ్లని చూస్తుంటే పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నిజంగా!

 4. mohanrazz gaaru,

  ఆ కేసుని బట్టే ఆయా share prices లో ఒడిదుడుకులు ఉంటాయి.
  మీకు తెలియదేమో కానీ ఎక్కడో అమెరికాలో తుమ్మితే ఇక్కడి మార్కెట్లకి జలుబు చేస్తుంది.

  • భలేవారే- నేను డబ్బులు పెట్టిన ప్రతిసారీ, సాయంత్రానికల్లా అమెరికా మార్కెట్లకి జలుబు చేసి, మర్నాటికి ఇండియా మార్కెట్ కి స్వైన్ ఫ్లూ వచ్చేది!! అందుకే పైన ‘ ఈ ప్రోగ్రాం ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాణ్ణి “అప్పట్లో” ‘అన్నాను 🙂

 5. కేక!!!! కెవ్!!!!!!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: