వ్రాసినది: mohanrazz | 2009/07/17

“సింగీతం” చెప్పిన ఇంట్రెస్టింగ్ సినీ కోట్:

ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పకవిమానం, విచిత్ర సోదరులు లాంటి ఎన్నో విభిన్న చిత్రాలు తీసిన దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ని అభిమానించే తెలుగు ప్రేక్షకులకి కొదువలేదు. బ్రెయిన్ ని స్విచ్ ఆఫ్ చేయకుండానే చూడదగ్గ ఎన్నో మేలిమి చిత్రాలు అందించిన డైరెక్టర్ ఆయన. అయితే కొంతమంది ఆయనని “క్లాస్” డైరెక్టర్ అంటారు. అయితే ఎవరినైనా క్లాస్ డైరెక్టర్ అని అనడం లో ఆయన నేలక్లాస్ ఆడియెన్స్ ని మెప్పించే సినిమాలు తీయడం చేతకానివాడు అని చెప్పే “కుతంత్రమూ” ఉంది.

 

అన్నమయ్య సినిమా రిలీజ్ అయిన టైం లో అనుకుంటా ఈయన ఏదో ఛానెల్ లో వేరే ఏదొ సందర్భాన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. పిచ్చాపాటి మాట్లాడుతూ ఈ క్లాస్-మాస్ అనే డిస్కషన్ ఏదో వస్తే ఒక మాట చెప్పాడు. చాలా డెప్త్ ఉన్న చిన్న మాట. ఆయన చెప్పింది చాలా ఇంటలెక్చువల్ మాట అనిపించింది. నాకు భలే నచ్చి, అలా గుర్తుండిపోయింది. ఇంతకీ ఆయన చెప్పిందేంటంటే –

             “మాస్ లో ఉన్నంత క్లాస్- క్లాస్ లో కూడా లేదు

అర్థమవలేదా? ఆయనే దీన్ని ఎక్స్ ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. మాయాబజార్ సినిమా అట, మొదట్లో రిలీజ్ అయినప్ప్పుడు ఈ సో కాల్డ్ క్లాస్ ప్రేక్షకులు పెదవి విరిచారట. ఎన్ టీఆర్ కి గెటప్ నప్పలేదన్నార్ట. రకరకాల రంధ్రాన్వేషణలు చేసి కథ లో లోపాలు వెతికార్ట. అయితే ఇవేవీ పట్టని మాస్ జనం మాత్రం సినిమాని అక్కున చేర్చుకున్నార్ట. సినిమా పెద్ద హిట్ అయ్యాక ఇదే విమర్శకులూ, క్లాస్ ప్రేక్షకులూ..”ఇదో క్లాసిక్” అని తీర్మానించేసారట. అలాగే అన్నమయ్య సినిమా మీద అప్పుడు ఉన్న (రిలీజ్ అయిన కొత్త లో ) కాంట్రవర్సిటీల్ని కూడా ప్రస్తావించాడు. “ఈ రోజు చాలా మంది విమర్శకులూ, సో కాల్డ్ క్లాస్ ప్రేక్షకులూ.. అన్నమయ్య కి నిజంగా మీసాలుండేవా?, అన్నమయ్య కి డ్యూయెట్స్ ఏంటీ అని ప్రశ్నిస్తుంటే, అటుప్రక్క మాస్ ప్రేక్షకులు ఇవేవీ పట్టకుండా సినిమా ని ఆదరిస్తున్నారు. చూస్తూ ఉండండి, అన్నమయ్య సినిమా నాగార్జున కెరీర్ లో నే ఒక మైలు రాయి అవుతుంది” అన్నాడు. అలాగే, ” అంటే మాస్ ఆదరించిన ప్రతీదీ క్లాసిక్ అని కాదు నేను చెప్పేది, మాయాబజార్ లాంటి క్లాసిక్స్ ని కూడా సో కాల్డ్ క్లాస్ ప్రేక్షకులు ముందు ఆదరించలేదు – ఆ క్లాసిక్ నేచర్ ని పట్టుకోవడం లో మాస్ ఎప్పుడూ క్లాస్ కంటే నాలుగడుగులు ముందే ఉంటుంది అని నా ఉద్దేశ్యం” అని ముగించాడు. 

 

నిజంగా వెటరన్ డైరెక్టర్ అయిన ఆయన చెప్పింది అక్షరసత్యం అనిపించింది నాకైతే!!!!!


Responses

  1. baguMdanDi.singitam gAri gurinchi nEnu rasina ee post kUdA vIlaitE chUDamdi.
    http://trishnaventa.blogspot.com/2009/07/blog-post.html

  2. బాగుంది

  3. baaga chepparu class ani cheppukune vaallu eppudu cinemani criticize chestu choostaaru……………..but mass ala kaadu nachhite chostara .class people la reviews dabbulu bokka ane matalu maatladaru……….


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: