వ్రాసినది: mohanrazz | 2009/07/20

కె. విశ్వనాథ్ “చిన్నబ్బాయి” ఎందుకు ఫ్లాప్ అయ్యింది :-)

 ఒకసారెప్పుడో టివి లో “చిన్నబ్బాయి” సినిమా చూస్తున్నా, ఫ్రెండ్స్ తో కలిసి.  కొన్నిసార్లు ఏదైనా సినిమా బాగా అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిసాక చూస్తే- “పర్లేదే, బానే వుందే, ఎందుకంత అట్టర్ ఫ్లాప్ అయింది?” అనిపిస్తూంటూంది. బహుశా లీస్ట్ ఎక్స్ పెక్టేషన్స్ తో సినిమా చూడటమే దీనికి కారణం అనుకుంటాను. అలాగే ఇంకొన్ని సార్లు ఏదైనా సినిమా సూపర్ డూపర్ హిట్టయిందని, అద్భుతం, అమోఘం, కెవ్వు కేక అని జనాలంతా చెప్పిన తర్వాత చూస్తే- “బాగానే ఉంది కానీ, మరీ అంత ఎక్స్ట్రార్డినరీ గా ఏమీ లేదు” అనిపిస్తూంటుంది- బహుశా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల కావచ్చు. ఇది మనలో చాలామంది కి తెలిసిన, అనుభవం లో కి వచ్చిన సంగతే అనుకుంటా.

 

సరే, కె. విశ్వనాథ పాత సినిమాల గురించి మధ్య మధ్య లో కబుర్లు చెప్పుకుంటూ, పిచ్చాపాటి మాట్లాడుతూ “చిన్నబ్బాయి” చూస్తున్నాం. చూస్తూంటే- మా ఫ్రెండ్ అన్నాడు-

బాగానే ఉంది గా సినిమా, ఎందుకంత ఘోరంగా ఫ్లాపయ్యింది అప్పట్లో“. దానికి ఇంకొక ఫ్రెండ్ సమాధానం చెప్పాడు .

కె. విశ్వనాథ్ కి ఒక టైటిల్ సెంటిమెంట్ ఉంది. ఆయన తీసిన హిట్ సినిమాల్లో తొంభై శాతం సినిమాలు ‘S’ అనే అక్షరం తో స్టార్ట్ అవుతాయి. శంకరాభరణం, స్వాతిముత్యం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వయం కృషి, స్వర్ణకమలం, శుభవేళ, శుభ సంకల్పం..అలాగ అన్ని ‘S’ తో నే స్టార్ట్ అవుతాయి..

అయితే, ఇప్పుడు ఓవరాల్ గా ఏమంటావ్??”

“..కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ నాకు తెలిసి, టైటిలే 🙂 . ఈ సారి కూడా టైటిల్ ని “చిన్నబ్బాయి” అని కాకుండా….”సిన్నబ్బాయి” అని పెట్టి ఉంటే….” అంటూండగానే, ఇంకో ఫ్రెండ్ ఆ వాక్యాన్ని ముగించాడు –

…పెట్టిఉంటే, కనీసం “సూసే”టోళ్ళయినా “సూసేసి” సినిమాని సూపర్ హిట్ “సేసే”టోళ్ళంటావ్, అంతేనా?

“హి హి హి,  అంతే 🙂 ”


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: