వ్రాసినది: mohanrazz | 2009/07/21

ఫిల్మ్ మేకింగ్ – హాలివుడ్ Vs టాలివుడ్

సినిమా తీయడం ఒక పెద్ద ఆర్ట్. మన తెలుగు సినిమాలు చూడగలగడం ఇంకా పెద్ద ఆర్ట్. ఆ ‘ఇంకా పెద్ద ఆర్ట్’ గురించి మరెపుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ‘పెద్ద ఆర్ట్’ గురించి మాట్లాడుకుందాం. సినిమా తీయడానికి ఒక పద్దతి, ఒక విధానం ఉంటాయి. అవి ఇండస్ట్రీ ని బట్టి (హాలివుడ్డా, టాలివుడ్డా, మాలివుడ్డా, కోలివుడ్డా ?? ) మారుతూ ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ తెలీక కొన్ని సార్లు కొంత మంది ఫిల్మ్ మేకర్స్ బోల్తా పడుతూంటారు. అలా ఇక పై ఎవరూ బోల్తా పడకూడదనే ఈ పోస్ట్.
 
ఫిల్మ్ మేకింగ్ – హాలివుడ్ లో అయితే –
 

 SPL-(ఇదే ఆర్డర్ లో చేయడం అనేది చాలా ముఖ్యం. ఆర్డర్ తప్పితే బొల్తా పడ్డట్టే..!)

1. కథ తయారు చేసుకోవాలి.
2. కథ చెప్పే (నేరేట్ చేసే ) విధానం నిర్ధారించుకొవాలి . ఉదాహరణకి – కథ ని ఫ్లాష్ బాక్ లో చెప్పాలా లేక నేరు గా చెప్పాలా, నాన్-లీనియర్ ఫ్యాషన్ లొ చెప్పాలా లేక ఇంకేదైనా కొత్త పద్దతి లో చెప్పాలా అనేది నిర్ధారించుకొవాలి. స్క్రీన్ ప్లే వ్రాసుకోవాలి.
3. సినిమా షూట్ చేయడానికి ఉపయోగించవలసిన టెక్నాలజీ నిర్ధారించుకోవాలి. ఉదాహరణకి ఫలానా సీన్ కి అండర్-వాటర్ కెమెరా వాడాలా లేక ఆ అవసరం లేదా? 35 mm కెమెరా వాడాలా? లేక ఇంకేదైనా కొత్త టెక్నాలజిని ఉపయోగించుకోవలసిన అవసరం ఉందా ఈ కథ ని చెప్పడానికి? ఇలాంటివన్నమాట!
4. ‘నటీనటుల ‘ కాల్షీట్లు తీసుకోవాలి.

 

ఇదే ఫిల్మ్ మేకింగ్ టాలివుడ్ లో అయితే 🙂  –

1. ముందు ‘హీరో, హీరోయిన్ ల ‘ కాల్షీట్లు తీసుకోవాలి.
2. సినిమా షూట్ చేయడానికి ఉపయోగించవలసిన టెక్నాలజీ నిర్ధారించుకోవాలి. ఉదాహరణకి ఫలానా సీన్ కి ( అవసరం లేని) అండర్-వాటర్ కెమెరా వాడాలా ? 35mm కెమెరా వాడాలా(పోయిన శుక్ర వారం రిలీజ్ అయి ఘోరం గా ఫ్లాప్ అయినా ‘టెక్నికల్ గా(?) ‘బాగుందని పేరు తెచ్చుకున్న ప్రక్క సినిమా కి ఇదే వాడారు)? లేక ఇంకేదైనా కొత్త టెక్నాలజిని ఉపయోగించుకుంటే పోతుందా (సినిమా కాదు)? ఇలాంటివన్నమాట!
3. కథ చెప్పే (నేరేట్ చేసే ) విధానం నిర్ధారించుకొవాలి . ఉదాహరణకి – కథ ని ఫ్లాష్ బాక్ లో చెప్పాలా లేక నేరు గా చెప్పాలా? (నేరు గా అంటే ఏమీ లేదు- టైటిల్స్ కి ముందు కొంచెం స్టోరీ అని అర్థం). స్క్రీన్ ప్లే ఏరోజు కి ఆ రోజు వ్రాసుకోవాలి.
4. కథ దొరికితే పర్లేదు, లేదంటే స్టొరీ లైన్ తయారు చేసుకోవాలి. కుదరకపోతే పాటల తో షూటింగ్ స్టార్ట్ చేయాలి.

 


Responses

 1. ఓహో, ఇంకో సినీ అభిమాని. స్వాగతం.

 2. మీ విసుర్లు సూపర్

 3. సారీ, నవ్వు తప్ప మాటలు రావడంలేదు

 4. Excellent raju garu, can i post this article in our college(SV Medical college,TirupTI) website magazine under your name?

 5. chanukya..
  Sure..its my pleasure..

 6. :)) Super

 7. (సెకండ్ రిలీజ్ అన్నట్టు..)

 8. నిజాల్ని ఇలా పచ్చిపచ్చిగా రాసేస్తేఎలా? ఇంకా ఎవరూ తెలుగు సినిమాల్ని కించపరుస్తున్నారని దిగలేదే!

  • మహేష్ గారూ..మీరూ నేనూ కొత్తగా… ఫ్రెష్ గా కించపరచడానికి ఏముందండీ.. 🙂

   • మీకింకా ఈ టపా(http://navatarangam.com/2009/07/remakes_phantom-audience/) గురించి అక్కడి చర్చల గురించీ తెలీదన్నమాట!

    • ఆ ఆర్టికల్ అప్పుడే చదివాను, సగం కామెంట్స్ కూడా చదివేను..కాకపోతే “చర్చ” మొదలయిన కామెంట్స్ ఇప్పుడే చదివాను…అయినా తెలుగు సినిమాలన్నీ వేస్ట్ అనో తెలుగు సినిమాలన్నీ గొప్పవనో ఒక్క ముక్కలో నేను తేల్చివేయలేను !!!

 9. మీరు టాలివుడ్ గురించి వ్రాసింది ఒకప్పటి సంగతేమో. ఇప్పుడు హీరోస్ కు అంత ధైర్యం వుందని నేను అనుకోవడం లేదు.

  ఇప్పుడు టాలివుడ్ లో కథే ప్రాణం .. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో కథ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేసేంత ధైర్యం ఎవరైనా చెయ్యగలరని నేను అనుకోవడం లేదు.

  • మీ బ్లాగ్ లో పాత పోస్ట్స్ చాలా వరకూ ఒకటొకటీ చదివేను కానీ, i- TV యాడ్ లాగా “చదవాల్సింది మిగిలేవుంది” 🙂 మీరు కామెంట్స్ మళ్ళీ ఆన్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఓ సారి ఆలోచించండి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: