వ్రాసినది: mohanrazz | 2009/07/23

కీరవాణి కి జేసుదాస్, చిరంజీవి ల తో గొడవేంటి??

ఆ మధ్య ఏవో రూమర్స్ వచ్చాయి, జేసుదాస్ కి కీరవాణి కి ఏదో గొడవయ్యిందట అని. సర్లే, రూమర్స్ కి ఏమి, వస్తూనే ఉంటాయని వదిలేశాను. అయితే ఓ సారి కీరవాణి ఇంటర్వ్యూ లో తనే కంఫర్మ్ చేసాడు. ఆయన చెప్పిన మ్యాటర్ ఆయన మాటల్లోనే-

“జేసుదాస్ చాలా గొప్ప సింగర్. అందులో సందేహమేమీ లేదు. కానీ ఒక గాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం మ్యూజిక్ డైరెక్టర్ కి కావాల్సిన విధంగా పాడటం. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు కావాల్సిన విధంగా పాడమని అడిగితే, అలా నేను పాడను అనే సమాధానం గనక ఒక సింగర్ ఇచ్చినట్లయితే ఆ సింగర్ ఎంత గొప్పవాడయినా అతనితో కలిసి నేను పని చేయడానికి ఇష్టపడను. అయితే జేసుదాస్ ని ఒక సింగర్ గా ఇప్పటికీ నేను అభిమానిస్తాను.”
 
ఇదీ కీరవాణి గారిచ్చిన సమాధానం. ఆయన ఏ సినిమా అప్పుడు, ఏ పాటప్పుడు గొడవొచ్చిందో చెప్పలేదు. అయితే మన రీసెర్చి లో 😀 వీళ్ళిద్దరూ కలిసి పనిచేసిన ఆఖరి సాంగ్ గా తేలింది “తప్పుచేసిపప్పుకూడు” సినిమా లోని “బృందావనమా” అనే సాంగ్. ఇద్దరు ఉద్దండులమధ్య ఇలాంటి క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తే (గొడవలొస్తే అనే విషయాన్నే కొంచెం పాష్ గా చెప్పా 🙂 ) ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని తేల్చడం ఎవరి వల్లా కాదు, అలా తేల్చాల్సిన అవసరమూ లేదు. నిజానికి కీరవాణి ఏ విషయాన్నయినా కొంచెం కుండలు బద్దలు కొట్టి మరీ చెప్తుంటాడు. శ్రీరామదాసు సినిమా హిట్టయ్యాక ఇలాగే ఓ ఇంటర్వ్యూ లో అన్నాడు – “ఈ సినిమా కి రీ-రికార్డింగే ప్రాణం. సినిమా మొత్తం రషెస్ చూసాక డైరెక్టర్ బాగా నిరుత్సాహపడ్డాడు. ఖచ్చితంగా ఫ్లాపవుతుందని వాళ్ళంతా నిర్ణయించేసుకున్నాక, కేవలం నా రీ-రికార్డింగ్ తో నే సినిమా ని నిలబెట్టాను” అన్నాడు. అయితే ఆ తర్వాత కూడా కీరవాణి స్టేట్మెంట్ ని నాగార్జున కానీ, రాఘవేంద్రరావు కానీ ఖండించలేదు.           

 

చిరంజీవి తో కూడా ఆపద్భాందవుడు అప్పుడు ఇలాగే ఏదో చిన్న విభేదాలు వచ్చాయి అంటారు. ఎందుకు వచ్చాయి, ఏంటి పరిస్థితి మనకి తెలీదు కానీ ఆ తర్వాత ఈరోజు దాకా మెగా కాంపౌండ్ వాళ్ళ సినిమాలు దేనికీ ఈయన పని చేయలేదు. అలాగే మగధీర కి రాజమౌళి తన పేకేజీ లో కీరవాణి ని కూడా ఇంక్లూడ్ చేస్తూంటే కీరవాణి యే రాజమౌళి తో “ఓ సారి చిరంజీవి తో కంఫర్మ్ చేసుకో, ఎందుకేనా మంచిది” అని అనాట్ట. చిరంజీవి తో రాజమౌళి వెళ్ళి సంగీతం కీరవాణికి అప్పగించే విషయం అడిగితే  “మీ ఇద్దరిదీ మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ కదా, దాన్నెందుకు బ్రేక్ చేయడం” అని అన్నాట్ట.

 

అయితే కీరవాణిది మొండితనం అని అనిపించినా కూడా -“విషయం” ఉన్నవాడికే కదా మొండితనం చూపించగల గట్స్ ఉండేది అనిపిస్తుంది.

ప్రకటనలు

Responses

 1. సక్సెస్ బాబూ సక్సెస్…ఇదే మాటలు కీరవాణి ఫ్లాపుల మధ్య నిలబడ్ఇ చెప్పుండే ఎంత గర్వం,తలపొగరు అనేవాళ్ళు. ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. ఈ ఇండస్ట్రీలో సక్సెస్సే అంతా!

 2. mmmmmm okappudu bagundedi keeravaani music not now

  enduko naaku konni repeated ga chestunnadu anipistundi……..

  • >>enduko naaku konni repeated ga chestunnadu anipistundi……..

   వినయ్..కొన్ని కాదు చాలా రిపీట్ చేస్తున్నాడు….వాటి గురించే సెపెరేట్ గా ఇంకో పోస్ట్ వ్రాయాలి.. 🙂

   • oka chetta paatani creat cheyyadam kante oka manchi tune repeat cheyyadame better.keeravani gaaru manakunna oke oka manchi music director.aayana enno goppa cenimalu chesaru.

 3. keeravaani sangeetham naaku ”sur” sinimalo maathrame nachhindi…migathavanni avarage mathrame …..

  industrie lo kundabaddalu kotte laga matladali kaani avi publicity chesukokoodadu.

  samayam choosi thokkestharu.

  keeravaani ni devudu kaapadu gaaka…

  • అశోక్ గారు,,,మీ అభిప్రాయం సరికాదు. జామురాతిరి జాబిలమ్మ,పుణ్యభూమి నా దేశం నమోనమామి,రాలిపోయె పువ్వానీకు రాగాలెందుకె,పూసింది పూసింది పున్నాగ,inka criminal,rog,jism,pellisandadi,annamayya,okariki okaru ,elanti cenimallo patalni meeru average ani ela anagaligaaru…?

 4. ””విషయంఉన్నవాడికే కదా మొండితనం చూపించగల గట్స్ ఉండేది అనిపిస్తుంది. ఇది నిజం. చిరంజివిగారు కిరవాణి గారిని దూరంచేసుకొవడం వలన నష్టపొయింది మాత్రం కచ్చితంగా చిరంజివే. ఎందుకంటె బంగారు కొడీపెట్ట లాంటి మాస్ సాంగ్ గాని, ఔరా అమ్మకుచేల్లా లాంటి క్లాస్ సాంగ్ గాని తర్వాత ఎ సంగీతదర్సకుడు ఆయనకి అందించలేకపొయారు.

  • మీరు చెప్పింది కరెక్త్.చిరంజీవి గారికి ఆ రేంజ్ పాటలు మళ్ళి రాలేదు.

 5. not ఆపద్భాందవుడు .. ఎస్.పి.పరుశారం సినిమా అప్పుడు అనుకుంటా .. ఆ టైంలో చిరంజీవికి రవిరాజా పినిశెట్టితో కూడా చెడింది అని చదివాను/విన్నాను.

  • YES….its after SP Parasuram…అసలు SP పరశురాం పేరుతో ఒక సినిమా వచ్చిందన్న విషయమే మరిచిపోయా.. 😀

 6. కీరవాణి గారు నిజంగానే కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడతారు,అతి మర్యాదలు,నక్క వినయాలు ప్రదర్శించరు.

 7. he is great music director.keeravani garu tana vadda panichese musicians ki manchi remunation istarane perundi.ippudunna music directorslo keeravani garu matrame live instruments tho composition cheyagalaru.koti rupayalu remunation teesukune aayana okokkasari director,subject nacchite low budjet cenimaalu kuda chestaru.latest example is vengamamba

 8. అదంతా పాతసంగతి,మగదీర ఆడియో వేదుకలొ ”కీరవాణి గారు తెలుగు వారు కావడం మన luck ” అని చిరంజీవి గారే స్వయంగా చెప్పారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: