వ్రాసినది: mohanrazz | 2009/07/24

బాలకృష్ణ సినిమా కి AR రెహ్మాన్ మ్యూజిక్

 

AR రెహ్మాన్ రోజా, జెంటిల్మేన్ లాంటి డబ్బింగ్ సినిమా పాటలతోనే, ఆరోజుల్లో తెలుగుప్రేక్షకులని ఉర్రూతలూపాడు. ఇంక డైరెక్ట్ తెలుగు సినిమా ఛాన్స్ ఇస్తే ఇంకా ఇరగదీస్తాడేమోనని కొంతమంది తెలుగు నిర్మాతలు అప్పట్లోనే రెహ్మాన్ ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసారు స్ట్రెయిట్ తెలుగు సినిమా తో. గ్యాంగ్ మాస్టర్, సూపర్ పోలీస్, పల్నాటి పౌరుషం అనె మూడు సినిమాలు ఫ్లాప్ మూటగట్టుకోడం తో సెంటిమెంటల్ గా తెలుగు నిర్మాతలు రెహ్మాన్ ని పెట్టుకోడానికి జంకారు. అటూ రెహ్మాన్ కూడా ఆ రోజుల్లో ఇక స్ట్రెయిట్ తెలుగు సినిమాలకి పనిచేసే ఉద్దేశ్యం లేదు అని స్ట్రెయిట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం తో మళ్ళీ మహేష్ బాబు నాని సినిమా దాకా AR రెహ్మాన్ తెలుగు సినిమాలు ఏవీ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు పులి (కొమురం పులి??) కి రెహ్మానే మ్యూజిక్ అంటున్నారు. నాకిప్పటికీ నమ్మకం కలగడం లేదు. లాస్ట్ మినిట్ ఛేంజెస్ ఏవైనా జరిగి సడెన్ గా ఏ మణిశర్మో, లేక దేవిశ్రీప్రసాదో పులి కి సంగీతం ఇవ్వడానికి వస్తారేమోనని డౌట్.

 

అయితే మధ్యలో రెహ్మాన్ చేసిన ఇంకో సినిమాని జనాలు మరిచి పోయారు. బాలకృష్ణ సినిమా “నిప్పురవ్వ” అని ఒక కళాఖండం వచ్చింది అప్పట్లో. దీనికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రెహ్మాన్ చేశాడు. ఈ సినిమా కి మొత్తం గా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేసారు. కీరవాణి కొన్ని పాటలు, బప్పీలహరి కొన్ని పాటలు ఇస్తే, బ్యాక్ గ్రౌండ్ మొత్తం రెహ్మాన్ ఇచ్చాడు. ఏ మాటకామాటే చెప్పాలి- ఈ సినిమా కి రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని తెలీనప్పుడు టివిలో సినిమా చూస్తూంటే సినిమా కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నట్టుందే అనిపించింది. అయినా ఒకే సినిమాకి ఇద్దరు, ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లేంటో??  ఆ మధ్య అంజి సినిమా కి కూడా శ్యాం ప్రసాద్ రెడ్డి ఈ సినిమా కి ఆరు పాటలని ఆరు మంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇస్తారు, బ్యాక్ గ్రౌండ్ మాత్రం మేస్ట్రొ ఇళయరాజా ఇస్తాడు అన్నాడు. నిజానికి ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు. నాకు గుర్తుండి అంజి లో మొదటిపాట – చికుబుకు రైలే, చిరుతపులే అని ఏదో ఉంటుంది ఆ సాంగ్ కి మ్యూజిక్ “శ్రీ”  (లిటిల్ సోల్జర్స్, ఆవిడామా ఆవిడే కి మ్యూజిక్ ఇచ్చాడు) ఇచ్చాడు. మరి అంజి ఆడియో క్యాసెట్ మీద కానీ, సినిమా లో కానీ శ్రీ పేరు ఉందో లేదో నాకు గుర్తు లేదు.  అలాగే ఓ పాట చక్రి తో చేయించారని విన్నాను. అది మళ్ళీ అతనే సుబ్బు సినిమాకి వాడేసుకున్నాడు. ఈ రెండు కాక ఇక మిగిలిన నాల్గింటిలో ఒకటి అనూప్ మాలిక్, ఒకటి రమణ గోగుల, ఒకటి మణి శర్మ చేస్తాడు అని చెప్పేసాడు శ్యాం ప్రసాద్ రెడ్డి. కట్ చేస్తే – మొత్తం మణిశర్మ చేయాల్సి వచ్చ్చింది. అయితే ఒక సినిమా మొత్తానికి ఒక మ్యూఒజిక్ డైరెక్టరే ఉంటే మంచిది అంటారు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ 🙂 . అలా చేస్తే సినిమా సోల్ ని అర్థం చేసుకుని, బ్యాక్ గ్రౌండ్, పాటలు ఇస్తారు అనేది వాళ్ళ వాదన. అలా కాదు, ఆరు మంది క్రీం లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ తో ఒక్కకిరితో ఒక్కొక్క పాట చేయిస్తే, మా పాట బాగుండాలంటే మా పాట బాగుండాలని 6 మంది 6 బ్లాక్ బస్టర్ పాటలు ఇస్తారు, అంజి లాంటి భారీ సినిమా కి అదే కరెక్ట్ అనేది శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళ వాదన.

 

సరే, ఎవరి వాదన కరెక్ట్ అనేది పక్కన పెడితే భీబత్సమైన పబ్లిసిటీ తో, ఓ రేంజ్ భారీతనం తో ముగ్గురు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో తీసిన నిప్పురవ్వ సినిమా రిలీజ్ అయితే సేం టు సేం అదే రోజు బాలకృష్ణదే ఇంకో సినిమా రిలీజ్ అయ్యింది- బంగారుబుల్లోడు అని. సరియైన పబ్లిసిటీ లేకుండా, క్రేజ్ లేకుండా నిప్పురవ్వ లాంటి భారీ సినిమా తో పాటు రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే నిప్పురవ్వ దారుణంగా ఫ్లాప్ అయింది.


Responses

  1. ఇలా ముగ్గురు చేసిన సినిమా మరొకటుంది. రాంగోపాల్ వర్మ “అంతం”. ఆర్.డ్.బర్మన్, మణిశర్మ, కీరవాణి చేశారు దానికి.

    • బర్మన్ చివరి రోజుల్లో చేసిన సినిమా అనుకుంటా అంతం..కానీ మణిశర్మ చేయలేదనుకుంటా ఈ సినిమాకి. రాం గోపాల్ వర్మ, చిరంజీవి కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయింది అప్పట్లో..(టెంటేటివ్ టైటిల్ ఆ సినిమా కి “చీకటి” అని చెప్పాడు వర్మ ఓసారి) .అప్పుడు ఆ సినిమా ద్వారా మణిశర్మ ని ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. దానికోసం పిక్చరైజ్ చేసిన సాంగ్ ని చూడాలని ఉంది లో వాడుకున్నారు. అలా ఆగిపోయిన మణిశర్మ ని మళ్ళీ చిరంజీవే బావగారూ బాగున్నార తో ఇంట్రడ్యూస్ చేసాడనుకుంటా.

  2. సినిమా టైటిల్ కార్డులో ముగ్గరి పేర్లూ ఉన్నాయి. మణిశర్మ నేపధ్యసంగీతం అందించాడు అంతం సినిమాకి.

  3. >>మణిశర్మ ని మళ్ళీ చిరంజీవే బావగారూ బాగున్నార తో ఇంట్రడ్యూస్ చేసాడనుకుంటా<<

    మణిశర్మ first movie రాంగోపాలవర్మ "రాత్రి"


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: