వ్రాసినది: mohanrazz | 2009/07/27

NTR మరణించిన మర్నాటి “ఆంధ్రప్రభ” బ్యానర్ స్టోరీ

తెలుగుతెర వేల్పు NTR మరణం అప్పట్లో తెలుగు ప్రజానీకాన్ని దుఃఖసాగరం లో ముంచెత్తింది. అయితే ఆయన మరణానంతరం జరిగిన కొన్ని పరిణామాలు తెలుగువారిని అంతకు మించి దిగ్భ్రమ కి లోను చేసాయి.   అయితే NTR మరణించిన మర్నాటి ఆంధ్రప్రభ దినపత్రిక లో వచ్చిన బ్యానర్ స్టోరీ లో – మహాకవి శ్రీ శ్రీ గారి ఒక కవిత ని ఉటంకించడం నిజంగా ఆలోచింపచేసేలా ఉండింది. 

 

నిజానికి NTR మరణానంతర పరిణామాలు అలా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. NTR ని పదవీచ్యుతుణ్ణి చేసినపుడు కొడుకులందరూ చంద్రబాబు తో ఉండటం వల్ల ఆయన మరణించిన సమయం లో ఆయన వద్ద లక్స్మీ పార్వతి ఉన్నారు.  ఆ తర్వాత కాసేపటికి హరికృష్ణ తదితరులు వచ్చి మృతదేహాన్ని తమ “ఆధీనం” లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించడం, దానికి లక్ష్మీ పార్వతి తదితరులు వ్యతిరేకించి దేహాన్ని తమ “ఆధీనం” లోనే ఉంచుకోవడానికి ప్రయత్నించడం, ఆ సందర్భంగా NTR మృతదేహం సాక్షిగా, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మీడియా సాక్షిగా జరిగిన గొడవలు, కొట్లాటలు, జరిగిన ఆ విషయాలన్నీ ఇప్పటికీ చాలా మంది అభిమానుల మనోఫలకాలపై సజీవంగానే ఉన్నాయి.  కారణాలేవైనా, జరిగిన ఆ గొడవల్ని తెలుగువారు అంత సులువుగా జీర్ణించుకోలేకపోయారు. ఆ మరునాడు ఆంధ్రప్రభ మొదటిపేజీ లో మొత్తం NTR కి సంభంధించిన ఫోటోలు, ఆ గొడవల తాలూకు ఫోటోలు ప్రచురించి ఒక ప్రక్కన పెద్ద పెద్ద ఎర్రక్షరాల తో శ్రీ శ్రీ అంతకు కొన్ని దశాబ్దాల ముందెపుడో వ్రాసిన ఒక చిన్న కవిత ని ప్రచురించాడు. మీలో చాలా మందికీ ఆ కవిత తెలిసే ఉంటుంది –

 

నిప్పులు జిమ్ముకుంటూ
నింగికి నేనెగిరిపోతే
నిబిడాశ్చర్యం తో వీరు!

నెత్తురు కక్కుకుంటూ
నేలకి నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే!!

                    -శ్రీ శ్రీ

 

నిజంగా ఆ క్షణాన NTR ఒక్క క్షణం బ్రతికివస్తే అక్షరాలా ఇవే మాటలు అనేవాడేమోనన్నంతగా, అసలు ఈ సందర్భం కోసమే శ్రీ శ్రీ ఆ కవిత వ్రాసాడేమోనన్నంత అతికినట్టుగా ఆ కవిత ఆ సందర్భానికి సరిపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. అసలు NTR మరణానికి కనీసం మూడు నాలుగు దశాబ్దాల ముందు వ్రాసిన ఒక చిన్న (చాలా చిన్న) కవిత అంత ఇది గా ఆ సందర్భానికి సరిపోవడం ఆశ్చర్యం కాక మరేమిటి?

 

P.S: ఆ మహాకవి ఏమి ఊహించి, దేన్ని ఉద్దేశ్యించి ఈ కవిత వ్రాసాడో నాకు తెలీదు కానీ అది వ్రాసిన అన్ని దశాబ్దాల తర్వాత ఆంధ్రనాట జరిగిన ఒక సంఘటన ఆ కవిత లోని జీవాన్ని మళ్ళీ తెలుగువారికి ప్రస్ఫుటపరచడం నన్ను అప్పట్లో తీవ్ర ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ టపా ఉద్దేశ్యం కేవలం మహాకవి శ్రీశ్రీ వ్రాసిన ఆ కవిత గొప్పదనం మీతో పంచుకోవడమే.

ప్రకటనలు

Responses

  1. Sri Sri also faced same situation.
    He had lot of ups and downs in his life.
    I think every human life is like that even if there is a difference in the height and depth one goes through.

  2. “ఏ కాలంలోనైనా మంచి-చెడు అనేవి వుంటూనే వుంటాయి. దానిని ఎవరూ మార్చలేరు” అని మీ టపా ద్వారా మరోసారి అర్ధం అయ్యింది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: