వ్రాసినది: mohanrazz | 2009/07/28

రీమే”కింగ్” రాజశేఖర్

అంకుశం, అల్లరి ప్రియుడు లాంటి సినిమాల టైం లో బాగానే క్రేజ్ ఉండేది రాజశేఖర్ కి. అయితే ఆయన సొంత ఆరోగ్య కారణాలవల్ల కొంత, సాయికుమార్ ఇతనికి డబ్బింగ్ చెప్పడం మానేయడం వల్ల మరింత కెరీర్ నష్టపోయాక, ఒకానొక టైం లో తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ అనే నటుడు ఉండేవాడు అనే విషయమే మరిచిపోయారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాడు. అయితే రాజశేఖర్ కెరీర్ లో నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే- ఈయనకి వచ్చిన మంచి హిట్లనీ స్ట్రెయిట్ సినిమాలే అయినా ఈయన మాత్రం ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత తెలుగు స్ట్రేయిట్ సినిమాలు చేయడం మానేసాడు. పోనీ తీసుకునే రీమేకులైనా మంచివి తీసుకుంటాడా అంటే లేదు. మళయాళం, కన్నడ, తమిళ్ ఎక్కడినుంచి పడితే అక్కడి నుంచి తీసుకుంటాడు. కొన్నిసార్లు స్టోరీ తెలీకుండా, అక్కడ సినిమా రిలీజ్ అవ్వకముందే రైట్స్ కొనేసి ఆనక ఆ సినిమా అక్కడ అట్టర్ ఫ్లాప్ అయితే ఏం చేయాలో దిక్కు తోచక డబ్బులు గాలికి వదిలేసుకుంటూంటాడు. ఓసారి ఏదో అజిత్ సినిమా కొన్నాడు, ఆంజనేయ అనో ఏదో ఉంటుంది పేరు. చాలా ఫ్యాన్సీ రేటిచ్చి ఆ సినిమా తమిళ్ లో రిలీజవకముందే కొనేసాడు. అక్కడ ఆ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాపయింది. మరిప్పుడేం చేస్తారని ఎవరో అడిగితే తెలుగులో మంచి యువరచయితల్ని పెట్టుకుని కథ మారుస్తానన్నాడు. ఆ మాత్రానికి రైట్స్ కొనడమెందుకో. లయన్ అని మరో మళయాళ సినిమా కొన్నాడు. దీన్ని ఎవడైతే నాకేంటి అని రీమేక్ చేసాడు. నాకు తెలిసి రీమేక్ చేసినపుడు “కథ” అని ఆ ఒరిజినల్ రైటర్ పేరు వేస్తారు. ఈయనేమో కథ,మాటలు-డాక్టర్ రాజశేఖర్ అని వేసుకున్నాడు. మరి అది రీమేకో కాదో నాకర్థం కాలేదు. ఈయన రీమేకుల గోల గురించి ఒక సరదా పిట్టకథ (పిట్టకథలకి తలాతోకా ఏమీ ఉండవు..జస్ట్ పిట్టకథ-అంతే 🙂 )చెబుతారు.

 

ఒకాయనెవరో రాజశేఖర్ గారింటికి ఏదో పనిమీద వెళ్ళాట్ట. వెళ్ళగానే,ఆఫీస్ పనుల మీద వచ్చే అతిథులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన రూం లో ఆయన్ని కూర్చోబెట్టి, “కాసేపు వెయిట్ చేయండి, సార్ వచ్చేస్తారు” అని చెప్పార్ట. ఈయన అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ..రూం అంతా పరికించి చూస్తున్నాట్ట. మంచి ఇంటీరియర్స్ తో, మంచి ఫర్నిచర్ తో, రూం అంతా బాగా ఉంది అనుంటూంటే ఒక విషయం బాగా స్ట్రేంజ్ గా అనిపించిందట. ఇంత మంచి రూం, అంత మంచి ఇంటీరియర్, అంత చక్కటి ఫర్నిచర్ ఉంటే, రూం మధ్యలో ఉన్న చెక్క టీపాయ్ మీద మాత్రం ఒక పెద్ద మేకు నిట్టనిలువుగా ఉందిట. ఇదేంటి రూం మధ్యలో ఇలా ఉంది, ఎందుకబ్బా? అనుకుంటూంటే రూం లో అటు మూలకి పనామె ఏదో సర్దుతూ కనిపించిందట. సరే ఈమెని అడుగుదాం ఎందుకిదిలా ఉందో అనుకుని ఆమెని దగ్గరికి పిలిచి అడిగాట్ట-
“ఏమ్మా, రూం అంతా ఇంత నీట్ గా చక్కగా ఉంది, కానీ రూం మధ్యలో ఆ మేకు…” అని అడగబోతుంటే, ఆమె వెంటనే
“ష్..గట్టిగా అనకండయ్యా..గమ్మునుండండి..” అందిట.
“అది కాదమ్మా, ఇంత మంచి రూం లో మధ్యలో అసహ్యంగా ఏంటి ఆ మేక్..” అనబోతుంటే ..
“ష్..గట్టిగా అనకండయ్యా బాబూ…”        
“అది కాదమ్మా ఆ మేకు…”
“అయ్యో గమ్మునుండండయ్యా..గట్టిగా అనమాకండి, మీరు “మేకు” అన్నారంటే, అది ఆయనకి వినబడితే చాలు ఏదో గుర్తొచ్చినవాడిలా పరుగెత్తుకెళ్ళి మళ్ళేఈ ఏదో ఒక రీ”మేకు”ని తెచ్చి మనమీద వదుల్తాడు..  🙂 ”

 

అదీ సంగతి. ఓ రోజెప్పుడో (రాజశెఖర్ హిందీ లో వచ్చిన ఖాకీ సినిమాని సత్యమేవజయతే అని రీమేకు చేస్తున్నాడు..ఆ సినిమా షూటింగ్ లో ఉందప్పుడింకా) బయట ఉంటే ఫ్రెండ్ కాల్ చేసాడు “టివి చూస్తున్నావా?” అని.

“లేదు, ఏంటి సంగత”న్నాను.
“ఇందాకే రాజశేఖర్ వచ్చాడయ్యా టివి లో. ఎవరో దొంగలంట వాళ్ళ ఆఫీస్ మీద పడి సత్యమేవ జయతే సినిమాస్క్రిప్ట్ ఎత్తుకెళ్ళారంటయ్యా” అన్నాడు.
సినిమా పబ్లిసిటీ కోసం రాజశేఖర్ ఏదో చిన్న స్టంట్ ప్లే చేసాడని అర్థమయింది. నేను కామ్ గా ఉంటే మళ్ళీ తనే అన్నాడు-
“మీ ఊళ్ళో ఖాకీ సినిమా సిడి ఏదైనా దొరికితే రాజశేఖర్ కి కొరియర్ చేయొచ్చుకదా 🙂  ”


Responses

 1. Hilarious, but very true.

 2. ఇంకో విషయం ఏమిటంటే అసలు ఆ హీరోయిన్స్ ని ఎక్కడినుంచి తెస్తాడో ఆయన! ఇంతకు ముందెక్కడా కనీసం పేరైనా విని ఉండం, చూసైనా ఉండం! అదైనా తెలుగు వాళ్ళు కాదు. ఖచ్చితంగా ముంబై నుంచి!

 3. పాపం రాజశేఖర్…నిజమే!

 4. papam naa sanuboothi

 5. Nice one. యాంగ్రీ యంగ్ మాన్ గా మంచి హిట్లిచ్చారు. దానాలు చేయడంలో ముందుండేవారు. ఇప్పుడు ఒక్క హిట్ కోసం చాలా హంగ్రీగా ఉన్నారు. ఠాగూర్ సినిమాను చిరంజీవిగారు తీసుకున్నారని ఈయన బాధ. అది దొరికితే దాన్ని ఒక ప్లాప్ చేసి ఉండేవారు.

 6. > మీరు “మేకు” అన్నారంటే, అది ఆయనకి వినబడితే చాలు ఏదో గుర్తొచ్చినవాడిలా పరుగెత్తుకెళ్ళి మళ్ళేఈ ఏదో ఒక రీ”మేకు”ని తెచ్చి మనమీద వదుల్తాడు..
  lol

 7. hahaaaha…………….nijame chiranjeevini tidutoo na tagore dobbesaadu annadu……..danito chiranjeevi satruvu ayyadu……….
  recently i watched his allripriyudu
  very funny expressions in songs……..especially pranayama nee peremiti song………….

  all the best rajashekar…………

 8. కామెడి ఏంటి అంటే … ఈయన కొన్న ఆ అజిత్ చిత్రం తెలుగు లో రాజశేఖర్ ఇంతకు ముందరే చేసేసాడు.. తెలుగు లో రౌడీజం నశించాలి (జిందాబాద్ అని పెట్టి సెన్సార్ సమస్య వల్ల నశించాలి అని మార్చారు ) అని ఒక ఫ్లోప్ చిత్రం చేసారు గుర్తు ఉందా ! అదే ఇది… అది మలయాళం చిత్రానికి రీమేక్ .. అప్పుడు మలయాళం వల్ల దగ్గర కొన్నాడు .. ఇప్పుడు తమిళ్ వల్ల దగ్గర కొన్నారు అదే తేడా.. తెలిశాక నాలుక కోరుకున్నాడు అందుకే మళ్ళా తియ్యాల… తెలిశాక నాలుక కోరుకున్నాడు అందుకే మళ్ళా తియ్యాల…

  • మీరు చెప్తోంది “కిరీటం” రీమేక్ గురించి. కిరీటం అనే దశాబ్దాల క్రింది మళయాళ సినిమాని రాజశేఖర్ రీమేక్ చేసాడు. అదే కిరీటాన్ని అజిత్ ఫ్రెష్ గా మళ్ళీ ఓ మూడేళ్ళ క్రితం చేసాడు. దీని రీమేక్ రైట్స్ కూడా రాజశేఖర్ మళ్ళీ కొన్నాడా? ఏమో తెలీదు. కానీ నేను చెప్పిన అజిత్ సినిమా కిరీటం కాదు. నిజానికి కిరీటం ఫ్లాప్ కాదు. నేను చూసా ఈ సినిమాని ఫర్వాలేదన్నట్టుగా ఉంటుంది. సినిమా కూడా అబో యావరేజ్/హిట్

 9. RAJASHEKAR IS GREAT ACTOR


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: