వ్రాసినది: mohanrazz | 2009/08/03

మణిరత్నం కెరీర్ లో “The Most Brilliant Title”

maniratnam[1]ఒక్కొక్క దర్శకుడికీ ఒక్కో రకమైన టేస్ట్ ఉంటుంది టైటిల్స్ పెట్టే విషయం లో ఇవివి లాంటి డైరెక్టర్లు తమాషా గా, వెరైటీగా ఉండే టైటిల్స్ కోసం ట్రై చేస్తే ఉపేంద్ర లాంటివాళ్ళు ఆమధ్య ఒక అక్షరం టైటిల్స్ మీద పడ్డారు. ఇప్పుడంతగా లేదు కానీ ఒకప్పుడు టైటిల్స్ పిచ్చి బాగా ఉండేది తెలుగు ఇండస్ట్రీ లో. బహుశా ఆ పిచ్చి తోనే కాబోలు జెడి చక్రవర్తి, రమణ లాంటి వాళ్ళు పేరులేని సినిమా అంటూ హంగామా చేసారప్పట్లో. అయితే టైటిల్ అనేది కథ కి కరెక్ట్ గా సరిపోవాలి అంటారు కొంతమంది దర్శకులు. కథకి సరిపోవడం కంటే ముఖ్యమైన విషయాలు వేరే ఉన్నాయంటారు భారతీరాజా లాంటి వాళ్ళు. అయితే మణిరత్నం టైటిల్స్ చూస్తే కథ కి సరిపోయేలా ఉండి కొంచెం భావుకత తో ఉంటాయి. 
  

ఓ సారెప్పుడొ ఓ తమిళ్ ఫ్రెండ్ (తమిళ్ అభిమాని, సినీ అభిమాని ప్లస్ “తమిళ సినీ” అభిమాని) తో మాట్లాడుతూ అన్నాను. “ఎంతైనా మీ తమిళ్ వాళ్ళు కొంత డిఫరెంట్. మణిరత్నం లాంటోడు కూడా హిందీ వెర్షన్ కి, తెలుగు వెర్షన్ కి యువ అనే పేరు పెట్టి తమిళ్ లో మాత్రం ఆయుధ ఎళుతు అనే పేరు పెట్టుకున్నాడు. తమిళ్ లో కూడా యువ అనే పేరు పెట్టడానికి ఏం ప్రాబ్లెం??”

అతను మణిరత్నం కి మాంచి ఫ్యాన్. అఫ్ కోర్స్, నేనూ ఒకప్పుడు ఫ్యానే. అతనన్నాడు-

                
“నీకు ఈ టైటిల్ ఏమర్థమైందని మాట్లాడుతున్నావ్? అసలా టైటిల్ లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా? “ఆయుధ ఎళుతు” అంటే “అక్షరమే ఆయుధం” అని మీనింగ్. ఈ సినిమా లో సూర్య స్టూడెంట్ గా ఉండి పాలిటిక్స్ లో కి వస్తాడు. చదువుకున్న యంగ్‌స్టర్స్ పాలిటిక్స్ లోకి రావాలనే మెసేజ్ ఉంది సినిమాలో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అక్షరమే ఆయుధం అనేది పర్ఫెక్ట్ టైటిల్ అసలు. ‘యువ’ కంటే ఇదే యాప్ట్ టైటిల్ ఈ సినిమాకి. ఎంత పోయెటిక్ టైటిల్ అనుకున్నావ్ అసలు…”
“ఓహో..అంత మీనింగ్ ఉందా???”
“ఇదే కాదు… ఇంకా ఉంది. తమిళ్ ఆల్ఫాబెట్స్ లో ఒక లెటర్ ఉంటది. ఓవెల్స్ లో (అచ్చుల్లో) లాస్ట్ లెటర్, అక్ అని. ఒక కాంటెక్స్ట్ లో “ఆయుధ ఎళుతు” అని “అక్” అనే లెటర్ ని అంటారు…”
“అయితే..”
“అయితే కాదు, ఆ లెటర్ అలా ఉంటుందో తెలుసా..ఒక ట్రయాంగిల్ కి త్రీ వర్టిసెస్ ఉండే ప్లేస్ లో త్రీ డాట్స్ ఉంటాయి. అంటే ట్రయాంగిల్ కి సైడ్స్ తీసేసి ఓన్లీ వర్టిసెస్ పెడితే ఎలా ఉంటుందో అలా అన్నమాట []. ట్రయాంగిల్ కి త్రీ వర్టిసెస్ లాగా ఈ సినిమా లో త్రీ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్ లో ఉంటారు. ఒకడు లో క్లాస్, ఒకడు మిడిల్ క్లాస్, ఒకడు హై క్లాస్. ఒకడు పాలిటిక్స్ నెగటివ్ గా యూజ్ చేసుకుందామనుకుంటాడు, ఒకడు పాజిటివ్ గా యూజ్ చేద్దామనుకుంటాడు, ఒకడు ఇవేమీ వద్దని ఫారిన్ కి వెళ్ళిపోదామనుకుంటుంటాడు, ఒకడు…….”
“బాబూ అర్థమైంది, అర్థమైంది..”
“నాకు తెలిసి ఇది మణిరత్నం కెరీర్ లోనే the most brilliant title. ఇప్పుడు చెప్పు ఈ సినిమాకి “యువ” కరెక్ట్ టైటిలా “ఆయుధ ఎళుతు” కరెక్ట్ టైటిలా??”

 

ఇంకేం చెప్తాం..ఏం చెప్తే మళ్ళీ ఏం చితక్కొడతాడో అని డౌట్. అయితే ఆ తర్వాత మిగతా తమిళ్ ఫ్రెండ్స్ ని చాలా మంది ని నేనడిగాను “అక్” అనే లెటర్ కి “ఆయుధ ఎళుతు” కి ఏమైనా సంబంధం ఉందా అని. “అంత ఐడియా లేదు మనకి” అన్నారు చాలా మంది.


Responses

 1. ఒక విషయం మాత్రం ఖచ్చితం ‘మణిరత్నం తమిళ్ లో ఆలోచిస్తాడు’.

 2. Interesting!

 3. తమిళ సినిమా టైటిల్స్‌లో వుండే భావుకత తెలుగులో భూతద్దం వేసుకొని వెతికినా కనపడవు.. మణిరత్నం సినిమా పేర్లలో నాకు బాగా నచ్చింది – “కన్నత్తిళ్ ముత్తు మిట్టాళ్” (చెక్కిలిపై ముద్దు పెడితే) – తెలుగులోకొచ్చేసరికి “అమృత” అయిపోయింది.

  • అవును ఈ టైటిల్ నాకూ బాగా ఇష్టం…..”చెక్కిళ్ళ ముద్దు పెడితే” అనే పదం మాత్రం “ఏ దేవి వరము నీవో” పాటలో అలాగే ఉంది కానీ టైటిల్ వరకు వచ్చేసరికి అమృత అయింది…

 4. interesting.!
  తెలుగులో కూడా చక్కటి అర్ధవంతమైన పేర్లు పెడితే బాగుండు..
  పోకిరి, దేశముదురు, జులాయి, వెధవ ఇలాంటివి కాకుండా 😉

 5. పనిలో పనిగా మన తెలుగు సినిమాల కోసం కొన్ని భావుకత నిండిని శీర్షికలు చెప్పండి. రిజిస్టర్ చేసుకుందాం.

  • మహేష్ గారూ..”టైటిల్ రిజిస్ట్రేషన్” అని బాగా గుర్తు చేసారు..దీని మీద ఓ టపా రేపో మాపో 🙂

 6. చాల మంచి సమాచారం ఇచ్చారు .. ధన్యవాదాలు

 7. అలా అనుకుంటే 1988 లో వచ్చిన తమిళ్ ” అగ్నినక్షత్రం ” అన్న టైటిల్ కన్న తెలుగు వర్షన్ లో ఉన్న ” ఘర్షణ ” అన్న టైటిలే బాగుంది కరెక్ట్ గా సరిపోతుందా ఆ కథకి. ఇక ” యువ” విషయం లో ముగ్గురు మూడురకాలు అన్నట్లుగా మూడు రంగులు ఉంటాయి, సూర్య ఉన్న దృస్యాలన్నీ ఆకుపచ్చరంగులఒనూ, మాధవన్ ఉన్న దృస్యాలన్నీ ఆరంజి రంగులోనూ, ఇంకా సిద్దార్థ ఉన్న దృస్యాలన్నీ నీలం రంగులోనూ ఉంటాయి..దానికి కారణం ఆకుపచ్చరంగు అగ్రెస్సవ్ ఇంకా రెవల్యూషనరీ కి ప్రతీకలు, ఆరంజి రంగు గొడవలకు, యుద్దాలకి ప్రతీక. నీలం రంగు ప్రశాంతతకు ప్రతీక అందుకే మూడు రంగుల్లో ఉంటుంది ఆ సినిమా.!

  • kamal..gud observation..కలర్స్ అనే కాదు యువ సినిమాలో..ప్రతి చిన్న విషయం లో మూడు క్యారెక్టర్స్ మధ్య బిహేవొరియల్ వేరియేషన్ చూపించాడు మణిరత్నం. ఉదాహరణకి వాళ్ళ రొమాంటిక్ బిహేవియర్ ని తీసుకుంటే- మాధవన్ రౌడీ, లోక్లాస్- “నన్ను కొంచెం కొరుక్కుతినవయ్యా” అని మీరాజాస్మిన్ పాడేలాగా కొంచెం నాటుగా అతని బిహేవియర్ ని చూపిస్తే- సూర్య ఇంటికి ఇషా వచ్చినపుడు సన్నివేశం లో “నాటుతనం” లేకుండా అట్ ది సేం టైం కొంత అగ్రెసివ్ గా రఫ్ బిహేవియర్ తో చూపిస్తాడు. ఇక సిద్దార్థ మాత్రం ట్రైన్ టైలెట్స్ లో ఫ్లర్ట్ చేసే టైపులో చూపించాడు. ఇదనే కాదు- వాళ్ళ ముగ్గురి క్యారెక్టరైజేషన్ వరకూ ప్రతి చిన్న విషయం లోనూ మణిరత్నం తీసుకున్న విపరీతమైన శ్రద్ద క్లియర్ గా కనిపిస్తుంది.

 8. అదేమీ లేదు మేస్టారు ,తమిళనాడు గవర్నమెంట్ సినిమా పేర్లు స్వచ్చమైన తమిళం లో పెడితే ,పన్ను మినహాయింపు ఇస్తుంది ,
  అందుకే వాళ్ళు నూటికి తొంబై తొమ్మిది శాతం అరవ టైటిల్స్ మాత్రమే పెడతారు
  అదీ అసలు కథ .


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: