వ్రాసినది: mohanrazz | 2009/08/04

సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్- ఒక మంచి బిజినెస్సు

సినిమాకి టైటిల్ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ పెట్టే ముందు సిసలైన ఫిల్మ్ మేకర్లు ఎన్నో అంశాలని పరిగణన లోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటూంటారు. ఆకర్షణీయమైన టైటిల్ సినిమా కి ఎప్పుడూ ప్లస్ పాయింటే.  
 

అప్పుడెపుడో ఓ పదిహేనేళ్ళ క్రితం కింగ్ అనే పేరుతో ఒక డబ్బింగ్ సినిమా వచ్చింది, మమ్ముట్టిది(ఇందులో మమ్ముట్టి IAS ఆఫీసర్). అరె, తెలుగులో మంచి మాస్ హీరో కి పడి ఉంటే మంచి టైటిల్ అయ్యేదే అనిపించింది కానీ చాలా సార్లు డబ్బింగ్ సినిమాలకి మంచి మంచి టైటిల్స్ పడుతూ ఉంటాయి. మహేష్ బాబు మొదటి సినిమా కి కూడా టైటిల్ “రాజకుమారుడు” అని పెట్టారు. నిజానికి రాజకుమారుడు అనే పదం కొంత కృతకంగా ఉంటుంది. ఆ భావానికి సరియైన పదం “రాకుమారుడు” అని ఉండాలి. కానీ ఏం చేస్తాం, రాకుమారుడు అనే టైటిల్ అంతకు ఒకట్రెండు సంవత్సరాల క్రితమే అర్జున్ హీరో గా వచ్చిన ఒక డబ్బింగ్ సినిమా (అదీ సస్పెన్స్ సినిమా, దానికి రాకుమారుడు అనే టైటిల్ ఏంటో నాకర్థం కాలేదు) కి వాడేసుకున్నారు. ఇలాంటివి చాలా. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూ లో నాగార్జున ని “సార్, మీ డాన్ సినిమా షూటింగ్ ఎంతవరకూ వచ్చింది” అనడిగితే, “బాబూ, ఆ సినిమా కి డాన్ అనే పేరు మేమింకా కన్‌ఫర్మ్ చేయలేదు, మీరు డాన్, డాన్ అని దాన్ని ఊరికే పబ్లిసిటీ చేయకండి. ఆ టైటిల్ ఒక డబ్బింగ్ సినిమా ప్రొడ్యూసర్ దగ్గర ఉంది, మీరెంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తే ఆయనంత కొండెక్కి కూర్చుంటాడు”. చివరికి మళ్ళీ ఆ డాన్ అనే టైటిలే కన్‌ఫర్మ్ అయింది. కొండమీద నుంచి దించడానికి ఆయనకెంత సమర్పించుకున్నారో మరి. నిజానికి చాలా మంది డబ్బింగ్ సినిమా ప్రొడ్యూసర్లకి ఎదురయ్యే అనుభవమే ఇది. వాళ్ళూ ఎంతోకొంత తీసుకుని టైటిల్ ఇచ్చేసి వీళ్ళ సినిమాకి ఇంకో టైటిల్ వెతుక్కుంటూంటారు.

 
ఈ నేపథ్యం లో ఈ మధ్య ఇంకో ట్రెండ్ స్టార్టయిందని విన్నాను. కొంతమంది సినీ జర్నలిస్టులు ఉత్తినే కొన్ని టైటిల్స్ రిజిస్టర్ చేసిపెట్టుకోవడం, పొరపాటున ఆ ప్రొడ్యూసర్లెవరైనా వచ్చి అడిగితే ఎంతో కొంత “ప్రాఫిట్ బుక్ చేసుకొని” టైటిల్ వాళ్ళకు ఇచ్చేయడం..ఇదీ ఆ ట్రెండు. ఉదాహరణకి తమిళ్ ఏదైనా మంచి ప్రిస్టీజియస్ స్టార్ట్ అయి, తమిళ్ టైటిల్ కూడా తెలిసిందంటే, దానికి రిలేటెడ్ గా ఉండే తెలుగు టైటిల్స్ ని బ్లాక్ చేసి పెట్టుకోవడం, వాళ్ళు దాన్ని డబ్బింగ్ చేయాలనుకున్నపుడు ఆ టైటిలే కావాలనుకున్నట్టైతే నెగోషియన్స్ చేయడం – ఇదీ పరిస్థితి. ఒక వేళ వాళ్ళు వేరే టైటిల్ గనక చూసుకుంటే, ఇంతేసంగతులు చిత్తగించవలెను.

 

అయితే ఇలా అమ్ముకోవడం కోసమే కాకుండా వేరే కారణాల వల్ల కూడా టైటిల్స్ రిజిస్టర్ చేస్తుంటారు కొన్నిసార్లు. ఆ మధ్య శంకర్ రోబో అనే సినిమాని షారుఖ్ ఖాన్ తో తీద్దామని ప్రయత్నాలు చేసాడు. మధ్యలో ఎక్కడో ఇగో ప్రాబ్లెంస్ వచ్చి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి, రజనీకాంత్ తో సేమ్ ప్రాజెక్ట్ మొదలెట్టాడు శంకర్. అయితే ఈమధ్యెక్కడో విన్నాను- శంకర్ ఆ సినిమా ని హిందీ లోకి డబ్ చేయాలనుకున్నపుడు పెట్టదగ్గ టైటిల్స్- రోబో, మై హూ రోబో, ఇట్టాంటి ఒక పది టైటిల్స్ దాకా షారుఖ్ ఖాన్ హిందీ లో రిజిస్టర్ చేసిపడేశాడని. ఇదింకో జాడ్యం.

 

ఇది కూడా కాకుండా ఇంకో పరిస్థితి కూడా ఉంది. ఆమధ్య ఒకానొక సమయం లో ఉపేంద్ర అనే కన్నడ దర్శకుడు మాంఛి లైం లైట్ లో ఉండేవాడు. ఆయన ఆ మధ్య కొంతకాలం పాటు తన సినిమా టైటిల్స్ అన్నీ ఒకే అక్షరం తో వచ్చేట్టు చూసుకున్నాడు- ష్, ఓం, A, స్వస్తిక్ (స్వస్తిక్ గుర్తు ఒకే అక్షరం వస్తుంది) ఇలాగన్నమాట. ఓం సినిమా కన్నడ లో రిలీజవగానే తెలుగు లో తమ్మారెడ్డి భరద్వాజ గారు ఓం అనే టైటిల్ ని రిజిస్టర్ చేసేసుకున్నాడు. తర్వాత వాళ్ళొచ్చి ఎంతగా అడిగినా లేదు ఈ టైటిల్ నాకు కావాలి నేను సినిమా తీద్దామనుకుంటునా ఈ టైటిల్ తో అన్నాట్ట. వాళ్ళిక గత్యంతరం లేక “ఓంకారం” అని పెట్టుకున్నారు. ఆ తర్వాత తమ్మారెడ్డి గారు ఆ టైటిల్ తో ఏ సినిమా తీసిందీ లేదు. ఓం అనే కాదు అప్పట్లో ఇలాంటి చాలా టైటిల్స్ ఆయన రిజిస్టర్ చేసిపెట్టుకుంటాడు, వాళ్ళకు ఇవ్వడు, తనూ తీయడు. ఇదింకో రకమైన పరిస్థితి.

అదండీ టైటిళ్ళ సంగతి!!!

ప్రకటనలు

Responses

  1. మంచి బిజినెస్సే!
    అయినా, ఈ మధ్య ఈ జంఝాటం నుంచీ తప్పించుకోవడానికి ఒక దొడ్డిదారి కనిపెట్టారు. అదే శీర్షికతో పాటూ ఉపశీర్షిక తగిలించడం.

    కింగ్ అనే టైటిల్ దొరక్కపోతే “కింగ్ – వీడొక పెద్ద పాపర్” తరహాలో కానిచ్చేస్తున్నారు. “కింగ్” అని పోస్టర్లలో పెద్దగా రాస్తేసరి.

  2. […] నాగార్జున లేటెస్ట్ మూవీ కి టైటిల్ ముందు రమ్మీ అని అనుకున్నారు. తర్వాత ఏమైందో తెలీదు- మోసగాడు అని ఇంకో టైటిల్, మాయగాడు అని మరో టైటిల్ తెర మీదకి వచ్చాయి. రమ్మీ అన్న టైటిల్ లో ఉన్నంత ఈజ్, మాస్ (అవును, మాసే), నావెల్టీ మాయగాడు లో కానీ మోసగాడు లో గానీ కనబడలేదు నాకు. అయితే చివరికి “కేడి” అన్న టైటిల్ ని కన్‌ఫర్మ్ చేసారు. ఇది పలకడానికి కొంచెం ఈజీ ఉందని దీన్ని ఖాయం చేసామని నిర్మాత చెప్పాడు. అయితే రమ్మీ అన్న టైటిల్ వేరే వాళ్ళు రిజిస్టర్ చేసారనీ, ఆ టైటిల్ ని ఇవ్వడానికి 12 లక్షలదాకా డిమాండ్ చేసారనీ నాగార్జున అంటున్నాడు. ఇలాంటిదే సేమ్ ప్రాబ్లెం గతం లో కూడా నాగార్జున ఫేస్ చేసాడు. (ఇక్కడ నొక్కండి). […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: