వ్రాసినది: mohanrazz | 2009/08/05

“మా తెలుగు తల్లికీ..” మీద సినారె అసహనం !

c.nare

బహుశా ఒక ఆరేడేళ్ళ క్రితం అనుకుంటా, ఏదో పత్రిక లో ఒక సాహితీ శీర్షికలో చదివా ఈ విషయాన్ని. అది సినారె గారి ఇంటర్వ్యూ నో లేక సినారె గారు వ్రాసిన ఆర్టికలా అనేది గుర్తు లేదు కానీ అందులో సినారె గారు అసహనం వ్యక్తం చేసిన ఒక అంశం మాత్రం అలా గుర్తుండిపోయింది.

మా తెలుగు తల్లికీ మల్లెపూదండ

మా కన్న తల్లికీ మంగళారతులు

కడుపులో బంగారు కనుచూపు లో కరుణ

చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి

బహుశా మనలో చాలా మందికి ఈ పాట మొత్తం గానో లేదా కనీసం పైన వ్రాసినంత వరకో కంఠోపాఠం గా వచ్చి ఉండవచ్చు. శంకరంబాడి సుందరాచారి గారు వ్రాసిన ఈ పాట మనందరికీ బాగా చిన్నప్పుడే పరిచయం. ఈ పాట లో ఏదైనా తప్పున్నట్టో, లేక ఏదైనా వెలితి ఉన్నట్టో నాకైతే తెలీదు. నాకు చదువు నేర్పిన గురువులు కానీ వారికి నేర్పిన గురువులు కానీ ఎవరూ ఈ పాట మీద ఆక్షేపణ చేసినట్టు కూడా నేనైతే ఎక్కడా విని ఎరుగను. అలాంటిది ఒకసారి, సాక్షాత్తూ సినారె గారే దీనిమీద అసహనం వ్యక్తం చేయడం చూసి నిరుత్తరుణ్ణయ్యాను. ఆయన ఏదో చెబుతూ, ఈ పాటమీద ఒకింత అసహనం వ్యక్తం చేసారు. చేస్తూనే-

“…అయినా, తల్లికి మల్లెపూలు తీసుకురావడమేంటి? నాన్సెన్స్” అన్నారు.

మల్లెపూలయితేనేమి, మరో పూలయితేనేమి, పూదండ అంటే గౌరవార్థమనేదే నాబోటి సామాన్యులకి తెలిసిన అర్థం.  చిన్నప్పట్నుంచి తెలిసిన అలాంటి పాటని సినారె అంతటాయనే విమర్శిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక- “గొప్ప పాటని విమర్శించాలి అంటే గొప్పవ్యక్తి అయిఉండాలి” అని సర్ది చెప్పుకున్నాను. అక్కడికీ ఆ పత్రికకి ఓ ఉత్తరం వ్రాసి నాబోటి సామాన్యుడి వెర్షన్ చెప్తామనుకున్నా కానీ, కొంచెం ఆలోచించాక- “తెలిసీ తెలియకుండా కొన్ని విషయాలని కలియబెట్టడం మన ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదులే” అని సాహసించలేకపోయాను.

ప్రకటనలు

Responses

 1. hahahah………..koncham goppa ga ayinaka vimarshinchatam ekkuvavutundi……………

 2. సినారె అంత విమర్శ చేశారని ఇప్పుడే చదువుతున్నాను. మల్లెపూలు అనలేదుగా? పూదండ అయినా మల్లెపూలతో అయితే పనికి రాదా? లిల్లీపూల దండే అవ్వాలా?

  ఇలాంటి విమర్శలు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే మనం సామాన్యులం కాదా ని ఊరుకోకుండా మన అభిప్రాయం మనం చెప్పాల్సిందేనండీ! లేకపోతే అసలు అలాంటి అభిప్రాయమే ఎవరికీ లేదు కాబట్టి తను చేసిన విమర్శ సరైనదే అనుకుంటారు

 3. సినారె కవితల సంగతి పక్కనబెడితే వ్యక్తిగా పెద్ద విశాలత్వాన్ని అలవర్చుకున్న దాఖలాలు తక్కువే. తెలుగు సాహిత్యంలో “దొరతనం” వెలగబెట్టడం వారి హాబీ. ఎలాగూ రాజపోషకులు (రాజ్యంచే పోషించబడుతున్నవారు) కాబట్టి వారి తాహతే వేరు.

  ఇలాంటి వ్యాఖ్య్లలు ఎన్నోచేస్తే బయటొచ్చిన కొన్నింటిలో ఇదొకటనుకుంటాను.

  ఏదో ప్రాసకోసం మల్లెపూదండ అన్నంత మాత్రానా గౌరవభావం తగ్గిపోతుందా! ఒకవేళ తగ్గుతుందనుకుంటే “మందారపూదండ” అనుకుందాం. అయినా మల్లెపువ్వులు ప్రియురాళ్ళకే ఇవాలని రూలుపెట్టిం దెవరు?

 4. “తల్లికి మల్లెపూలు తీసుకురావడమేంటి?” – రంధ్రాన్వేషణ కంటే ఓ మెట్టు దిగువన ఉన్నట్టుంది.

 5. ఇలా లేని అర్ధాలూ, పెడర్ధాలూ తీయగలిగే వారే గొప్పవారిగా చలామణీ అవుతారు. మనకు బ్లాగ్లోకంలో కూడా విదితమే కదా…!

  Contradiction will make the people popular 🙂

 6. పైత్యం ముదిరితే అంతే .. చిన్న వాడు .. పెద్ద వాడు .. తేడాలు వుండవు.

  మానవులంతా ఒక్కటే.

  బ్లాగులున్నది ఇందుకే కదా .. good one


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: