వ్రాసినది: mohanrazz | 2009/08/05

ఏం పిల్లడో ఎల్దమొస్తవా…వివాదం

బాగా చిన్నప్పుడు ఏదో ప్రైవేట్ ఆల్బం లో అనుకుంటా ఈ పాట మొదట విన్నది. అందరూ దాదాపు మరిచిపోయరనుకున్న పాటని కీరవాణి మళ్ళీ గుర్తు చేశాడు-ఒక లైన్ ఆ పాట లో నుంచి తీసుకుని మగధీర లోని జోర్సె జోర్సె అనే ఒక మాస్ పాట లో చాలా తెలివిగా ఆ ఒక్క లైన్ ని ఇరికించాడు.
“ఏం పిల్లడో ఎల్దమొస్తవా/ ఏం పిల్లడో ఎల్దామొస్తవా” అనే ఒక్క లైన్ ఆ పాట లో నుంచి తెచ్చాడు. పదాలు, ట్యూన్ అంతా ఆ పాత పాటని గుర్తు తెప్పించేవే. కానీ ఆ ఒక్క లైన్ కి ముందు ఉన్న లైన్స్ కానీ తర్వాత ఉన్న లైన్స్ కానీ ఆ పాత పాటకి సంబంధం లేనివే. ఆ ఒక్క లైన్ కూడా ఒక జానపద పాట లుక్ కోసమో, లేదా బహుళ ప్రాచుర్యమైన ఒక పాట కి సంబంధించిన నోస్టాల్జిక్ ఫీలింగ్ తెప్పించడం కోసమో చేసినట్టు ఉందే కానీ, భావ చౌర్యం చేసి ఆ పాటని లేపేసి సినిమాలో వాడుకుందాం అన్నట్టు లేదు.


జోర్సె జోర్సె జోర్ జోర్ జోర్ సె

……

…..

ఏ పిల్లడు .. ఏ ఏ పిల్లడు .. ఒయ్ పిల్లడు .. ఒయ్ ఒయ్ పిల్లడు ..
చలెక్కుతున్న వేళ చిమ్మ చెట్టు నీడలోకి .. చురుక్కు మన్న వేళ పాడుబడ్డ మేడలోకి ..
వాగులోకి .. వంక లోకి .. సందు లోకి .. చాటులోకి .. నారుమళ్ళ తోటలోకి .. నాయుడోళ్ళ పేట లోకి ..
బుల్లిచెంచు పక్కనున్న రెల్లుగడ్డి పాకలోకి .. పిల్లడో .. ఏం పిల్లడో ..

ఏం పిల్లడో ఎల్దమొస్తవా .. ఏం పిల్లడో ఎల్దామొస్తవా….

 (ఈ పాట పూర్తి లిరిక్స్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు.)

ఇప్పుడా ఒరిజినల్ పాట రచయిత మాత్రం తనకి “క్రెడిట్” ఇవ్వకపోవడం వల్ల కినుక వహించాడు. కేస్ వేస్తానంటున్నాడు.  అది ఒక్క లైన్ అయినా సరే, తాను వ్రాసినది తన అనుమతి లేకుండా వాడుకుంటే బహుశా ఏ కవి/రచయితకైనా కోపం వస్తుందేమో. అయితే, విప్లవ కవి, ప్రజాకవి అని చెప్పుకునే వ్యక్తులు తమ పాట, అదీ ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందిన పాట ఇలా వాడుకోబడినపుడు,అదీ కేవలం ఒక్క లైన్ అయినప్పుడు-చిన్నమోస్తరు రచయితలు, బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న రచయితల లాగా  ఇష్యూ చేసి ప్రతిఫలం పొందుదామని ప్రయత్నించకుండా- దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు చాలాసార్లు. అయితే ఎందుకో ఈసారి ఈయన దీన్ని కాస్త వివాదం చేస్తానంటున్నాడు. ఈ కేసులు చివరికి ఏమవుతాయో బహుశా అందరికీ తెలిసిందే.

ఏది ఏమైనా ఇది మగధీర సినిమాకి ఇంకోరకం పబ్లిసిటీ కూడా.

P.S: ఏం పిల్లడొ ఎల్దమొస్తవా అనే పాట, మగధీర కంటే ముందు జానీ సినిమాలో కూడా ఒక చోట ఉంటుంది. పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నపుడు టేబుల్ మీద దరువేస్తూ ఈ పాట హం చేస్తూ ఉంటాడు.


స్పందనలు

  1. ” ఏం పిల్లడో ఎల్దమొస్తవా ” మీద కేస్ వేసినా నిలబడదు. ముందుగా అవి తెలుగు పదాలు . ట్రేడ్ మార్కులు కావు. పైగా కాపీరైట్ చట్టంలో పెయిర్‌యూజ్ ప్రకారం అలా రెండుముక్కలు తీసుకోవడం చట్టబద్దమే.

    కేవలం పబ్లిసిటీ కోసమే ఆ రచయుత ఆరాటం అయ్యుండవచ్చు.

    • yeah correct…case vesinaa nilabadakapovachu..

      • రచయితకు కొత్తగా కావలసిన పబ్లిసిటీ ఏమీ లేదు. వంగపండు ప్రజాగాయకుడు. ఈ పాట కొన్ని దశాబ్ధాలుగా జనం నోళ్ళలో నానుతున్న పాట. ఆల్రెడీ ఈ పాట ఒక ఆర్. నారాయణమూర్తి సినిమాలో ఉంది.

        ఈ పాటను వాడిన స్ఫూర్తిని తప్పుబట్టి, కనీసం acknowledge చెయ్యని నిర్మాతల్ని తప్పుబట్టడం గాయకుడి అధికారం.

        • వంగపండు రాసిన పాట మొత్తం విన్నాను . బాగుంది . ప్రజానాట్యమండలి వాల్లు వేసే “భూ బాగోతం ” అనే నాటకం ఈయన రాసిందే . మా వూరి ప్రజానాట్యమండలి వారు రాష్ట్రమంతా ఆ నాటకం ప్రదర్శనలు ఇచ్చేవారు. చాలా పాపులర్ రంగస్థల నాటకం అది . చంద్రబోస్ క్షమాపణలతో వివాదం సమసిపోవచ్చు.

          • శివగారూ, మీకు వీలైతే ఆ అసలు పాట పూర్తి పల్లవి పోస్ట్ చేయగలరా? ఆ ఒరిజినల్ పాట నాకూ గుర్తులేదు.

  2. కేసు సంగతేమోగానీ, పాటలోని ఆ ముక్కల్ని వాడుకుంటున్నపుడు రచయితకు చెప్పడం ధర్మం, కనీసం నైతికంగా.

    • పొరబాటు కాదు అనుకొని చేసిన పోరబాటో కాదో తెలియని చిన్న విషయానికి ధర్మం, నైతికం అనే పెద్ద మాటలు అనవసరం.

      ఒకప్పుడు ఇదే మాట మీరు నన్ను అనటం వలన ఇక్కడ స్పందిచవలసి వస్తుంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోవడం వలన మిమ్మల్ని అనవసరంగా నా వాఖ్యల్లోకి లాగవలసి వస్తుంది. మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకొకరిని టార్గెట్ చెయ్యకుండా వుంటే బెటర్ లేదా పూర్తిగా మనసులోని మాటలు చెప్పాలి. దాని వలన అపార్ధాలకు ఫుల్ స్టాఫ్ పెట్టవచ్చు.

      • 1. “ఒకప్పుడు ఇదే మాట మీరు నన్ను అనటం వలన”: నా ఉద్దేశం అప్పుడేదో ఇప్పుడూ అదే! ఏం తేడా లేదు.
        2. “పూర్తిగా మనసులోని మాటలు”: నేజెప్పిందవే!
        3. “అపార్ధాలకు”: నేను మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు.

        • థాంక్స్ ఫర్ రిప్లై సార్!

          నా అభిప్రాయాలు వేరు.

          “పబ్లిక్ కు వ్రాసిన మన కంటెంట్ ను ఎవడైనా వెటకారం చేస్తే బాధపడాలి కాని, ఆ కంటెంట్ గౌరవం పెంచే విధంగా వేరే బ్లాగులో తనకనుగుణంగా వ్రాసుకుంటే అసలు తప్పు లేదు.”

          ఒరిజినల్ రైటర్ పేరు మెన్షన్ చెయ్యడానికీ నాకు ఎటువంటి అభ్యతరం లేదు.నేను కాపి చేసింది మూలం వివేకానంద సూక్తులు మరియు నేను వ్రాసిన సంధర్బం పూర్తిగా వేరు కాబట్టి ఒరిజినల్ రైటర్ పేరు IGNORE చెయ్యడం జరిగింది.

          మీకు తప్పు అనిపించింది వెరొకరు తప్పు కాదు అనుకోవడానికి కారణాలు వుంటాయి. వాటిని మీరు IGNORE చెయ్యడం బాదాకరం.

          ఈ సందర్భమే తీసుకుంటే ఆ లిరిక్స్ కు గౌరవంగా విలువ పెంచే విధంగా వుంటే పైన బొల్లోజు బాబా చెప్పినట్లు ఇది ఒక ఇష్యూ అయ్యేదే కాదు. ప్రతిఒక్కరికి తెలుసు అది ఒక పాత లిరిక్స్ అన్న విషయం. ఆ క్రెడిట్ కొత్త రైటర్ వాడుకున్న విధానానికి ఇస్తారు తప్ప, ఒరిజినల్ రైటర్ వంగపండు గారు కు కలిగే నష్టం ఏమి లేదు. ప్లస్ గర్వపడతారు.

          ధర్మం, నైతికం అనే ముందు సిట్యుయేషన్ ఏమిటి అనేది ఒక్కసారి చూడాలి. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కాని “కేవలం పబ్లిసిటీ కోసమే ఆ రచయుత ఆరాటం” అనే అనుమానం ప్రజలలో రావడానికి కారణం ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే మీకు సమాధానం, నా పాయింట్ అర్ధం అవుతుందనుకుంటున్నాను.

  3. నాకు కేసు పెడతాననడం తప్పుగా అనిపించడం లేదు.

    అందరూ(most) బ్రతికేది పేరు కోసమే కాబట్టి, పేరు కోసం డ్రామా ఆడుతున్నా అసలు తప్పు లేదు. తెలియని నాలాంటి వాళ్లకు అంత మంచి పాట వ్రాసిన వారెవరో తెలుస్తాది.

    కానీ పబ్లిసిటి కోసం ఇలా చేస్తున్నాడు అనే చెడ్డ పేరు ఆయనకు రావడం ఖాయం.

  4. […] కాపీ రైట్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న నాలోని ఆవేదనను వ్యక్తపరచడానికి అవసరమయ్యే సిట్యుయేషన్ ఒకటి ఈరోజు ఎదురయ్యింది. ఈ రోజు కామెంట్స్ ద్వారా ఇంకో గొప్ప విషయం తెలిసింది.(ఇక్కడ క్లిక్ చెయ్యండి) […]

  5. వంగపండు గారు మా గ్రామములొ ఒక ప్రదర్సన ఇచ్చారు. ఇదో గొప్ప పాట. అతను సందర్భాన్ని ప్రశ్నించారే గాని పదాలను ఉపయోగించారని కాదు.

  6. చిన్నప్పుడెప్పుడూ నేను విన్న ముక్కలు, చెదురు మదురుగా, నాకు గుర్తున్నవి:

    ఏం పిల్లడో ఎల్దమొస్తవా ఏం పిల్లో ఎల్దామొస్తవా
    తెలంగాణ కొమరయ్య కొండకి .. (కో) ఏం పిల్లడో ఎల్దమొస్తవా
    సీకాకులాన సీమ కొండకి .. (కో) ఏం పిల్లో ఎల్దామొస్తవా

    .. ఇలా సాగుతుంది

    నాకు తమాషాగా అనిపించేది దీన్ని గద్దర్ పాడిన పద్ధతి 🙂

    “పుళుళ్ని, అహ పుళుళ్ని, భళ్ పుళుళ్ని మింగిన మేకలున్నయ్యట ఏం పిల్లడో ఎల్దమొస్తవా”

  7. Sri Vangapandu doesn’t need any introduction to
    a section of the society.
    He may not be known to other people, they don’t have to worry if they don’t know who is Vangapandu.

    This controversy doesn’t add to the publicity of the movie for the above reason
    I did not expect Sri Vangapandu would stoop down to react this way.

  8. వంగపండు బాధ/అభ్యంతరం తన పాటలో లైను తనకు చెప్పకుండా వాడుకున్నందుకే గానీ ఒరిజినల్ పాట తాలూకు స్ఫూర్తిని దెబ్బతీసి దాన్ని ఒక శృంగార గీతంగా మార్చినందుకు కాదన్నమట! సెభాష్!

  9. రాజ్ గారూ,
    వ్యాఖ్యలు అడుగు నుండి పైకొస్తున్నాయి. బానే ఉందిగానీ, ఏదైనా వ్యాఖ్యకు మనం రాసే సమాధానం దానికి దిగువన వస్తోంది (అలా రావడం సహజం). కానీ రివర్స్ క్రోనొలాజికల్ ఆర్డర్‌లో వ్యాఖ్యలను చూస్తూ వస్తూంటే మధ్యలో ఈ పిడకలవేట (వ్యాఖ్యా సంభాషణ) ఎదురొస్తోంది. అంచేత వ్యాఖ్యలు కిందినుండి కాకుండా పైనుండి వస్తేనే బాగుంటుందేమో చూడండి.

  10. ఇదే అంశంపై ఆనందిని అన్న బ్లాగులో నేచేసిన కామెంటు ఇది.
    ****
    వంగపండు గారి ఆవేదనలో అర్ధం ఉంది.

    మగధీరలోని ఒక పాటలో ఏంపిల్లడో ఎల్దమొస్తవా అన్న గీతం లోని ఆ నాలుగు పదాలను ఇమిడ్చిన సందర్భం అనుచితంగానే ఉంది. (సృజనాత్మకంగా ఉండి ఉండవచ్చుగాక)

    దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం వ్రాయబడ్డ ఒక పాటలోని పదాల్ని, ఆ ట్యూను ని, అది వ్రాయబడ్డ సందర్భాన్ని గౌరవించకపోవటం ఒకరకంగా తెంపరితనమే. గర్హనీయమే.

    సినిమాలపై వచ్చే వివాదాల పట్ల నాకు సదభిప్రాయం లేక పోయినా, వంగపడు గారు లేవనెత్తిన ఈ అంశం లో మాత్రం నాకు నిజాయితీ కనిపిస్తున్నది.

    ఇలాంటి చవకబారు ప్రచారానికి సిద్దపడేటి వ్యక్తిత్వం ఆయనకు లేదని నమ్ముతున్నాను.
    ******

    బొల్లోజు బాబా

  11. rendinti tune same vuntunda…………

    • వినయ్ గారు
      అంతర్జాలంలో ఆర్. నారాయణమూర్తి నటించిన, ఎర్రసముద్రం సినిమా పాటలు అని సెర్చ్ చేసినట్లయితే అందులో ఈ ఏంపిల్లడో పాట వందేమాత్రం గొంతు ద్వారా వినవచ్చు. ఇది కూడా వరిజినల్ సాహిత్యం కాదు. సినిమాకు తగ్గట్టుగా మోడార్నైజ్ చేసేసారు. ట్యూను మాత్రం వరిజినలే. వరిజినల్ పాట అంతర్జాలంలో లేదనుకుంటాఅ. ఇక మగధీర పాటలు అంతర్జాలంలో ఎక్కడో ఒకచోట దొరుకుతాయి వెతికితే.

      వినండి ఆ ఒక్క పది సెకండ్ల ముక్కనీ జాగ్రత్తగా వినండి. మీకే తెలుస్తుంది. వంగపడు ఆవేదన సహేతుకమా, లేక పబ్లిసిటీయా అనేది మీకే అర్ధం అవుతుంది

      బొల్లోజు బాబా

  12. ఏం పిల్లడో ఎల్దమొస్తవా…
    ఏం పిల్లో ఎల్దామొస్తవా…

    శ్రీకాకుళంలో సీమ కొండకి…. ఏం
    సిలకలు కత్తులు దులపరిస్తయట… ఏం…

    సాలూరవతల సవర్ల కొండకి… ఏం…
    సెమర పిల్లులే శంఖమూదెనట… ఏం…

    నలగొండ నట్టడవిలోనికి… ఏం..
    పాముని బొడిసిన సీమాలున్నయట… ఏం…

    తెలంగాణ కొమరయ్య కొండకి… ఏం………………………………
    గద్దని తన్నిన చేతూలున్నయట… ఏం…

    ఆకులు మేసిన మేకల కొండకి…. ఏం…
    పులుల్ని మింగిన గొర్రేలున్నయట… ఏం…

    రాయలసీమ రాళ్ళ కొండకి…. ఏం…
    రక్తం రాజ్యం ఏల్తుందట… ఏం…

    తూరుపు దిక్కున తోర కొండకి… ఏం……………………………….
    తుపాకి పేల్చిన తూనీగలున్నయట… ఏం..

    కలకత్తా కొతకారు కొండకి… ఏం…
    ఎలకలు పిల్లిని ఎండాదగిలెనట… ఏం…


Leave a reply to a2zdreams స్పందనను రద్దుచేయి

వర్గాలు