వ్రాసినది: mohanrazz | 2009/08/11

మగధీర బ్యాన్

ఇందాకే “పంచాయితీ రాజ్” శాఖామాత్యులు (సినిమటోగ్రఫీ మంత్రి కాదు) అయినటువంటి బొత్స సత్యనారాయణగారు మగధీర సినిమాని విజయనగరం జిల్లా మొత్తం బ్యాన్ చేస్తున్నట్టు అధికారులకి ఆదేశాలు పంపించారు. విజయనగరం లోని కొన్ని థియేటర్లలో దురదృష్టవశాత్తూ జరిగిన కొన్ని సంఘటనల్లో కొంతమది బలికావడం దారుణమైన విషయమే. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక టీమ్‌ని వేసి వాళ్ళు విజయనగరం జిల్లాలోని అన్ని థియేటర్లు పరిశీలించి క్లియరెన్స్ ఇచ్చినతర్వాత మగధీర సినిమాని మళ్ళీ ప్రదర్శించడానికి అనుమతినిస్తామని బొత్సగారు చెప్పారు.

అయితే ఇక్కడ కొన్ని సందేహాలేంటంటే-
1. ఢిల్లీ లో లగాన్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ లో ప్రమాదం జరిగిందనుకుందాం. ఆ థియేటర్ ని సీజ్ చేయాలా లేక దేశవ్యాప్తంగా లగాన్ సినిమా ప్రదర్శితమవుతున్న అన్ని థియేటర్లలో లగాన్ సినిమాని బ్యాన్ చేయాలా?

2. ఒక సినిమాని ఒక జిల్లా మొత్తం బ్యాన్ చేసిన సంఘటన నాకు తెలిసి తెలుగులో ఇదే ప్రథమం. “థియేటర్ ని సీజ్ చేయడం” వేరు. “సినిమాని బ్యాన్ చేయడం వేరు”. థియేటర్లలో భద్రతాప్రమాణాలు లేకపోతే “థియేటర్ ని సీజ్ చేయాలా” లేక “సినిమాని బ్యాన్ చేయాలా”. సాధారణంగా సినిమాని బ్యాన్ చేయడం అనేది ఆ సినిమాలో దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే లేదా దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సన్నివేశాలుంటే, అలాంటి సినిమాలని బ్యాన్ చేస్తారు. ఒకవేళ సినిమాని బ్యాన్ చేయడం సబబే అయితే బొత్సగారు రాష్ట్రానికి మంత్రి, విజయనగరం జిల్లాకి మాత్రమే కాదు. కాబట్టి అలాంటి పరిస్థితే ఉంటే ఎందుకు రాష్ట్రం మొత్తం బ్యాన్ చేయలేదు.

3. థియేటర్ల భద్రత ప్రమాణాలు పరిశీలించడం ప్రభుత్వం భాద్యతా లేక చిత్ర యూనిట్ దా?

4. సినిమటోగ్రఫీ మంత్రి చే ప్రకటన ఇప్పించిఉంటే రాజ్యాంగబద్దంగా ఉండేదేమో కానీ పంచాయితీశాఖామంత్రికి ఇలా సినిమాని బ్యాన్ చేయమని ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందా?

5. పోయినప్రాణాలు ఎవరూ తిరిగి తెచ్చి ఇవ్వలేరు. కాబట్టి ప్రభుత్వం థియేటర్లమీద కొరడా ఝళిపించడం మంచి పరిణామమే. కానీ కేవలం మగధీర ని మాత్రమే బ్యాన్ చేయడం కాకుండా రేపు రిలీజ్ అవనున్న (బొత్స సత్యనారాయణ పి.ఎ. అయిన కమెడియన్ గణేష్ నిర్మిస్తున్న – నిజానికి గణేష్ కేవలం డమ్మీయే, బొత్సగారే అసలు నిర్మాత అని రూమర్స్ ఉన్న) ఆంజనేయులు సినిమాని కూడా బ్యాన్ చేసి ఉండాల్సింది. ఎందుకు ఆంజనేయులు ని బ్యాన్ చేయలేదు.

ఇంకా చాలా ఉన్నాయి సమాధానాలు వెతకనవసరం లేని ప్రశ్నలు..


Responses

 1. bosthaa oka waste fellow zuran, siggu sharam lenodu…emanna ante naaneti sesaanu anthaa ole seisnaaru antaadu……..emi teliyanodi laaga

 2. ఆ ప్రకారంగా చూస్తే, థియేటర్లు అన్నీ బ్యాన్ చెయ్యాలి. భద్రతా ప్రమాణాలకనుగుణంగా ఉన్నాయనుకున్న తర్వాతే మళ్ళీ ప్రదర్శనలకు అనుమతించాలి. కేవలం మగధీర ఆడుతున్న థియేటర్లను మాత్రమే బ్యాన్ చేస్తున్నారంటే, కొద్దిమంది చనిపోయారన్ననెపంతో చేస్తున్న కక్ష సాధింపు చర్యగానే అనిపిస్తుంది.

 3. ప్రభుత్వ అరాచకాలు మితిమీరుతున్నాయి. కేవల౦ విద్వేష౦తో వ్యవహరిస్తున్నారు.
  కానీ దురదృష్ట వశాత్తూ వారికి మరో ఐదేళ్ళు లైసెన్స్ ఇచ్చేశా౦. మరో మార్గా౦తర౦ లేదు, అనుభవి౦చాల్సి౦దే.

 4. I agree with you Zuran. But as the pedarayudu said they have license for coming 5 years 😦

 5. […] ఈ పోస్ట్(ఇక్కడ క్లిక్ చెయ్యండి) చదవగానే పచ్చి బూతులు తిట్టాలనే […]

 6. Mulluni mullu tone teeyali annattu I request all mega fans and all cine lovers who are not welcoming this decision by Botsa to ban ANJUNEYALU movie by not watching it.

 7. In my previous comment, if you have not understood relation to Anjuneyulu movie and banning of Magadheera, see greatandhra.com, Botsa has major share in Anjuneyulu movie. I welcome greatandhra.com who are actually biased towards congress but they are supporting Magadheera

  • సెన్సార్ వారు, ఆంజనేయులు సినిమాకు “A” రేటింగ్ ఇచ్చారు. బహుశా ఇది కూడా మగధీరకు ప్లస్ అవ్వచ్చనుకుంటా. Anyway, I thought of watching “ఆంజనేయులు” in theater. Due to this I am not going to watch it. అయినా, రవితేజ సినిమాలు ఒకటి హిట్టయిన తర్వాత మరొకటి ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది. అందుకే రవితేజది ఒకటి హిట్టయిన తర్వాత, దాని తర్వాత వచ్చే సినిమాలు నేను చూడను. 🙂

 8. Yes, Bosta act not fair.

 9. yes, Bosta’s act all have to condemned.cinema halls inspection and security mesures has to maintain by the Government itself. This is total Governments failure. No body can’t stop charan’s victory.Mega fans sincearely enjoy the victory.

 10. sincearly enjoy the victory of Ram charan’s.No body can’t stop anybody’s victory.

 11. Hi Mohanraj,

  meevi kramam thappakundaa anni articles chadive mee abhimaanini.keep it up yaar.

  Thanks,
  Chandu

 12. బొత్స, వంగపండు చిరంజీవి ఫ్యామిలీ మీద కుళ్లుతో ఇలా చేస్తున్నారు. ఈ మధ్య రాజకీయాలు బాగా దిగజారాయి. ఈ దిగజారుడుకు అసంబ్లీ లో పెద్ద పెద్ద విషయాలను గూర్చి చర్చించకుండా శ్రీధర్ కార్టూన్లను గూర్చి చర్చించిన ముఖ్యమంత్రే ఆధ్యుడు. శ్రీధర్ ఎన్టీయార్, పి.వి., రాజీవ్ అందరిమీదా కార్టూన్లు వేశారు. కానీ ఎవరు దిగజారి గొడవ చేయలే. ఇక వంగపండు… ఈ దిగజారుడు లో-లెవెల్ విషయాలపై రాద్దాంతం చేసే ప్రస్తావనలో మరో పేజీ. గొడవ చేయడానికి ఎన్ని సమస్యలు లేవు. ఇదే దొరికిందా…

 13. http://prajaarajyam.page.tl/Free-Products_DVD.htm


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: