వ్రాసినది: mohanrazz | 2009/08/11

రాహుల్ గాడు

మా ఆఫీస్ లో ఒక 50% నార్త్ వాళ్ళు మిగిలిన వాళ్ళ లో తెలుగు, తమిళ్ గట్రా. అమ్మాయిలూ బాగానే. ఓ రోజు నేను, మా ఫ్రెండ్ ఒకబ్బాయి సాయంత్రం స్నాక్స్ కి క్యాంటీన్ కి వెళ్ళాం. అతని టీం కూడా మిలటరీ బ్యాచే మా లాగా! మా పాటికి మేము కూర్చుని చిరంజీవి, బాలయ్య బాబు, వై.యస్. తదితర తెలుగు తేజాల గురించి మాట్లాడుకుంటుంటే మా కాన్సంట్రేషన్ ని (‘కాన్ఫిడెన్స్ ని’ అని చదవగలరు) దెబ్బ తీస్తూ ఒక నార్త్ వాడు ఒక్కడే ఐదుగురు అమ్మాయిలని వెంటవేసుకుని క్యాంటీన్ లోకి వచ్చాడు . వాళ్ళూ ఏవో స్నాక్స్ తీసుకుని కూర్చున్నారు. మేము మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళ వైపు చూస్తూ మీ ఆఫీస్ లో లాగే ఛండాలంగా ఉండే మా ఆఫీస్ స్నాక్స్ తింటున్నాం. ఉన్నట్టుండి వాడు గట్టిగా పాడడం మొదలెట్టాడు. ఏదో హిందీ సాంగ్. అదీ ఫుల్ మెలోడీ. తగ్గేదే లేదు!! పాడుతూ పాడుతూ కళ్ళు కూడా మూసుకుని ఇంకా తన్మయత్వం తో పాడుతూన్నాడు గట్టిగా!

ఎవడు బాసూ ఈ ఎదవ అని నేను అనబోయేలోపు మా ఫ్రెండ్ – ‘రాహుల్ ఇరగదీస్తున్నడు గా’ అన్నాడు వాడి వైపు చూపిస్తున్నట్టుగా కళ్ళెగరేస్తూ!! ఒక్క క్షణం పాజ్ ఇచ్చి ‘వాడు తెలుసా నీకు’ అని అడిగా. ‘అబ్బే ఛ! ‘ లేదు అన్నాడు. ‘మరి రాహుల్ అన్నావ్’ అన్నాను.

‘ఏమో బాసూ నాకు నార్త్ వాడు ఎవడైనా ఇలా ఉండి (బక్కగా, పొడుగ్గా, మీసం లేకుండా ప్లస్ ఫుల్ ఆత్మవిశ్వాసం తో – కనబడ్డాడా??), ఇలాంటి పనులు (ఐదుగురు అమ్మాయిలని వేసుకుని ఒక్కడే క్యాంటీన్ కి రావడమే కాక సీరియస్ గా తన్మయత్వం తో రొమాంటిక్ పాట పాడి వినిపించడం ) చేస్తుంటే వాడి పేరు గ్యారంటీ గా రాహుల్ అయివుంటుందని నా స్ట్రాంగ్ బిలీఫ్’ అన్నాడు.

ఆలోచించాను. నాకూ నిజమేననిపించింది !!
(రాహుల్ పేరున్న తెలుగు పాఠకులకి క్షమాపణలతో)


Responses

 1. మా షేహితుడు రాహుల్ తో చెపుతా ఉండండి.

 2. హహహ
  మొన్న కొందరు స్నేహితులతో షారుఖ్ ఖాన్ నటన చర్చిస్తూ “సర్కస్ సీరియల్ సమయంలోనే షారుఖ్ ఖాన్ నటుడు. ఆ తరువాత…” అని నేను పెదవి విరిస్తే.
  మరో స్నేహితుడు “షారుఖ్ ఖాన్ నటించడం ఎప్పుడో మానుకున్నాడు. అన్ని పాత్రల్లోనూ ‘తనే షారుఖ్ ఖాన్’ అనిపించేలా జీవిస్తాడు అంతే” అన్నాడు.
  ఇంతలో మరో మిత్రుడు “షారుఖ్ ఖాన్ ఏ సినిమాలో నటించినా రెండే రెండు పాత్రలు చేస్తాడు. ఐతే ‘రాజ్’ లేకపోతే ‘రాహుల్’ ” అంటే… ఆ తరువాత ఒకటే నవ్వులు అంతే!

  • హ హ కరెక్టే. రాజశ్రీ వాళ్ళ హీరో పేరు ఎప్పుడూ “ప్రేమ్” అని ఉన్నట్టన్నమాట

 3. 🙂

 4. ఇదే టపాను చాలా రోజుల క్రిందట ఓసారి చదివినట్టు గుర్లు. మీ పాత బ్లాగులో ఏమైనా వ్రాశారా?

  • అవును బాసూ..కొన్ని ఆ పాత టపాల్ని ని నెమ్మది గా “జురాన్ సినిమా జీవన స్రవంతి లో” కలిపేస్తున్నాను


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: