వ్రాసినది: mohanrazz | 2009/08/12

దేవులపల్లి బాధ Vs శ్రీశ్రీ బాధ

 

 

 

 

 

ఎప్పుడో చదివిన ఒక విషయం ఎందుకో ఇవాళ గుర్తొచ్చింది. తెలుగు సాహితీ ప్రియులకి సుపరిచితమైన ఇద్దరు దిగ్గజాలు దేవులపల్లి కృష్ణ శాస్త్రి మరియు శ్రీ శ్రీ. అయితే వీళ్ళిద్దరి రచనాధోరణులు పూర్తిగా విరుద్దం. వీరి రచనాశైలుల్ని పోల్చి విశ్లేషించి, ఒకే వాక్యం లో చెప్పిన ఒక మాట బహుశా మీరు వినే ఉంటారు-

 

దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ.
ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ!!

చలం అన్న మాటలివి. చిన్నపుడెపుడో దేవులపల్లి కవిత ఒకటి చదివినపుడు ఈ మాట అక్షరాలా నిజమనిపించింది.

కోయిలా కోయిలా కూయబోకే
తీపితో నా గుండె కోయబోకే !!
 

కోయిల కూస్తే ఆ పాట ఎవరికైనా ఆనందాన్నిస్తుంది. ఆ గానం అద్భుతంగా ఉందనో, అమృతతుల్యంగా ఉందనో వ్రాస్తారెవరైనా! అయితే అంత పారవశ్యం దేవులపల్లి గారికి ఏ తీపి ఙ్ఞాపకాల్ని గుర్తు చేసిందో మరి, తీపితో నా గుండె కోయబోకె అని బాధపడుతూ కోకిలకి విన్నవించుకున్నాడు. ఆయన బాధ మనమంతా కూడా సహ అనుభూతి పొందేలా చేసి “దేవులపల్లి బాధ ప్రపంచానికే బాధ” అనిపించేలా చేసాడు. ఇక శ్రీ శ్రీ గారి గురించి, ఆయన రచనా శైలి గురించి మనందరికీ తెలిసిందే! దేవులపల్లి తన బాధ ప్రపంచానికే బాధ అనిపించేలా చేస్తే శ్రీ శ్రీ ప్రపంచపు బాధనంతా తన నెత్తికెక్కించుకుంటాడు. పతితులు, భ్రష్టులు, బాధాసర్ప ద్రష్టులు అందరి బాధలు తనవే అయినట్టు ఫీలవుతాడు. జగన్నాధరథచక్రాలేవో వస్తున్నాయని వాళ్ళని ఊరడించడానికి, ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. ఏది ఏమైనా నిజంగా..

 

దేవులపల్లి బాధ ప్రపంచానికి బాధ.
ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ!!

ప్రకటనలు

Responses

 1. టపా బాగుంది.

 2. చక్కటి మాట చెప్పారు.!

 3. nijamea!

 4. చలం గారి వ్యాఖ్యలని నేనూ చదివేను. చలం, శ్రీశ్రీ, దేవులపల్లి ని మళ్ళీ గుర్తు తెచ్చినందుకు ధన్యవాదాలు. మల్లీశ్వరి సినిమా లో
  “ఔనా, నిజమేనా” పాట విన్న ఏ తెలుగింటి అమ్మాయి/అబ్బాయి మల్లి/బావ లాగ feel అవ్వకుండా ఉండగలరు చెప్పండి!!!

 5. మీ టపా కి దేవులపల్లి బాధ, శ్రీ శ్రీ వ్యధ అని పేరు పెట్టాల్సింది.
  బాధ కన్నా వ్యధ పెద్దది కద…పాపం శ్రీ శ్రీ ది ప్రపంచపు బాధాయె !!! [:)]

  • ha ha..కరక్టే! శ్రీశ్రీ బాధ ఖచ్చితంగా చాలా పెద్దది. అయితే చలం మాటల్ని మార్చడానికి కావలసిన అచం”చలమై”న ధైర్యసాహసాలు నాకు లేకపోయాయి..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: