వ్రాసినది: mohanrazz | 2009/08/12

ప్రత్యేక “జార్ఖండ్” రాష్ట్రం

 
మొన్న ఆఫీస్ కేఫటేరియా లో ఒక్కడినే కూర్చుని ఉంటే ఒకాయన పరిచయమయ్యాడు.
మాటలు కలిపాక నేను “From Andhrapradesh అన్నాక తాను From Jharkhand అని
చెప్పి- తనకు తానే AP విభజన  టాపిక్ మొదలెట్టాడు. బహుశా నాకంటే keen
గా మన పాలిటిక్స్ గమనిస్తున్నట్టున్నాడు. అసలు నన్నేమీ అడగకుండా ఆ ఐదు నిముషాల్లో ఆయన చెప్పిన నాలుగు ముక్కలు ఇవీ-

 
– బీహార్ నుంచి తొమ్మిదేళ్ళ క్రితం “వెనుకబాటుతనం” కారణమ్మీదే జార్ఖండ్
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది
– ఈ తొమ్మిదేళ్ళ లో రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రులు మారారు
– ఏ సింగిల్ పార్టీ కి మెజార్టీ రాక- ఇండిపెండెంట్లదే హవా.
– ఒక ఇండిపెండెంట్ MLA 14 నెలల పాటు ముఖ్యమంత్రి గా ఉన్నాడు
– వెనుకబాటుతనం నిజమే కానీ ప్రత్యేక రాష్ట్రం దానికి పరిష్కారం కాదు (జార్ఖండ్ విషయం లో)
– ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది, ప్రతి చిన్న
విషయం లోనూ కరప్షనే.
– ఈ తొమ్మిదేళ్ళ లో అభివృద్ది జరక్కపోగా అన్నిరకాలుగా తిరోగమనమే
– ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డం వల్ల లాభపడింది కేవలం రాజకీయనాయుకులు
మాత్రమే..


స్పందనలు

  1. తెలంగాణా రాష్ట్రం వస్తే ఇక్కడ కూడా జరిగేది అదేమోనని భయంగా ఉంది.

  2. ఇవన్నీ ఎవడికి పట్టినై? కేకు ముక్కల్ని పంచుకు తింటానికి ఆవురావురుమంటూ ఎదురుచూస్తున్నాయి నిరుద్యోగ రాజకీయ రాబందులు. వాళ్లకి వంతపాడే చవటలూ కొంతరున్నారు – మేధావుల పేరు తగిలించుకుని. మధ్యలో మీడియా ఒకటి.

  3. మీరు చెప్పింది కరక్టే.
    కాని అంతకు ముందు దశాబ్దాల బాటు బీహార్ కలిసిఉండి సాధించేదివిటి?
    లాలూ తరువాత ఇప్పుడు నితీష్ కుమార్ వచ్చాకే కొద్దో గొప్పో అభివృధ్ధి జరుగుతోంది.

    అభివృధ్ధి సాధించడానికి కలిసి ఉన్నామా, విడిపోయామా అన్నది ముఖ్యం కాదు.

    సరైన నాయకత్వం ఉంటేనే కలిసున్నా, విడిపోయినా మేలు జరుగుతుంది.

  4. there is no doubt in that …chivariki nasta poyedi common people…nothing will happen to …common people…valla paristiti marinta diga jaradam kaayam…

  5. Very much valid points…
    how shud the common man understand this..who could educate him?…

  6. కలిసుంటే సామాన్యులు సాధించేది ఏముంది ?

    ఈ ఉద్యమం వలన తెలంగాణ వస్తుందో రాదో అనే మాట పక్కన పెడితే , రాజకీయ నాయకుల నాటకాలు బయట పడిన మాట వాస్తవం.

    ఎన్నికలకు ముందు పోటీపడి సై అన్నారు. ఇప్పుడు అసలు గళం వినిపిస్తున్నారు.

  7. The same is not true for Chattisgarh. I have done an economic survey of chattisgarh’s 16 dictricts in 2003 and compared it to when the region was in Madhya Pradesh. Trust me, not just economic progress but the state achieved an identity, which people of chattisgarh were more than happy with.

    So, its not necessary that every separated state will end up like Jharkhand, or what your contact thinks of Jharkhand as.

    Each region has its own endowments and entitlements attached to the individuals to the region and economic progress and political activities need not go to extreme in every manner!

  8. Nakoo doubt… separate ‘Telangana’ annappude ‘Samaikya Andhra’ ani arichi undochchugaa…. ippudu central nundi green signal vachchaka hadavidiga rachcha start chesi dramalendhuku?

  9. sorry ignore my comment…. it was supposed to be posted on a different site

  10. I completely agree with bonagiri and prashanth

    అలా చూస్తే కలిసున్నప్పుడు విడిపోయినప్పుడూ కూడా ఉత్తరాంచల్ బాగా అభివ్రుధి చెంది ఉంది. ఆ పార్ట్ UP లో కలిసున్నప్పుడు బాగా ఉన్నత దశలో ఉంది విడిపోయాకా ఉత్తరాంచల్ కూడా అలాగే అభివ్రుధి దశలోనే ఉంది.

    కాని వద్దు విడిపోతాం అనేవాళ్ళని ఆపి బలవంతంగా కలిపి కట్టేసుకోవడం భావ్యం కాదు…..అది సఖ్యతని చాటొకోదు…ఇక మిగతా విషయాలకొస్తే సావధానంగా ఆలోచించి పరిష్కరించుకుంటే సరి.

    a2Zdreams చెప్పినట్టు అన్ని ప్రాంతాల రాజకీయనాయకుల నాటకాలు బయటపడుతున్నాయి

    as Prasanth said economic progress, riginal endowments, political activities are needed.

    అన్నిటికన్న ముఖ్యంగా నిజాయితీ ఉండాలి రాజకీయనాయకులలోను ప్రజలలోను కూడా


వ్యాఖ్యానించండి

వర్గాలు