వ్రాసినది: mohanrazz | 2009/08/14

ఉ… :-)

upendra1[1]

ఉ..అంటే ఉపేంద్ర అన్నట్టు. ష్, ఓం, A, స్వస్తిక్ (స్వస్తిక్ సింబల్ ఒక్క అక్షరమే వస్తుంది) లాంటి ఒక్క అక్షరం టైటిల్స్ ఉన్న సినిమాలతో ఒకప్పుడు బాగా పాపులర్ అయ్యాడు. ఉపేంద్ర అని ఫైనల్ గా తన పేరు తోనే ఒక సినిమా తీసి ఆ తర్వాత సినిమాలు తీయడం మానేశాడు. ఎవరో ఒక ఇంటర్వ్యూ లో అడిగారు-“ఈ మధ్య మీరెందుకు డైరెక్షన్ చేయడం మానేశారు” అని. “దానికి ఒక ప్రత్యేక కారణముంది. కానీ ఆ కారణం నేను మీకు చెప్పను” అన్నాడు. “అయితే వాకే” అనుకున్నారు జనాలు 😀 .

అయితే ఉపేంద్ర అనే సినిమా రిలీజ్ కి ముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చదువుతూంటే మాత్రం దిమ్మ తిరిగిపోయేది. ఆ సినిమ గురించి రిలీజ్ కి ముందు ఆయన చెప్పిన కొన్ని అంశాలు-
1. ఇది 2డి సినిమా. అంటే మొదటి సారి చూసినపుడు స్టోరీ ఒకలా అర్థమవుతుంది. రెండోసారి చూస్తే ఇంకోలా అర్థమవుతుంది.(సినిమా రెండో సారి చూసాక మా ఫ్రెండన్నాడు- మొదటిసారి చూసినపుడు ఏదో కొంచెమన్నా అర్థమయింది, రెండోసారి చూసాక అది కూడా అర్థం కాకుండా పోయింది 🙂 )

2. ఈ సినిమా కి ఉపేంద్ర అని టైటిల్ పెట్టడానికి ఒక కారణముంది. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. (ఈ సినిమాలో ఉపేంద్ర పేరు “నేను”. బహుశా “నేను” ఉపేంద్ర కాబట్టి అలా సెట్టయిందేమో)

3. ఈ సినిమా పేరు ఉపేంద్ర లో ఉ అంటే- ఉపేంద్ర, పే అంటే- హీరోయిన్ ప్రేమ- ద్ర లో ద అంటే ఇంకో హీరోయిన్ దామిని, ద్ర లో ర అంటే మూడో హీరోయిన్ రవీనా. (అబ్బో, అలా కలిసొచ్చిందన్నమాట)

4. ఈ సినిమా లో హీరోయిన్ ప్రేమ కనిపించే ప్రతి సీన్ లోనూ వర్షం వస్తుంది. దామిని ఉండే ప్రతి సీన్ లోనూ ఎండ ఉంటుంది. రవీనా ఉండే ప్రతి సీన్ లోనూ గాలి/చలి ఉంటుంది. వీళ్ళ ముగ్గురూ మూడు ఋతువులకి సింబల్స్. వీళ్ళు ముగ్గురూ ఒకే ఫ్రేం లో కనిపించే సీన్లో వర్షం, ఎండ, గాలి మూడూ ఉంటాయి.వీళ్ళలో ఇద్దరు మాత్రమే ఒకే ఫ్రేం లో ఉంటే వాళ్ళిద్దరికీ సంబంధించినవి- అంటే వర్షం+ఎండ లేదా వర్షం+గాలి లేదా గాలి+ఎండ అలా మొత్తం సినిమా మొత్తం ప్రతి ఫ్రేం లో ఇది మెయింటెయిన్ చేసాం. (సినిమా మొత్తం కాదు కానీ 80% సీన్స్ లో మెయింటెయిన్ చేసారు)
   

ఇంకా ఇలాంటివేవో కొన్ని చెప్పాడు కానీ గుర్తు రావట్లేదు.
ఈ సినిమాని రిలీజయిన రెండోరోజు సెకండ్ షో చూసాను. థియేటర్ మొత్తమ్మీద ఒక నలుగురు మాత్రమే లేడీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటర్వల్ కి జంప్. టైమ్స్ ఆఫ్ ఇండియా రివ్యూ లో Upendra is highly overrated film maker who makes films to vent through his frustrations అని వ్రాసాడు. కొన్ని తెలుగు పత్రికల్లో “వీడెక్కడి తిక్క పురుషుడండీ” అని వ్రాసారు. ఒకపత్రికలో మాత్రం “చలం గారి మ్యూజింగ్స్ ని తెరమీద చూస్తున్నట్టనిపించింది” అని వ్రాసారెవరో. కొంతమంది కి నచ్చింది, కొంతమందికి విరక్తి తెప్పించింది. అయితే ఒకమాట మాత్రం నిజం – ఉపేంద్ర స్క్రిప్ట్ లో చాలా క్రియేటివిటీ ఉంది. అసలు ఆ ఓపెనింగ్ షాట్స్ లో ఒక స్వామీజీ వచ్చి పిల్లాడి గా ఉన్న ఉపేంద్ర ని “బాబూ నీ పేరేంటి?” అనడిగితే “నా పేరు నేను” అంటాడు. “అలా కాదు బాబూ రామా, కృష్ణా అలా ఏదో ఒక పేరుంటుంది కదా, అలా నీ పేరు ఏంటి” అంటే “నేనెందుకు రామా కృష్ణా అని వాళ్ళెవరివో పేర్లు పెట్టుకోవాలి? నా పేరే నేను” అని చెప్పే సీన్స్ కి థియేటర్ లో చప్పట్లు పడ్డాయి. సినిమా మొదట్లో చాలా క్రియేటివ్ గా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి వెగటైపోతుంది. కథ కూడా గాడి తప్పుతుంది. అయితే ఒకటి నిజం. ఉపేంద్ర ఆలోచనాతీరే డిఫరెంట్. దాన్ని emulate చేయడం కూడా కష్టం. కె.ఎస్.నాగేశ్వరరావు డైరెక్షన్ లో పరుచూరి వారి రచనలో వచ్చిన “రా” అనే సినిమా ఒకటి ఉంటుంది. ఉపేంద్ర సినిమాలు నాలుగు చూసి, ఆయన తరహా లో కథ వండుదామని ప్రయత్నించి భంగపడ్డారు పరుచూరి బ్రదర్స్ ఈ సినిమా తో. ఒరిజినల్ థింకింగ్ ఒరిజినలే ఎప్పటికైనా!


Responses

 1. హ్మ్మ్

 2. మనకెందుకులే అని ఉపేంద్ర సినిమాలు నేను చూడను. అదే విధంగా రాంగోపాలవర్మ హర్రర్ మూవిస్ కూడా చూడను. రాంగోపాలవర్మ బ్లాగు చదివాక, I Should not miss his movies అనిపించింది. ఇప్పుడు ఈ ఆర్టికల్ చదివాక I Should not miss upendra movies అనిపిస్తుంది.

  • “ఉపేంద్ర” సినిమాతో పాటు ఉపేంద్ర మిగిలిన సినిమాల్లోని కొన్ని ఇంట్రెస్తింగ్ థింగ్స్ కూడా కలిపి…అన్నీ ఇదే పోస్ట్ లో ఒకేసారి డిస్కస్ చేద్దామనుకున్నా కానీ కొంచెం లెంగ్త్ ఎక్కువవుతుందని మానేసా.అవన్నీ ఇంకో పోస్ట్ లో వ్రాస్తాను!

 3. one of my fav. director

 4. ఈ మధ్యే ఉపేంద్ర ఒక పేరు లేని సినిమా ప్రకటించాడు. దానికి పేరు లేకున్నా ఒక బొమ్మను పేరుగా వాడుకుంటారంట. ఆ బొమ్మ ఏంటంటే “అర చేయి బొటనవేలు మొదటి వేలు (index finger) వుండగా చుట్టి బాగుంది అని చూపించే బొమ్మ (అరచేయి వరకే)”

 5. నాకు ఉపేంద్ర సినిమాలంటే ఇష్టం.జీనియస్. కాస్త పర్వర్టెడ్. ఆయన రీమేకులతో (గజిని, శివపుత్రుడు, శంకర్ దాదా…)బిజీ గా ఉన్నాడు. “ఎ “సినిమాలో సినిమా మొదట్లోనే అడుక్కునే వాళ్ళకు బ్రతికే హక్కులేదని షూట్ చేస్తాడు. ఉంపేంద్ర సినిమా… డబ్బు, సెక్స్, ప్రేమ అనే వాటివెంట పడి తన ఐడెంటిటీని పోగొట్టుకున్న నేను అనే అతని గూర్చి . మనిషి తన గానే ఉండాలి, మరొకరికోసం దొంగమాటలు, ఉన్నది లేనట్లు చెప్పడం ఇలాంటివి వద్దంటాడు. ఇక పర్వర్షన్ కి సంబంధించిన అంశాలు చాలా.(అవి నచ్చాయని కాదు.) “ఉపేంద్ర” సినిమా కేవలం మగ ప్రేక్షకులతోనే వందరోజులు ఆడింది.

  • ఎక్సలెంట్ గా చెప్పారు. డబ్బు కోసం రవీనా ని పెళ్ళి చేసుకుందామనుకుంటాడు. సెక్స్ కోసం మిడిల్ క్లాస్ ప్రేమ ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. “నిజమైన ప్రేమ” కోసం దామిని ని లవ్ చేస్తుంటాడు. కాకపోతే క్రియేటివిటి ఎంతుంటుందో పెర్వెర్షన్ కూడా అంతే ఉంటుందీ సినిమాలో. ఉపేంద్ర సినిమా పోస్టర్స్ లో తనని తాను “బాస్ ఆఫ్ మాస్” అని అభివర్ణించుకున్నాడు. అది మాత్రం కరక్టే

 6. 🙂 🙂 🙂

  నేను ఉపేంద్ర వి ‘A’, ‘ఉపేంద్ర ‘ సినిమాలు చూసాను. అవి మంచి సినిమాలే అనుకుంటున్నాను .


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: