వ్రాసినది: mohanrazz | 2009/08/18

థియేటర్ లో విజిల్స్

 
ఫలానా సీన్ కి థియేటర్ లో విజిల్స్ పడ్డాయి, ఫలానా సీన్ కి చప్పట్లు పడ్డాయి అని అప్పుడప్పుడు గర్వంగా చెప్తూంటారు మన దర్శకులూ, రచయితలు. మన తెలుగు లో మాస్ ప్రేక్షకులు ఎక్కువ, మన తెలుగు సినిమాల్లో మాస్ సినిమాలు ఎక్కువ. సీన్ నచ్చితే మన ప్రేక్షకులు, ప్రత్యేకించి నేల క్లాస్ ప్రేక్షకులు, దాన్ని ఆస్వాదించే విధానం అది. అయితే అలా ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే సీన్ల గురించో, విజిల్స్ వేయించుకున్న సీన్ల గురించి డిస్కస్ చేయడమో కాదు ఈ టపా ఉద్దేశ్యం. ఆ మధ్య కొన్ని సినిమాల్లో ఒక కొత్త పోకడ గమనించాను. దాన్ని పంచుకుందామని ఈ టపా.

ఖడ్గం సినిమాని రిలీజైన రెండో రోజో మూడో రోజో చూస్తున్నా థియేటర్లో. మొదటి పాట “మేమే ఇండియన్స్” అని వస్తోంది. పాట చివర్లో ఒక చిన్న బిట్ గ్రాఫిక్స్ తో ఉంటుంది. చార్మినార్ చుట్టూ భారత్ జెండా కప్పినట్టు గా ఉండే ఆ సీన్ అప్పుడు విజిల్స్ వినిపించాయి. ఓహో, జనాలకి బాగా నచ్చినట్టుంది అనుకున్నాను. తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా చూసాను. థియేటర్ లో 50 మంది కూడా లేరు. కానీ ఆ సీన్ అప్పుడు మాత్రం విజిల్స్. నాకు డౌట్ వచ్చింది. జనాలెవరైనా వేశారా లేక సాంగ్ లో మ్యూజిక్ డైరెక్టరే “విజిల్స్” మిక్స్ చేసాడా అని. నా డౌట్ కరక్టే. తర్వాత టివి లో ఆ పాట వచ్చినప్పుడు కన్‌ఫర్మ్ చేసుకున్నా. మా ఇంట్లో అయితే ఎవరూ విజిల్స్ వేయరు కదా 😀 . నరసింహ సినిమా లో రజనీ ఇంట్రడక్షన్ అప్పుడు కూడా ఇదే టెక్నిక్ వాడారు. సినిమాలోంచే చప్పట్లు వినిపిస్తాయి.

అయితే జనాలు నిజంగా విజిల్స్ వేస్తారని నమ్మకముంటే ఇట్టాంటి టెక్నిక్స్ అవసరం లేదు. వేస్తారో వేయరో అని డౌట్ ఉన్నపుడే ఇవన్నీ కావాలేమో!

ప్రకటనలు

Responses

  1. 🙂

  2. http://prajaarajyam.page.tl/Free-Products_DVD.htm

    your analyse in films is nice

  3. Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

    Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

    Click here for Install Add-Telugu widget

  4. @వేస్తారో వేయరో అని డౌట్ ఉన్నపుడే ఇవన్నీ కావాలేమో!

    I Can’t agree on this.

    ఇది మంచి టెక్నిక్. ఎందుకంటే ఆ విజిల్స్ ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇంగ్లీష్ టి.వి షోస్ లో ఎప్పటినుండో వున్నాదే.లిమిటడ్ గా ఈ టెక్నిక్ యూజ్ చేసుకున్నంత కాలం ప్రోబ్లం వుండదు.

    • కరక్టే కానీ..థియేటర్ లో పెద్దగా జనం లేనప్పుడు లేదా విజిల్స్ వస్తాయనుకున్న సీన్ పేలవంగా ఉన్నపుడూ ఈ “టెక్నిక్” మరింత బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనుకుంటా. టివి లో చూసేటపుడు సరేసరి.

  5. Ha..hha…hhaaa….


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: