వ్రాసినది: mohanrazz | 2009/08/19

మొండి “వర్మ” “కెప్టెన్” కంటే బలవంతుడు…

varma-dhoni

మొన్నీ మధ్య జరిగిన “వర్మ-ధోని” ఎపిసోడ్ మీకు తెలిసే ఉంటుంది. ఈ ఎపిసోడ్ ని మామూలు గా చూస్తే ఏమీ అనిపించకపోవచ్చు కానీ అంతకు ముందు జరిగిన “అమితాబ్-ధోని” ఎపిసోడ్ కి ముడిపెట్టి చూస్తే మాత్రం భలే నవ్వొచ్చింది నాకు. 

అప్పుడెప్పుడో 2009 పద్మశ్రీ అవార్డులు అనౌన్స్ చేసినప్పుడు పాపం అమితాబ్ అంతటాయన హర్భజన్ కి, ధోని కి కాల్ చేసి విషెస్ చెబుదామని కాల్ చేస్తే హర్భజన్ ఏమో కాల్ రిసీవ్ చేసుకుని థ్యాంక్స్ చెబితే ధోని నుంచి రెస్పాన్స్ రాలేదట. సర్లే బిజీ గా ఉన్నాడేమో అనుకుని అమితాబ్ అక్కడికీ మెసేజ్ పెడితే దానికీ రెస్పాన్స్ లేదుట. అమితాబ్ కొంచెం హర్ట్ అయ్యాట్ట. ఇదే విషయం జాన్ అబ్రహాం కి చెబితే (జాన్, ధోని మంచి ఫ్రెండ్స్) జాన్ ఉండి, “సరే ఇప్పుడు ఫోన్ చేద్దాం ఉండండి” అంటే..అమితాబ్ “ఇప్పుడొద్దు లే ఇంకాసేపట్లో మ్యాచ్ స్టార్టవబోతోంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం..” అని మ్యాచ్ చూసారట ఇద్దరూ. సరే అప్పుడు ధోని తెలిసి చేశాడా, తెలీక చేశాడా అనేది ప్రక్కనపెడితే అమితాబ్ కొంచెం హర్ట్ అయిన విషయం వాస్తవం. బహుశా తర్వాత ధోనీ ఆయనకి సర్ది చెప్పి ఉండొచ్చు, అమితాబ్ కూడా తనకి తాని “సర్ది చెప్పుకొని” ఉండొచ్చు. ఇది అప్పుడెప్పటిదో సంగతి. అయితే మొన్నీ మధ్య ఇంకో విషయం జరిగింది.

బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ లో విఐపి లాంజ్ లో వర్మ ఉంటే ధోనీ వెళ్ళి వర్మ ని కలిసి మాట్లడటానికి ప్రయత్నిస్తే, ఎవరో సినిమా చాన్స్ కోసం వచ్చారనుకుని “ఫొటొలు తన ఆఫీస్ కి పంపమని”  చెప్పాట్ట వర్మ.  తర్వాత ప్రక్కనున్న వాళ్ళెవరో అతను ధోనీ అని చెబితే “అవునా, నేను క్రికెట్ పెద్దగా చూడను కాబట్టి ధోనీ ని గుర్తు పట్టలేకపోయాను, ఈసారి కలిసినపుడు ధోనీ కి సారీ చెబుతాలెమ్మన్నా”ట్ట రామూజీ 🙂 . మీడియాలో కూడా “నిజంగానే నేను క్రికెట్ చూడను కాబట్టి నిజంగానే ధోనీ ని గుర్తుపట్టలేకపోయాను 😀 ” అని కూడా అన్నాడు వర్మ. బహుశా నిజంగానే వర్మకి క్రికెట్ గురించి తెలీకపోయి ఉండవచ్చు. ధోనీ ని హర్ట్ చేయాలన్న ఉద్దేశ్యం అతనికి ఎంత మాత్రం లేక పోయి ఉండొచ్చు కానీ జరగాల్సిన డేమేజీ జరిగేసింది. ఏదేమైనా “మొండి వాడు రాజు కంటే బలవంతుడు” అన్నట్టు రాం గోపాల్ వర్మ మొండితనం ముచ్చటేస్తుంది కొన్ని సార్లు.


Responses

 1. evadi pichhi vaadiki anandam…………..

 2. హహహ వర్మది మొండితనమా,పిచ్చా అనేవి పక్కనబెడితే ఒక specimen అనేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుకుతీరాల్సిందే. ఇలాంటోడు మరొకడు లేడు.

 3. RGV Rocks ..

 4. పాపం ఇందులో మొండితనమేముందండి. చచ్చిపోయేలోపు వెయ్యి సినిమాలు తియ్యాలనుకుంటున్నాడు కదా. అందుకే నిజంగానే బిజీగా ఉండుంటాడు.

  • good catch.

   “వందమంది వంద రకాలుగా అనుకుంటారు. I Know what I am. I don’t care any body except true innocent comments” అని అంటాడు రాంగోపాలవర్మ . which is true.

 5. king of directors

 6. నాకెందుకో వర్మ అంటే అస్సలు నచ్చదు. అతని ఆలోచనలన్ని విక్రుతం గా ఉంటాయనిపిస్తుంది. ఈ మధ్య దెయ్యాల పిచ్చి కూడా బాగా పట్టినట్టుంది.

  • హ హ..మొన్నామధ్య ఒక టివి ప్రోగ్రాం లో వర్మ కి కాల్ చేసి ఎవరో ఒకాయన “సార్, మీరు రాత్రి దెయ్యం, భూత్, ఫూంక్ అని పేర్లు పెట్టి ఒకే సినిమాని నాలుగు రకాలుగా తీశారని నాకనిపిస్తోంది..” అన్నాడు. దానికి వర్మ “నాలుగు రకాలుగా తీశానని మీకెందుకు అనిపించింది. నాకైతే ఒకేరకంగా తీశాననిపించింది..” 😀

   • ఈ సమధానం లో మాత్రం వర్మ నిజాయితీని ఒప్పుకోవాలి.
    అన్ని దెయ్యాల సినిమాలు ఒకే రకంగా ఉంటాయి, వాటిలో కొత్తదనమేముంటుంది!!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: