వ్రాసినది: mohanrazz | 2009/08/20

సామాజిక రుగ్మతలకి “శ్రద్దాంజలి”..

shradhanjali

కరుణాకరన్ లాంటి ఓ కొత్త డైరెక్టర్ వచ్చి “తొలిప్రేమ” లాంటి సెన్సేషనల్ హిట్టివ్వగానే క్యూ లో ఉన్న మిగతా కొత్తవాళ్ళకి ఒక్క దెబ్బకి ఫుల్ బూమ్ వచ్చింది. నిజంగా ఆ 1998 నుంచి 2003 దాకా ఒక ఐదేళ్ళు తెలుగు ఇండస్ట్రీ లోకి కొత్త డైరెక్టర్లు ఒక వరద లా వచ్చారు. ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ పూరి, వివి వినాయక్, రాజమౌళి, చంద్ర శేఖర్ ఏలేటి, త్రివిక్రం, కరుణాకరన్ లాంటివాళ్ళందరూ ఆ టైం లో నే వచ్చారు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది కూడా వచ్చారు కానీ కొంతమంది సక్సెస్ అయ్యారు కొంతమంది ప్యాకప్ అయ్యారు. అయితే ఆ టైం లో వచ్చిన కొత్త డైరెక్టర్ల సినిమాల్లో కొన్ని ఫ్లాపయిన వాటిలో కూడా మంచి “స్టోరీలు” ఉన్నాయి. కానీ బ్యాడ్ ఎగ్జిక్యూషన్ వల్ల ఫ్లాపులు అట్టర్ ఫ్లాపులు అయ్యాయి.

ఆ పీరియడ్ లో వచ్చిన ఒక సినిమా శ్రద్దాంజలి. బహుశా హీరోగా శివాజీ ఫస్ట్ సినిమా అనుకుంటా. సామాజిక రుగ్మతలకి “శ్రద్దాంజలి” అని యాడ్ వేశాడు. కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం బెజవాడ టాకీస్ అని వేశాడు ఆయన పేరేమీ వేయకుండా. కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. మొదటి రోజు సెకండ్ షో కి రెడీ అయిపోయాం. థియేటర్ దాదాపు హౌస్ ఫుల్ గా వుంది. ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత మూడో రోజో నలుగోరోజొ ఆ సినిమాని థియేటర్లోంచి తీసేశారు. అలా ఉండిందా సినిమా. అయితే టైటిల్స్ లో బాగా వెరైటీ ట్రై చేశాడు డైరెక్టర్. “అంకితం – నాకు స్ఫూర్తినిచ్చిన రాం గోపాల్ వర్మ, మణిరత్నం ల కి” . “కృతఙ్ఞతలు – పాత్రికేయులకి, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అని దీవించిన శ్రేయోభిలాషులకి”  అని వేశాడు టైటిల్స్ లో. అబ్బో కేక అనుకున్నాం..సినిమా మొదలయ్యాక అర్థమైంది..ఘోరంగా బుక్ అయిపోయామని..

ఇక కథేంటంటే, శివాజీ ఒక అనాధ. ఒక రౌడీ. వీళ్ళదో గ్యాంగ్. విలన్లది ఇంకో గ్యాంగ్. వాళ్ళు శివాజీ ని దొరికితే చంపేయాలి అని ఫస్ట్ సీన్ నుంచి ట్రై చేస్తుంటారు. ఈ లోగా శివాజీ జీవితం లోకి ఒక హీరోయిన్ వస్తుంది. లవ్. అమ్మాయి వాళ్ళింట్లో పేరెంట్స్ కి ఈమె రౌడీని లైక్ చేయడం ఇష్టముండదు. ఈ కథ ఇలా సా..గు..తూ ఉంటుంది. ఇక క్లైమాక్స్ కి వచ్చేస్తాను. ఒకసారి చిన్న యాక్సిడెంట్ వల్ల హీరోయిన్ కి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసే సీన్ ముందెపుడో చూపించి ఉంటారు. క్లైమాక్స్ టైం కి ఆమె కి ఎయిడ్స్ అని తేలుతుంది. ఇప్పుడంటే నిశ్శబ్దాన్ని ఛేధించి, ఛేధించి కొంత అలవాటైపోయింది కానీ ఈ సినిమా రిలీజయిన టైం అప్పుడు ఎయిడ్స్ అంటే అవగాహన కొంచెం తక్కువే. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని సరిగ్గాచూడక ఆ అమ్మాయిని తాకడానికే భయపడేలా బిహేవ్ చేయడం మొదలెడతారు. వాళ్ళకి క్లాస్ పీకి శివాజీ హీరోయిన్ ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. వెళుతూ ఉంటే మొదటి సీన్ నుంచి శివాజీని చంపడానికి ట్రై చేస్తున్న విలన్ గ్యాంగ్ ఎదురుపడుతుంది. శివాజీ ని చంపబోతుంటే శివాజీ ఏడ్చి తనని వదిలేయమని అడుగుతాడు. తనకోసం కాదని తన ప్రాణాలు తనకి లెక్క లేదనీ, కానీ ఇంక ఎన్నోరోజులు బతకని హీరోయిన్ ని తాను చూసుకోవాలని..ఆ అమ్మాయి పరిస్థితి ఇదనీ చెప్తాడు..విలన్ ప్రక్కన ఉన్నవాళ్ళంతా వీడితో ఏంటన్నా మాటలు, వీణ్ణి దాన్ని ఇద్దరినీ వేసేద్దాం అని అరుస్తూ గోల గోల చేస్తుంటే, విలన్ మాత్రం దీర్ఘాలోచన్లో పడి..”వదిలేయండ్రా వీళ్ళని..”అంటాడు. శివాజీ నడవలేని పరిస్థిలో ఉన్న హీరోయిన్ ని మోసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే సినిమా.

నాకు తెలిసి కొన్ని కథలు ఒక్క లైన్ లో చెప్పడానికి బానే ఉంటాయి కానీ సినిమా గా తీసేసరికి తేలిపోతాయి. అయితే కథ గా చెప్పినంత సింపుల్ గా సినిమా ఉండదు. చాలా అర్థం పర్థం లేని సీన్లు, తలాతోకా లేని సన్నివేశాలు మధ్యలో చాలా ఉంటాయి.మొన్నీ మధ్య శివాజీ అన్నాడు ఏదో ఇంటర్వ్యూ లో. నన్ను మొదటిసారిగా హీరో గా పరిచయం చేసిన విఘ్నేష్ అనే డైరెక్టర్ (బెజవాడ టాకీస్) ఇప్పుడెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలీదు. అతను గనక మళ్ళీ కనిపిస్తే ఖచ్చింతంగా అతనికి సినిమా ఇద్దామనుకుంటున్నాను అని. అది చదివాక ఈ సినిమా గుర్తొచ్చింది. అదీ సంగతి!


Responses

 1. బాగా గుర్తు చేసారు మోహన్ గారు. నేను ఈ సినిమాని పాలిటెక్నిక్ చదివే రోజుల్లో చూసా. ఆ రోజుల్లో ఈ సినిమా పోస్టరు చూసి వెళ్లాను. నాతోపాటు వచ్చిన వాళ్లకు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఇలాంటి సినిమాకు తీసుకోస్తావా అని ఏడిపించారు. ఒక విధంగా ‘ఎర్ర గులాబీలు’ కాన్సెప్ట్ కూడా ఉంటుంది.
  ఆరోజుల్లోనే ఎయిడ్స్ గురించి తీయటం అభినందనీయం.
  ఇంకో విషయం గుర్తుంది ఈ డైరెక్టర్ తనకు స్ఫూర్తినిచ్చిన డిరెక్టర్లు మణిరత్నం , రాంగోపాల్ వర్మ అని టైటిల్స్ లో వేసుకుంటారు .
  కొత్తదనం కోసం ట్రై చేసాడు . బాడ్లక్.

 2. ఈ సినిమా వచ్చినప్పుడు శివాజీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ దర్శకుడు హత్య చేసే దృశ్యాలు వివరించిన/తీసిన తీరుచూసి ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక హత్య చేశాడేమో అన్న సందేహం వచ్చిందని…హహహ నవ్వుకున్నా.

  ఈ సినిమా చూశాను నేను…మొత్తం
  హైదరాబాద్ మోడల్ “విద్య” ఈ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ తరువాత సెకండ్ హీరోయిన్గా లేక హీరోయిన్ స్నేహితురాలిగా మిగిలిపోయింది.

 3. ee cinema lo oka song baaguntundi…

 4. విఘ్నెష్ తరవాత “మధురం” అనే సినిమా తీసాడు, ఈ సినిమా ట్రైలెర్ విచిత్రంగా ఉంటుంది, బెజవాడ టాకీస్, వెనకాల కామెంట్స్ “పొట్టోడు మల్లి వచ్చాడురోయ్”, కుక్కల అరుపులు, ష్రద్దంజలి ఫ్లాప్ అయినా వీడికి సినిమాలు ఎందుకు రా అని వస్తుంది

  విఘ్నేష్ ఒక ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ సినిమా కూడా తీసాడు మధురం తర్వాత I am not sure about it

  • but ee cinema release avaledu..shooting start chesaru kaanee (oka italian ammayi ni heroine ga petti) ee cinema shooting pooti kaaledu..release kaaledu..but ee title naaku baaga nachindi


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: