నిన్నంతా అన్ని ఛానెల్స్ లో చిరంజీవి గురించి పీఆర్పీ గురించి ఈనాడు బ్యానర్ స్టోరీ “జెండా పీకేద్దాం” గురించీ చర్చ. సరే ఆ చర్చల్లో ఎవరేం చెప్పారు అనేది ప్రక్కన పెడదాం- ఇవాళ ప్రతి ఒక్కళ్ళకీ ఒక సెపెరేట్ ఎజెండా ఉంది. అది ఈనాడు కైనా, ఆంధ్రజ్యోతికైనా, టివి9 కి అయినా, టివి5 కి అయినా, సాక్షి టివి కి అయినా, మా టివి కి అయినా. ఆయా సందర్భాల్లో ఒక ఇన్సిడెంట్ వాళ్ళ వాళ్ళ ఎజెండాలకి ఎలా సూట్ అవుతుందనే దాని మీదే వాళ్ళు స్పందించే/ప్రతిస్పందించే విధానం ఉంటుంది. అయినా ఈ టపా లో నేను చర్చించదలుచుకుంది రాజకీయాల గురించి కాదు. సాక్షి టివి లో వచ్చిన ప్రోగ్రాం లో టాలెంట్ చూపించిన (బహుశా) క్రియేటివ్ టీం గురించి.
చిరంజీవి సినీ నటుడు కాబట్టి చిరంజీవి కి సంబంధించిన ఏ ప్రోగ్రాం కి అయినా ఆయన సినిమాల్లోని కొన్ని క్లిపింగులని జతచేసే సౌలభ్యం ఉంది. “జెండా పీకేద్దాం” ఆర్టికల్ గురించి సాక్షి యాంకర్ మాట్లాడుతూ “ఒక సంవత్సరం వయసు కూడా లేని చిరంజీవి పార్టీ ని పీకేద్దామని ప్రయత్నిస్తే చిరంజీవి ఎలా స్పందిస్తాడు” అని చెప్పి చిన్న వీడియో క్లిపింగ్ చూపించాడు -అది చూస్తే ఇంద్ర సినిమా లో బాగా పాపులర్ అయిన సీన్. ముఖేష్ రిష్ కొడుకు శవాన్ని పాతిపెట్టి అక్కడ మొక్క నాటిన తర్వాత ముఖేష్ రిషి ఆ మొక్క పీకేయబోతే చిరంజీవి చెప్పే డైలాగ్ – “మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా” . జెండా పీకేద్దాం అన్న కథకి చిరంజీవి స్పందన లాగా – పీఆర్పీ మొక్క లాంటిదే (ఒక సంవత్సరం వయసే కాబట్టి పీఆర్పీ మొక్క లాంటిదే) అయినా “మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా “అని చెప్పే డైలాగ్ ని దీనికి రిలేట్ చేయడం సాక్షి టీం వాళ్ళ క్రియేటివిటియే 🙂
LOL 🙂
తప్పు లేదు. చిరంజీవిని బంతిని చేసి ఆడుకుంటున్నారు.
ఆ విషయం చిరంజీవి గ్రహించక పోవడం బాదాకరం.
గ్రహించి ఏమి చెయ్యలేకపోవడం చిరంజీవి అసమర్దతే.
By: a2zdreams on 2009/08/21
at 6:47 సా.
good one
By: కొత్తపాళీ on 2009/08/21
at 11:46 సా.
chalabagundanna
By: Arike venkatasubbaiah on 2009/08/22
at 12:20 ఉద.
పొతె పోనీండి గాని, ఈనాడు దెబ్బకి చిరు లో చలనం వచ్చింది. రాజకీయాలు పూర్తిగా వేరే రూల్సున్న గేం అని తెలుసుకోవాలి.
By: sujata on 2009/08/22
at 12:24 సా.
ha! ha!ha!
By: aswinisri on 2009/08/23
at 9:51 సా.
@ babu enti asamardata chaala choostunnanu fan ala vundakoodadu..correct oka leader ela vundaalo ala behave chestunnadu…………
“naa mundu pedda lakshyam vundi anduke pattinchukovatam ledu ani”
aa videos choosi kooda nuvvu inka ala antuntae nenu em cheyalenu………….
Fan ga support cheste chey lekapote daya chesi ila coment cheyavaddu…………..
u disable the comments section so i am writing here………………
if u r interested in tdp u can go and support…please dont write such posts……
By: vinay chakravarthi on 2009/08/24
at 9:33 ఉద.