వ్రాసినది: mohanrazz | 2009/08/25

కన్నీటి కెరటాల వెన్నెల (నవల) – ఓల్గా

olga

1999-2000 .. ఆ టైం లో చదివా ఈ పుస్తకాన్ని. ఓల్గా పుస్తకాలేవీ దీనికి మునుపు నేను చదవలేదు. స్త్రీవాద రచయిత్రి కదా బహుశా ఇందులో నూ అలాంటి స్టఫ్ ఉంటుందని చాలా యథాలాపంగా మొదలెట్టానీ పుస్తకాన్ని.

 

మొదట్లో అలానే ఉంటుంది. పెళ్ళయిన మూణ్నెల్లకే ప్రేమించి మరీ పెళ్ళి చేసుకున్న భర్త చనిపోతే ఒక రకమైన డిప్రెషన్ లో కి వెళ్ళిపోతుంది హీరోయిన్. కొన్ని రోజులు అలా డిప్రెషన్ లోనే ఉండిపోయాక ఇక మైండ్ ని ఏదోలా డైవర్ట్ చేసుకోవాలనుకుంటే పేపర్ లో ఒక యాడ్ చూస్తుంది. పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో సినిమాలకి సంబంధించి ఆరువారాల ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ కి యాడ్ అది. సరే, అని అక్కడికెళ్ళి జాయినయిపోతుంది.

 

ఇక ఆమె రోజూ దినచర్య ఉదయాన్నే లేచి ఇన్స్టిట్యూట్ కి వెళ్ళడం, అక్కడ దాదాపు మూడు సినిమాల దాకా (అన్నీ ప్రపంచ ఉత్తమ సినిమాలే) చూడటం, వాటి గురించిన ఆసక్తికరమైన విశ్లేషణలు, చర్చలు. కేక. ఒకరకంగా ప్రపంచ ఉత్తమ సినిమాలన్నిటి మీద సమీక్ష లాంటిది ఈ నవల. అదీ ఒక తెలుగు ప్రేక్షకుడు/ప్రేక్షకురాలి పాయింట్ ఆఫ్ వ్యూలో.  రెండొందల పేజీలు కూడా లేని ఈ నవల లో దాదాపు 100 కి పైగా సినిమా ల గురించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. అవీ కాక కొన్ని డాక్యుమెంటరీలు, కొన్ని అత్యుత్తమ షార్ట్ ఫిలిం ల గురించిన డిటెయిల్స్. అఫ్ కోర్స్ ఈ సమీక్షల మధ్యలో కొద్దిపాటి కథ కూడా నడుస్తూంటుంది నవలలో 🙂 . పుణె ఇన్స్టిట్యూట్ లో బోధించే వాళ్ళ బోధనా శైలి లోని సున్నితమైన వైరుధ్యాలు లాంటివి కూడా ప్రస్తావిస్తుంది ఓల్గా. అతితక్కువ సమయం లో “ప్రపంచ సినిమా” కి ఎక్స్ పోజ్ అవడానికి తెలుగులో ఇంతకన్నా బెస్ట్ పుస్తకమైతే నాకు తెలిసినంత లో లేదు. సినీప్రియులకి నా తరపు నుండి స్ట్రాంగ్ రికమెండేషన్ ఈ పుస్తకం.

 

కొసమెరుపు: ఆ రోజుల్లో పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఇలాంటి ఆరు వారాల ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ ఏమైనా ఉందేమోనని చెక్ చేసా, జాయినవుదామని . అంత సీన్ లేదన్నారు 🙂 !

ప్రకటనలు

Responses

 1. మంచి పరిచయం. ధన్యవాదాలు.

 2. చాలా మంచి పుస్తక పరిచయం. నేను ఎప్పటికైనా ఆమె రాసినవన్నీ చూడాలని కూడా అనుకున్నా అప్పుడు. (చూడటం పూర్తి గా కుదరలేదు అనుకోండీ) ఒక వ్యాపకం, జీవితాన్ని ఇంకొక కోణం నుంచి చూడటం అనేవి మనిషి ని నిస్సత్తువ నుంచి బయటకు ఎలా తీసుకు వస్తాయి అనే దానిని మంచి చిత్రాల పరిచయం తో మేళవించి ఓల్గా గారు చాలా బాగా రాసేరు. మంచి ప్రయత్నం. ఇంకా వివరం గా “పుస్తకం.నెట్” లో సమీక్ష రాయ వచ్చు కదండి. ధన్య వాదాలు.

  • దాదాపు పదేళ్ళయిందా పుస్తకాన్ని చదివి. పుస్తకం.నెట్ లో వ్రాయాలంటే మళ్ళీ ఒక సారి చదవాలి 🙂 అయినా ప్రయత్నిస్తాను!

 3. FTII ఇప్పుడు షార్ట్ టర్మ్ కోర్సులు ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సులు. కాబట్టి ఇప్పుడు ప్రయత్నించండి.

 4. thank andi, naaku nachina book name cheppinanduku

  nenu ee book 18yrs back chathura novel ga veste chadiva
  kani name marchi poya only writer name & story matrame gurthu vundi,
  ippatiki naaku dhani name dorikindi

 5. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో 45 రోజుల ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సు ఉంది. నేను ఈ నవల చదివాను. నాకు నచ్చింది. ముఖ్యంగా సినిమాల ద్వారా (చర్చలద్వారా) పెరిగే వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు నన్ను బాగా ఆకట్టుకుంది.

 6. thanks andi


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: