వ్రాసినది: mohanrazz | 2009/08/26

CONFESSIONS OF A FILM MAKER..

 

COFM

చాలా మందికి తెలిసే ఉంటుందీ సినిమా. కొంతమంది చూసికూడా ఉండొచ్చు. నేనీ సినిమా చూడలేకపోయాను కానీ ఈ సినిమా కి సంబంధించి ఇంటర్నెట్ లో ఉన్న అన్ని ట్రైలర్ల యాడ్స్ చూసాను. కొన్ని చూసి అబ్బురపడితే కొన్ని చూసి దిమ్మతిరిగిపడ్డాను. అనీష్ కురువిల్ల ఈ సినిమా డైరెక్టర్. శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ గా చేసాడు, ఆనంద్ సినిమా లో రాజా కజిన్ రోల్ చేశాడు.

సినిమా టైటిల్ అనౌన్స్ చేసినపుడు అనుకున్నాను- confessions of film maker అంటే ఒక 100 సినిమాల దాకా తీసిన డైరెక్టర్/నిర్మాత ఆ తర్వాత తను తీసిన సినిమాల గురించో, లేక ఈ ఇండస్ట్రీ గురించో కన్‌ఫెస్ అవుతాడేమో అని. కానీ తర్వాత తెలిసింది..సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నించి, ఆ అవకాశం దొరక్క ఒక ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళినతని కథ అని. మరి ఒక్క సినిమా కూడా తీయని వ్యక్తిని ఫిల్మ్ మేకర్ అనొచ్చా ? ఇట్టాంటి మోసమే రాబిన్ శర్మ చేసాడు నాకు 🙂 The Monk who sold his ferrari అని చెప్పి. అసలు మాంక్ దగ్గర ఫెరారి ఎందుకుంది, వీడెవడో బాగా డిఫరెంట్ మాంక్ అయ్యుంటాడనుకుని ఆ పుస్తకం కొన్నానప్పట్లో. చదివిన తర్వాత తెలిసింది, ఫెరారి ఉన్న మాంక్ కాదు, ఓ డబ్బున్నాయన తన ఫెరారి ని కూడా అమ్మేసి ఆ తర్వాత మాంక్ అయ్యాడని . అయినా ఫుల్లు గా సంపాదించేసి ఫెరారి లో తిరిగి ఆ తర్వాత అవి వద్దు అనుకునే వాళ్ళ స్టోరీలు మనకెందుకు, ముందు మనం ఫెరారి కొని ఆ తర్వాత దాన్ని అమ్మాలో వద్దో ఆలోచిద్దాం అని రాబిన్ శర్మ పుస్తకాన్ని పక్కన పడేశా 🙂 . ఆ తర్వాత I bought that Monk’s ferrari’ 🙂 అని ఇంకో పుస్తకం దొరికింది. దీని గురించి పూర్తి రివ్యూ ఇంకోసారి వ్రాస్తాను.

            
అనీష్ మాత్రం confessions of a film maker సినిమాతో చాలా ప్రయోగాలు చేశాడు. ఇంగ్లీష్ సినిమాల్లో కొంచెం కామన్ గానే వినిపించే **** పదాన్ని తెలుగు లోకి అనువదించి మరీ లో తన సినిమాలో విరివిగా వాడాడు (యూట్యూబ్ లో నేను చూసిన వీడియో లోనే నాలుగైదుసార్లుంది). తెలుగులోని అగ్రహీరోలందరి మీదా విచ్చలవిడిగా సెటైర్లేశాడు. చిరంజీవి బ్లడ్ & ఐ బ్యాంక్ ముందు నిలబడి “Open your eyes for good cinema” అని ప్లకార్డులు ప్రదర్శించడం, వంశం గురించి మాట్లాడే హీరొలనుద్దేశ్యించి “మీ బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందా?? అయితే, మరి మీ ** లో ఏముంది” అని అడగడం ఇంకా ఆల్‌మోస్ట్ మిగిలిన అగ్రహీరోల మీద కూడా ఇలాగే. ఈ సినిమా సెన్సార్ అవడం, ఆ తర్వాత థియేటర్లో రిలీజ్ అవడమూ ఉండదని అనీష్ కి ముందే తెలుసు. పాత్రికేయులకి ఒక షో వేశాడు. రివ్యూలొచ్చాక సినిమాని ఓన్లీ ఇన్ ఇంటర్నెట్ ప్రదర్శనకి పెట్టాడు. తను పెట్టిన ఖర్చు తో పాటు కాస్తో కూస్తో లాభాలూ వచ్చాయి అని ఆతర్వాత చెప్పుకొచ్చాడు. సంప్రదాయ పద్దతుల్లో థియేటర్ లో రిలీజ్ చేయడం లాంటివేమీ లేకుండా, కేవలం ఇంటర్నెట్ లో ప్రదర్శించి కూడా ఒక సినిమా ని విజయవంతం చేయొచ్చు అని నిరూపించాడు.

 
చాలా మంది జీమ్యాట్ లాంటి ఎగ్జాం వ్రాసేవాళ్ళూ గట్రా తమ ప్రిపరేషన్ మొదలెట్టిన రోజు నుంచీ ఒక బ్లాగ్ వ్రాస్తూ వాళ్ళ ప్రొగ్రెస్ గట్రా అన్నీ నోట్ చేస్తూ ఉంటారు. ఆ బ్లాగ్ అలా ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ ప్రిపరేషన్ మొత్తం మనం అలాగే “ఫీలవుతాం”.  అయితే సినిమా షూటింగ్ మొదలెట్టే ముందు ఒక బ్లాగ్ మొదలెట్టి ఆ ప్రొగ్రెస్ మొత్తం ఏరోజుకారోజు అందులో నోట్ చేయడం ఇండియాలో మిగతా ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా చేశారో లేదో నాకు తెలీదు కానీ అనీష్ చేశాడు. Confessions of film maker బ్లాగ్ అప్పట్లో రోజూ ఫాలో అయ్యేవాణ్ణి. ఒక టైం లో అనీష్ తో పాటు మనమూ షూటింగ్ లో ఒకపార్ట్ అన్నట్టుగా అనిపించేది రెగ్యులర్ గా ఆ బ్లాగ్ చదువుతూంటే. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ బ్లాగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Responses

 1. @Zuran: ee cienma clips konni nenu kooda choosaanu……..kaani ee cinema director ni choosthey ela ani picchindhi ante athaniki kadupu noppi aithey nannu table vesukomannatu gaa anipicchindhi 🙂

  any way good post

 2. // ముందు మనం ఫెరారి కొని ఆ తర్వాత దాన్ని అమ్మాలో వద్దో ఆలోచిద్దాం అని రాబిన్ శర్మ పుస్తకాన్ని పక్కన పడేశా . 🙂

  మంచి టపా.

 3. Hmmm….Interesting

 4. నేను ఈ సినిమా చూశాను. అతని ఫ్రస్ట్రేషన్ చూసి నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కానీ వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే.

 5. ఆ బ్లాగు గురించి తెలియ జేసినందుకు చాలా థాంక్స్ .. నేనెప్పుడు అలా వ్రాస్తానో .. 🙂

  • నేనెప్పుడు అలా వ్రాస్తానో .. >>
   may be soon.. 🙂

 6. ఈ సినిమా గురించి విన్నాను, ఇహ చూస్తాను.

  కానీ మీరు మాంకూ-ఫెరారీ గురించి రాసింది భలే నచ్చింది. ఎందుకంటే ఆ పుస్తకం గురించి ఎవరి రివ్యూలు చదవకుండానే నా దగ్గరకొచ్చింది అది! సరేనని మొదలు పెడితే నాకూ మోసమే ననిపించింది. ఫెరారీ ఎప్పుడు కొంటానో తెలీదు కానీ ఫ్లైట్ జర్నీల్లో మొహానికడ్డంగా పెట్టుకుని చదువుతున్నట్లు నటించడానికి దర్జాగా ఉంటుందని పక్కన పెట్టి ఉంచా!

  • ఈ సినిమా గురించి విన్నాను, ఇహ చూస్తాను.>>
   కష్టమనుకుంటా 🙂 ఎందుకంటే, అనీష్ ఇప్పుడా సినిమాని తన సైట్ లో కూడా ప్రదర్శనకి పెట్టలేదు. డౌన్ లోడ్ చేయడానికి ఏ హోస్ట్ సర్వర్ లో నూ ఆ సినిమా లేదు. బహుశా యూట్యూబ్ లో ట్రైలర్లకి సంబంధించిన వీడియోస్ మాత్రం దొరుకుతాయి..

   >>ఫ్లైట్ జర్నీల్లో మొహానికడ్డంగా పెట్టుకుని చదువుతున్నట్లు నటించడానికి దర్జాగా ఉంటుందని పక్కన పెట్టి ఉంచా!>> 😀

 7. మన స్వామి వివేకానంద రాసిన వ్యక్తిత్వ వికాస గ్రంథాలు వదిలేసి పొలోమంటూ విదేశీ రచయితలు రాసిన పుస్తకాల మీద మూకుమ్మడిగా ఎందుకు పడిపోతుంటారో జనాలు? నాకు ఎప్పటికీ అర్థం కాదు.

 8. […] The Monk who sold his ferrari నాకు పెద్దగా నచ్చలేదని ఇంతకు ముందోసారి వ్రాసేను. అయితే WHO WILL CRY WHEN YOU DIE అని ఇంకో పుస్తకం […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: