వ్రాసినది: mohanrazz | 2009/08/27

మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ??

md

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేయబోతున్నాడు చరణ్. కాకపోతే ఒక ఇండస్ట్రీ హిట్ తర్వాత ఏ హీరో కైనా కొంత స్లంప్ తప్పదు. అల్లూరి సీతారామరాజు రిలీజ్ కి ముందు ఒక పెద్దాయన (చక్రపాణి గారనుకుంటా) కి సినిమా చూపిస్తే ఆయన కృష్ణ తో అన్నాట్ట- “నీతో ఇప్పుడు  సినిమాలు తీస్తున్న నిర్మాతలందరూ మునిగినట్టే” అని. అదేంటి సార్ అలా అన్నారు అని కృష్ణ అంటే- “అవునయ్యా, ఈ సినిమా చాలా గొప్పగా ఉంది. ఇలాంటి సినిమా లో నిన్ను చూసిన ప్రేక్షకులు ఇక మరో రెండేళ్ళ వరకూ మామూలు పాత్రల్లో చూడలేరు, అందుకే అలా అన్నాను” అన్నాట్ట. ఆయనన్నట్టే కృష్ణ సినిమాలు దాదాపు 14 దాకా ఫ్లాపయ్యాయి అల్లూరి సీతారామరాజు తర్వాత.

 

అల్లూరి సీతారామరాజు లాంటి చారిత్రక సినిమాలే కాదు, మామూలు సాంఘిక సినిమాల్లో కూడా ఇండస్ట్రీ హిట్ స్థాయి సినిమా ఇచ్చాక ఏ హీరోకైనా కొంతకాలం ఈ ఫ్లాపుల గొడవ తప్పదు. పోకిరి తర్వాత వచ్చిన సైనికుడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయితే ఆ తర్వాత వచ్చిన అతిథి యావరేజ్ అయింది. ఘరానా మొగుడు తర్వాత వచ్చిన మెకానిక్ అల్లుడు, ఎస్.పి.పరశురాం  ఘోరమైన ఫ్లాప్ లయితే ముఠా మేస్త్రి, ముగ్గురు మొనగాళ్ళు యావరేజ్. సింహాద్రి తర్వాత వచ్చిన అంధ్రావాలా అట్టర్ ఫ్లాప్ అయితే సమర సింహారెడ్డి తర్వాత వచ్చిన సుల్తాన్, కృష్ణబాబు ల పరిస్థితీ అంతే. ఈ పరిస్థితిని అంతకుముందు చాలా సార్లు ఎదుర్కోవడం వల్లే అనుకుంటా ఇంద్ర తర్వాత దీన్ని తప్పించుకోవడానికి చాలా ఆలోచించి మరీ ఠాగూర్ లాంటి రీమేక్ సబ్జెక్ట్ ఎన్నుకొని దాన్ని వివి వినాయక్ లాంటి దర్శకుడి చేతిలో పెట్టి చాలా జాగ్రత్తపడ్డాడు చిరంజీవి.

 

ఇప్పుడు మగధీర వసూళ్ళు కూడా అలాగే ఉన్నాయి. మా ఊళ్ళో ఒక మార్వాడీ ఉన్నాడు. ఆయనకి తెలుగు సినిమాలు పెద్దగా తెలీదు కానీ లాస్ట్ ఇయర్ నుంచి బయ్యర్ అయ్యాడు. ఏదైనా సినిమా తీసుకునేముందు కాల్ చేస్తుంటాడు. మనకి మాత్రం ఏం తెలుసు. ఆ మాటంటే “నాకసలేమీ తెలీదు కదా, మీ ఐడియా ఏంటి? తీసుకోవచ్చంటారా?” అంటాడు. మగధీర గురించి అడిగితే “నాకెందుకో హిట్ గ్యారంటీ అనిపిస్తోంది. ఒకవేళ ఓవరాల్ గా హిట్ కాకపోయినా రాజమౌళి-చరణ్ కాంబినేషన్ కాబట్టి మనలాంటి “బి” సెంటర్ లో రిటర్న్స్ రావచ్చనుకుంటా” అని చెప్పా. ఆ తర్వాత తనే కాల్ చేసి “మరీ ఎక్కువడగుతున్నారు సార్(11 లక్షలు), కష్టం లెండి, వదిలేశా ” అన్నాడు . నాకూ కరెక్టే అనిపించింది. పోకిరి లాంటి సినిమా టోటల్ రన్ లో కలెక్ట్ చేసినంత అమౌంట్ కంటే ఎక్కువ పెట్టి కొనడమంటే- జూదమే అనిపించింది. రిలీజ్ తర్వాత మూడ్రోజులకో నాలుగు రోజులకో కాల్ చేశాడు. ఎంతకాదనుకున్నా ఆయన గొంతులో బాధ తెలిసిపోతూనే ఉంది. “ఆల్రెడీ 9 లక్షలు కలెక్ట్ చేసిందంట సార్..టోటల్ రన్ లో 1:1 అంటున్నారు…11 లక్షలకి 11 లక్షలు ప్రాఫిట్ రావొచ్చంట…మిస్ అయిపోయాం” అన్నాడు. “అవునా, నేనూ సినిమా చూశాను, బానే ఉందిలెండి” అన్నాను. “నేనూ ఇప్పటికి మూడుసార్లు చూశాన్సార్ 🙂 ” అన్నాడు. ప్యూర్ గాంబ్లింగ్. అయితే ఈ సినిమా కి 20 లక్షలు పైగా వచ్చాయి కదా అని నెక్స్ట్ టైం అంతపెట్టి  కొంటారు… ఆ సినిమా అటూ ఇటూ అయిందంటే- షెడ్ కే. పోకిరి తర్వాత వచ్చిన సైనికుడు సినిమా చాలా దారుణంగా ఉంటుంది. ఇలాంటి సంఘటనలు పక్కన పెడితే కొన్ని సార్లు సినిమా యావరేజ్ గా ఉన్నా కూడా ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత రావడం అనే ఒకే కారణం వల్ల ఫ్లాప్ అవుతూంటాయి. ఆ లెక్కన ఇప్పుడు భాస్కర్ మీద చాలా ఒత్తిడి ఉన్నట్టు. అయితే భాస్కర్ సినిమా- ఫ్యాన్స్ కి నచ్చకపోయినా, ఫస్ట్ వీక్ ఫ్లాప్ టాక్ వచ్చినా ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ని నిరాశపరచకుండా స్లో గా పికప్ అయ్యే అవకాశాలుండవచ్చని (పరుగు లాగా) ఇంకొక డౌట్.(ఇంకా మొదలే అవ్వని సినిమా గురించి ఇన్ని మాటలెందుకు అంటారా..అయితే వాకే!)

 

ఏదేమైనా ఈ సవాల్ ని అధిగమించడం బొమ్మరిల్లు భాస్కర్ కి మగధీర కత్తిమీద సామే!


Responses

 1. బాగుంది మీ విశ్లేషణ .
  ఇంకొక ఉదాహరణ : పవన్ కళ్యాణ్ ఖుషి తర్వాత , భారీ అంచనాల వలనే జానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

 2. వినాయక్ కి ఇచ్చి వుంటే ఓపినింగ్స్ అన్నా వచ్చేవి. బొమ్మరిల్లు భాస్కర్ అంటే పెద్ద హిరోతో మాస్ కు ఎక్కదు. ఆవేశపడి ఎక్కువ పెట్టి కొంటే పెద్ద బొక్కే. జూదగాళ్ళకు బొక్క అని తెలిసినా బొక్కలు పెట్టించుకోవడం ఇష్టం కాబట్టి వాళ్ళ గురుంచి పట్టించు కొనవసరం లేదు.

  But we can expect decent movie from this combo.

 3. manchi ga aalochinchi……….vaallu steps vestunnaru…a2z cheppinatlu gaa tanu vinayak daano chesivunte tanaki oka image vachhesi ….andulon irukku poyevaadu….ippudu ntr and prabhas paristiti enti..vallu love storys cheyaleru chesina choodaru vallu alanti cinimaalu chesi janaallo vallu ilantive cheya galaru ani oka stamp vesaaru.

  alanti image techhukokunda allu arjun ela manage chesukuntunnado choosukondi………andarilaga tanaki em attaer flops kaavu……minimum gurantee fellow…alanti image kosam tanu try chestunnademo.

  na point of view lo manchi aalochna………..

  asalu chiranjeevi valla family enta creful ga vella career p[lan chestunnado choostunte vammo anipistundi

  • వినయ్ గారు నేను మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. మగధీర లాంటి మాస్ సినిమా తరువాత ఒక డీసెంట్ క్లాస్ సినిమా రావాలి చరణ్ కి అప్పుడే భవిష్యత్తు లో వైవిధ్యమైన పాత్రలని చేసే అవకాశం ఉంటుంది, మంచి నటుడికి కావలనుకునే వాడికి అదే ముఖ్యం కూడా. మంచి విశ్లేషణ ఇచ్చారు మీరు.

  • I Agree with you man..

 4. What Vinay said is 100% true and producer should be clear of the fact that it may not generate as much revenues as Magadeera ( I mean probablity) and sell it for reasonable rates for which film budget also should not be very high.

  • ఎక్కువ పెట్టి కొనకూడదు అనాలి కాని అమ్మకూడదు అనటం ఏమి లాజిక్?

   • I mean here I am trying to tell that if budget is made huge considereing Magadheera, then obviously they will sell it for more like what is told here by the post author (point where he tells it is sold for 11 lakhs) and distributors may also think of previous record set by Magadheera and will be ready to buy, if not one other will buy for sure, anyways I dont know much about the film business.

 5. బాబు వెంకట రమణ
  పైన చదివిన అర్త్కిల్ కిక్ మొత్తం దించ్ శావ్ కదా ని ఒక్క జాని కామెంట్ తొ…..

  Oh My God, Kushi valla Johney flop ayyinda ….
  I cant stop laughing … this is truly heights of durabhimanam … Sorry I dont mean to hurt any one’s feelings ….

  • @శ్రీ: అది నా సొంత అభిప్రాయం. మీరు దానితో విభేదించొచ్చు. పర్వాలేదు.
   అయినా వేరే వాళ్ళ అభిప్రాయాల వలన టపా మీద ఆసక్తి పోతుందని అనుకోను. దురభిమానమా? నా గురించి పూర్తిగా తెలిసినట్లు మాట్లాడుతున్నారుగా.
   నేను అన్న వ్యాఖ్యను మరొక్కసారి చదవండి. అవును ఖుషి తర్వాత విపరీతమైన అంచనాల వలనే అంత ఫ్లాప్ అయ్యింది. లేకపోతే కొంచం అయినా ఆడేది కదా? పవన్ కల్యాణ్ సినిమాలన్నింటిలోకి , జానీ బాగా నచ్చిన వారున్నారు. దానికేమంటారు ?

 6. చిరంజీవి కి అంతగా స్టార్ డం లేనప్పుడు , స్టార్ డం వచ్చిన కొత్తలొ చాలా మంచి సినిమాలు చేసాడు. విజెత, స్వయంక్రుషి , పున్నమినాగు, శుభలేఖ , మంచుపల్లకి, అభిలాష, చంటబ్బయ్, రుద్రవీణ, అపద్బాందవుడు , ఎట్సెటరా .. ఆ తరువాత మాస్, ఒపెనింగ్స్, 100 డేస్ సెంటర్స్, రెకార్డ్ లు అని మొదలుపెట్టి సుపర్ హిట్ అవ్వాల్సిన స్టాలిన్ లాంటి కథలొ మాస్ ఎలిమంట్స్ బలవంతంగా చొప్పించి ఫ్లాప్ చేసారు.

  చరణ్ రెండొ సినిమా కే బొమ్మరిల్లు భాస్కర్ అంటె పెదవి విరుస్తున్నరంటే .. చరణ్ ఫ్యుచర్ లొ బాలయ్య లా బాక్సాఫిస్ బొనాంజా అవుతాడెమో కానీ చిరు లా గొప్ప నటుడు మాత్రం కాలేడు.

 7. మీ కామెంట్లు కింద నుండి పైకి చదవాల్సిరావటం చిరాగ్గా ఉంది సారూ. అలవాటుగా పైనుండి కిందకి చదివేసే వాళ్లు కనెక్టివిటీ అర్ధం కాక కన్‌ఫ్యూజైపోతున్నారు.

  • గతం లో చదువరి గారు కూడా చెప్పారు..మారుద్దామనుకుని మర్చిపోయా..మొతానికి మార్చేసానండీ..థాంక్యూ..

 8. హ్మ్హ్మ్

 9. Interesting!!!!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: