వ్రాసినది: mohanrazz | 2009/08/27

వెన్స్ డే కి ఈనాడు కి ఏమైనా మార్పులుంటాయా?

eenadu

వెన్స్ డే చూసినప్పుడు “బాగానే ఉంది సినిమా” అనుకున్నాను కానీ మరీ ఎక్స్‌ట్రార్డినరీ అని అనుకోలేదు. మల్టిప్లెక్స్ హిట్ అని అనిపించింది నాకు. అయితే దీన్ని తెలుగు/తమిళ్ లో కి ఇంత భారీ స్థాయి లో రీమేక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు.

ఆ మధ్య కమల్ మర్మ యోగి అని ఒక సినిమా మొదలెట్టాడు. దీనిలో ఒక ప్రత్యేక పాత్రని వెంకటేష్ చేస్తున్నాడనీ చెప్పాడు. అయితే ఈలోగా మర్మయోగి అటకెక్కడం తో కమల్ వెన్స్ డే రీమేక్ మీద దృష్టి సారించాడు. సో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో  చేయాల్సి వచ్చిందనుకుంటా వెంకటేష్ ఈ సినిమాని. ఎందుకంటే వెన్స్ డే లో నసీరుద్దీన్ షా చేసిన పాత్రని కమల్ చేస్తున్నాడు కాబట్టి అనుపం ఖేర్ రోలే వెంకటేష్ కి మిగిలింది. అదీ కాదంటే జిమ్మీ షెర్గిల్ చేసిన రోల్ ఒకటుంది. ఇప్పటిదాకా చేస్తున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే వెంకటేష్ చేస్తున్న రోల్ అయితే అనుపం ఖేర్ దే అనిపిస్తోంది. కానీ ఏ ప్రకాష్ రాజ్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టో చేయాల్సిన ఆ రోల్ లో వెంకటేష్ ని ఇప్పటికీ ఊహించలేకపోతున్నాను. సినిమా మొత్తం ఫోన్ లో మాట్లాడుతూ ఉండే ఆ రోల్ ని తెలుగు ప్రేక్షకులకోసమైనా చాలా మార్చాలి.

 

నేను ముందు ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు – తమిళ్ లో కమల్ చేసిన నసీరుద్దీన్ షా  రోల్ ని తెలుగు లో వెంకటేష్, తమిళ్ లో వెంకటేష్ చేసే అనుపం ఖేర్ రోల్ ని తెలుగు లో కమల్ చేసే లాగా (అప్పుడది ప్రేక్షకులని దృష్టి లో పెట్టుకుని తీసిన నిజమైన ద్విభాషా చిత్రం అవుతుంది) ప్లాన్ చేస్తారేమో అనుకున్నా. అయితే వెంకటేష్ ని పోలీస్ డ్రస్ లో ఉంచి విడుదల చేసిన స్టిల్స్ చూసాక మేకర్స్ అంత రిస్క్ తీసుకోలేదని అర్థమైంది. లేదా అనుపం ఖేర్ రోల్ ని జిమ్మీ షెర్గిల్ రోల్ ని మెర్జ్ చేసేలా వెంకటేష్ రోల్ ని డిజైన్ చేసినా ఆ పాత్రలో కొంత డైనమిజం వస్తుందనిపిస్తోంది. అసలిదంతా ఎందుకు ఉన్నది ఉన్నట్టుగా తీస్తే పోలా అంటే అనుపం ఖేర్ చేసిన పాత్రని యథాతథంగా వెంకటేష్ చేస్తే అది మిస్ కాస్టింగ్ అవుతుందేమోనని ఇంకొక ఫీలింగ్.

 

చూద్దాం. షో, మిస్సమ్మ లాంటి సినిమాలకి ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే సమకూర్చిన దర్శకుడు నీలకంఠ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నాడు. మరి ఆల్రెడీ వెన్స్ డే చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఈసినిమా ని అదే స్థాయిలో (లేదా అంతకంటె ఎక్కువ స్థాయి లో) ఆస్వాదించేలా ఏదైనా మార్పులు చేసాడో లేదో వేచి చూడాలి. ఇక సాగరసంగమం సినిమా లో కమల్ ఫోటో లు తీసే కుర్రడిగా నటించిన చక్రి కి ఇది మొదటి సినిమా డైరెక్టర్ గా. సంగీత దర్శకత్వం శృతిహాసన్ అట. బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెన్స్ ఉన్న ఈ సినిమాని తనెంత వరకు లాక్కొస్తుందో చూడాలి !


Responses

 1. నాకూ Wednes Day సినిమా అంత నచ్చలేదు. అపరిచితుడు type of story లా వుంది (అపరిచితుడు సినిమా నాకు అస్సలు నచ్చలేదు, అది వేరే విషయం). అసలు ఆ సినిమా ని కమల్ డబ్ చేస్తున్నాడు అని విన్నప్పుడే చాలా ఆశ్చర్యపోయాను. అంత పెద్ద conceప్త్ ఏమీ ఉన్నట్టు అనిపించలేదు ఆ సినిమా లో నాకు. వెంకటేష్ నటిస్తున్నాడు అని తెలిసినప్పుదు ఖచ్చితంగా జిమ్మీ షెర్గిల్ పాత్ర అనే అనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పినది చూస్తూవుంటే అనుపమ్ ఖేర్ పాత్రే చేస్తున్నాడులాగుంది. అదే నిజమయితే ఖచ్చితంగా ఆ పాత్ర కి వెంకటేష్ సరిపోడు. మీరు అన్నట్టు ఏ ప్రకాష్ రాజో, లేదా కనీసం ఏ రాజశేఖరో సరిపొతారు. నీలకంఠ స్క్రీన్ ప్లే నా? అయితే ఖచ్చితం గా చూడవలసినదే !!!

  • అసలు ఆ సినిమా ని కమల్ >>ఆవును..చాలా మంది ఇలానే అనుకున్నారు..కమల్ హాసన్ రీమేక్ చేయాల్సినంత సినిమా కాదు అని. కానీ ఇదేమో ఇప్పుడు తమిళ్, తెలుగు, మళయాళం (ఇందులో మోహన్ లాల్ చేస్తున్నాడు) లొ భారీగా తీస్తున్నారు..we have to wait and see 🙂

   • నేను ఈ సినిమా గురించి మొట్టమొదటిసారి విన్నప్పుడు, కమల్, మోహన్ లాల్ పేర్లు విన్నాను. అనుపమ్ ఖేర్ పాత్ర కి మోహన్ లాల్ సరిగ్గా సరిపోతాడు అనిపించింది. అందుకని, వెంకటేష్ పేరు విన్నప్పుడు, ఖచ్చితంగా జిమ్మీ షెర్గిల్ పాత్ర కే అనుకున్నాను.
    కానీ ఇప్పుడు, అసలు ఎవరెవరు ఏ పాత్రలలో నటిస్తారో వెండితెర పై చూడాల్సిందే !!!

    • ఎవరెవరు ఏ పాత్రలలో నటిస్తారో వెండితెర పై చూడాల్సిందే>>
     తెలుగులో వెంకటేష్ చేసే రోల్ మళయాళం లో మోహన్ లాల్.. !!!

     • అవునా…అయితే నేను ముందు మళయాళం సినిమా చూసి, తరువాత తెలుగు సినిమా చూస్తా..హి హి !!!

      • http://en.wikipedia.org/wiki/Unnaipol_Oruvan

       ఇక్కడ చూస్తే జిమ్మీ షెర్గిల్ రోల్ ఎవరో భరత్ రెడ్డి అనే అతను చేసినట్టు కనిపిస్తోంది 🙂 hmm..

       • ఉన్నైపోల్ ఒరువన్ అంటే ‘నీలాగే ఒకడు’ అని అర్థం. బహుసా మన తెలుగు సినిమా కి అదే టైటిల్ ఏమో !!!
        భరత్ రెడ్డా… అందుకే అన్నాను వెండితెర పై చూడాల్సిందే అని.

 2. సినిమా చివర్లో కథ మలుపు తిరిగే వెన్స్ డే లాంటి సినిమాలు ఒకసారి చూస్తే చాలు! ఇలాంటి సినిమాలు రీ మేక్ చేస్తే వర్కౌట్ అవుంతుందా అని!

  నీల కంఠ స్క్రీన్ ప్లే మీద ఆసక్తితో చూడాలి.

  • ఇలాంటి సినిమాలు రీ మేక్ చేస్తే వర్కౌట్ అవుంతుందా >>

   మూడు భాషల్లోనూ తీస్తున్నారు…కాస్టింగ్/రెమ్యూనరేషన్ తప్పిస్తే మిగిలిందంతా మినిమం బడ్జెట్..ఓపెనింగ్స్ తోనే ప్రాఫిట్ వెంచర్ అవొచ్చు..కానీ సినిమా జనాలకి నచ్చేలా ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి..

 3. హిందీ లో ఈ సినిమా చూడలేదు . తెలుగు లో ‘ఈనాడు’ చూడాలని నాకు కూడా ఆసక్తి గా ఉంది.
  చూద్దాం ఎలా ఉంటుందో !

  • original చూడకుండా రివ్యూలు/స్టోరీ తెలీకుండా normal expectations తో వెళితే డిజప్పాయింట్ అయితే అవరు..

 4. అవునా…అయితే నేను ముందు మళయాళం సినిమా చూసి, తరువాత తెలుగు సినిమా చూస్తా..హి హి !!!

 5. వెంకటెశ్ కంటె ప్రకాశ్ రాజ్ బాగుంటాడు అనుపమ్ ఖెర్ పాత్ర కు. కానీ వెంకటెశ్ లాంటి star అ పాత్ర వెస్తె మాస్ బాగా చూస్తారు. హిట్ అయితె మరి కొన్ని మంచి multi star cinemaalu వస్తాయి.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: