వ్రాసినది: mohanrazz | 2009/08/27

I am gonna be next Maniratnam..

                   

హెడ్డింగ్ చూసి టెన్షన్ అవకండి. నేనిప్పుడు అర్జంటు గా సినిమాలు తీసి డైరెక్టు గా మణిరత్నం ని ఢీకొంటానేమోనని కంగారు పడకండి 😀 . ఆ హెడ్డింగ్ నాది కాదు. హరి యేలేటి ది . అంకిత్, పల్లవి & ఫ్రెండ్స్ సినిమా దర్శకుడు ఈయన.

అంకిత్, పల్లవి &ఫ్రెండ్స్ సినిమా తీయడానికి ఒక రెండు మూడేళ్ళ క్రితం అనుకుంటా idle brain సైట్ లో ఒక ఆర్టికల్ వ్రాసాడీయన i am gonna be next maniratnam అని. ఆ హెడ్డింగ్ చూసి అబ్బో అనుకుని చదివాను. కానీ చదివాక చాలా బాగా వ్రాసాడనిపించింది. ఆ తర్వాత అదే సైట్ లో ఒక సిరీస్ లాగా కొన్ని ఆర్టికల్స్ వ్రాసాడు. ఆ ఆర్టికల్స్ చదివాక అర్థమయిందేంటంటే ఓ పదేళ్ళు US లో పనిచేసాక, ఫిల్మ్ స్కూల్స్ లో నేర్చుకోవాల్సినవి నేర్చుకున్నాక జాబ్ రిజైన్ చేసి టాలీవుడ్ కి సారీ హైదరాబాద్ కి వచ్చేశాడు అని. చూస్తే మరో శేఖర్ కమ్ములనో లేక మరో నగేష్ కుకునూరో ఇన్ ద మేకింగ్ అనిపించింది. కొన్ని ప్రయత్నాల తర్వాత పూరీ జగన్నాధ్ తాను తీయదలచిన ఇంగ్లీష్ సినిమాకి డైలాగులు వ్రాయడానికి ఈయనకి అవకాశం ఇచ్చినట్టు, అయితే ఆ ఇంగ్లీష్ సినిమా క్యాన్సిల్ అయినట్టు, నాగార్జున కి కూడా కథ చెప్పినా అది ఆయనకి నచ్చలేదనట్టు చెప్పుకొచ్చాడు. ఇలా ఆర్టికల్స్ వ్రాస్తూనే ఉన్నాడు..ఈలోగా ఒక NRI బిజినెస్ మేన్ ఈయన ఆర్టికల్స్ చదివి, ఈయనకి అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాయే అంకిత్, పల్లవి & ఫ్రెండ్స్.

అయితే ఈయన తనని తాను డైరెక్టర్ గా మెటమార్ఫసైజ్ చేసుకునే క్రమాన్ని నోట్ చేయడానికన్నట్టు వ్రాసిన ఆర్టికల్సన్నీ ఆసక్తికరంగా చదివిన నాకు ఆ టైటిల్ వినగానే సగం నీరసం అనిపించింది. ఎందుకో ఒక కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమా అంటే ఆ టైటిల్ కొంత పోయెటిక్ గానో (గులాబి, వెన్నెల) లేదంటే విన్నూత్నంగానో (ఐతే) ఆరెండూ కాకపోతే ఈజీగా నోరుతిరిగేలా సరళంగానో (ఆనంద్) ఉండాలనేది నాకో ఫీలింగ్. అంకిత్, పల్లవి & ఫ్రెండ్స్ ఈ మూడింటిలో ఏరకంగానూ లేదనిపించింది. ఇంకో విషయమేంటంటే ఈ సినిమా టైటిల్ ని కూడా జనాల్నే సజెస్ట్ చేయమంటే, వచ్చిన 3000 ఎంట్రీల్లోంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసారు. అయితే ఒక సినిమాకి కథకి సూట్ అవ్వాలంటే ఎలాంటి టైటిల్ ఉండాలి, లేదా టార్గెట్ ఆడియన్స్ ని కరెక్ట్ గా సెట్ చేయాలంటే ఎలాంటి టైటిల్ ఉండాలి అనేదానిమీద సినిమా దర్శకుడి కి ఉన్నంత అవగాహన టైటిల్ సజెస్ట్ చేసే ఆడియన్స్ కి ఉంటుందని నేననుకోను.  అయితే ప్రతీ దానికీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి సినీరంగం లో. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వచ్చని ఊహించా. ఈ సినిమా నేను చూడలేకపోయాను. కానీ రిలీజ్ కి ముందు రోజూ ఈసినిమా గురించి నేను మాట్లాడినవి విని ఇన్స్పైర్ అయి మా ఫ్రెండ్ హైదరాబాద్ వెళ్ళినపుడు అదే పనిగా వెళ్ళి ఈసినిమా చూసొచ్చాడు, వచ్చాక “అంత లేదబ్బాయ్” అన్నాడు.(review)

మన సినిమాల్లో కొన్నిరకాల సీన్లుంటాయి. నాకు తెలిసిన ఒకరిద్దరు అసిస్టెంట్ దర్శకులు పదో తరగతి, పన్నెండో తరగతి దాకా చదువుకున్న వాళ్ళని చూశాను. ప్రపంచం మీద వాళ్ళకున్న అవగాహన అంతా వాళ్ళు చూసిన సినిమాలనుంచి వచ్చిందే. ఒక్కో సారి ఇలాంటి వాళ్ళు తెలీక వ్రాసుకునే కొన్ని పొరపాటు సీన్లు మరీ సెన్స్ లెస్ గా అనిపిస్తాయి. కాబట్టి ఇలా మంచి ఎడుకేటెడ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దర్శకులు సక్సెస్ అయితే అప్పుడైనా అలాంటి సీన్లని చూసే బాధ మనకి కొంచెం తప్పుతుంది. కానీ ఫైనల్ గా ఇంకొక మాట ఏంటంటే- చదువుకీ క్రియేటివిటీ కీ సంబంధం లేదు !


Responses

  1. హహహ

  2. 🙂


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: