వ్రాసినది: mohanrazz | 2009/08/28

చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు..

puri

ఒకానొక సమయం లో తెలుగు సినిమాల్లో హీరోకి బాగా “బలమైన” మాస్ పేరు పెట్టాలంటే ఏ అశ్వత్థామ అనో పార్థు అనో లేదంటే యశ్వంత్ అనో పెట్టే వాళ్ళు. అట్టాంటి బలమైన పేర్లలో కాకుండా మనింటి పక్కన కుర్రాళ్ళని పిలిచే  చంటిగాడు, పండుగాడు, బుజ్జిగాడు లాంటి సింపుల్ పేర్లతో హీరో క్యారెక్టర్ కి విపరీతమైన మాస్ అప్పీల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ పూరీ జగన్నాధ్. పేర్లే కాదు, హీరో లకి ఒక చిత్రమైన నిర్లక్ష్యపూరిత ఎనెర్జెటిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయటం లో కూడా పూరీ ఒక ట్రెండ్ సృష్టించాడు.

రవితేజ కి ఇడియట్ సినిమా లోని చంటిగాడు క్యారెక్టర్ తో ఎంత పవర్ ఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసాడంటే, ఎప్పుడైనా రవితేజ ఆ ఇమేజ్ ని బ్రేక్ చేసి “ఈ అబ్బాయి చాలా మంచోడు” అనిపించుకోడానికి ప్రయత్నించినా, “నా ఆటోగ్రాఫ్ లో స్వీట్ మెమొరీస్” చూద్దురు రండని స్వీట్ గా పిలిచినా జనాలు రవితేజ కి “షాక్” ఇచ్చారు 🙂 . బహుశా చంటిగాడు తరహా పాత్రలు తప్ప రవితేజ వేరే ఏం చేసినా జనాలకి “కిక్” ఎక్కలేదు. అయితే ఇడియట్ సినిమా వచ్చి ఏడేళ్లైనా క్యారెక్టరిజేషన్ ని మార్చకుండా జనాలకి బోర్ కొట్టకుండా రవితేజ రంజింపజేస్తున్నాడంటే అది సామాన్యమైన విషయం కాదు.     

ఇంక మహేష్ బాబు సంగతి- అష్టాచెమ్మ సినిమాలో ఒక డైలాగులో అన్నట్టు “అతిథి” వచ్చినా పోకిరి పోలేదు 🙂 . ఆ పండుగాడు ఇమేజ్ ని -రవితేజ చంటిగాడు ని కంటిన్యూ చేసినట్టు కంటిన్యూ చేయాలా – లేక పూర్తిగా బ్రేక్ చేసి ఇంకో ఇమేజ్ నిచ్చే కథ తో ముందుకు రావాలో అర్థం కాకపోవడం వల్ల(బహుశా) 2008 లోనూ, 2009 లోనూ మహేష్ బాబు కి సినిమా లేకుండా పోయింది. జనాల్లో మాత్రం ఇప్పటికీ ఆ పోకిరి ఇమేజ్ అలాగే ఉంది.

ఈ మధ్య వచ్చిన బుజ్జిగాడు లో కూడా ప్రభాస్ క్యారెక్టరైజేషన్ వరకూ కేక. అంతకు ముందు ప్రభాస్ చూడటానికి బాగా మ్యాన్లీ గా ఉంటాడు కానీ నోరు తెరిచి డైలాగులు చెప్తే ఆ ఇమేజ్ మొత్తం పోతుంది అనేవాళ్ళు కొంతమంది. ఒకాయన ఛత్రపతి రివ్యూలో కూడా ఈ సినిమా లో ప్రభాస్ కి తక్కువ డైలాగులివ్వడం లో నే రాజమౌళి సక్సెస్ సీక్రెట్ దాగిఉందని వ్రాశాడు. అలాంటి ప్రభాస్ ని తీసుకొచ్చి గలగలా మాట్లాడే రోల్ ఇచ్చి ఒక బలమైన ఇంప్రెషన్ క్రియేట్ చేయడం పూరీ కే చెల్లింది. బుజ్జిగాడు సినిమాలో కూడా స్క్రీన్ మీద ప్రభాస్ ఉన్న సీన్లన్నీ ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి కానీ ప్రభాస్ స్క్రీన్ మీద లేకుండా ఒక అరగంట పైనే సినిమా ఉంటుంది ఆ పార్టే జనాలకి బోర్ కొట్టింది అనే వాళ్ళూ ఉన్నారు. ప్రభాస్ వోల్వో బస్ లో సంజన ని ఉద్దేశ్యించి-“బాగా డిప్రెషన్ మెయింటెయిన్ చేస్తున్నట్టున్నారు..” 🙂 అనే ఒక్క డైలాగు చాలు ఈ సినిమా లో ప్రభాస్ క్యారెక్టర్ ని వివరించడానికి. ఈ బుజ్జిగాడు పాత్ర ఎంతబాగా సక్సెస్ అయిందంటే (సినిమా అంత సక్సెస్ కాకపోయినా కూడా) దీనితర్వాత వచ్చిన “బిల్లా” లో కూడా సెకండ్ రోల్ కి సేం టు సేం బుజ్జిగాడి మేనరిజమ్సే వాడారు.

మొత్తానికి పూరీ క్యారెక్టరైజేషన్స్ కి మాత్రం మాస్ లో మాంఛి క్రేజ్ వచ్చేసింది.


Responses

 1. // ఎప్పుడైనా రవితేజ ఆ ఇమేజ్ ని బ్రేక్ చేసి “ఈ అబ్బాయి చాలా మంచోడు” అనిపించుకోడానికి ప్రయత్నించినా, “నా ఆటోగ్రాఫ్ లో స్వీట్ మెమొరీస్” చూద్దురు రండని స్వీట్ గా పిలిచినా జనాలు రవితేజ కి “షాక్” ఇచ్చారు

  🙂 🙂

 2. హ హ బాగా చెప్పారు…బాగా గమనించారు.
  మహేష్ బాబు కి ఆ పోకిరి ఇమేజ్ నిలుపుకోవడం కష్టమే అవ్వొచ్చు….బహుశా తను అదే తరహా పాత్ర ని రిపీట్ చేస్తే మూసతరహా లో ఉంటుంది. అంత వైవిధ్యం చూపించలేకపోవచ్చు. రవితేజ లా గా ఒకే తరహా పాత్ర ని కొన్నేళ్ళు చెయ్యడం మహేష్ బాబు కి కత్తి మీద సాము అవుతుంది అని నా అభిప్రాయం. ఇంక ప్రభాస్ విషయానికి వస్తే బుజ్జిగాడు, బిల్లా లో రెండవ పాత్ర ఒకే తరహా వి అయినా వైవిధ్యం చూపించాడు. రవితేజ అడుగుజాడలలో నడిచే అవకాశం, ప్రతిభ అయితే వున్నాయి ప్రభాస్ కి, కష్టపడితే సాధించగలడు. మరీ రవితేజ లా గ అలవోకగా చెయ్యడం అందరికి సాధ్యమయ్యేపని కాదు కదా !!!

  ఏమైనా పూరి, రవితేజ కి ఆ ఇమేజ్ ఇచ్చి మంచే చేసాడు !!!

  • పూరి, రవితేజ కి ఆ ఇమేజ్ ఇచ్చి మంచే చేసాడు >> మంచే చేసాడు ఏంటండీ.. అసలు లైఫ్ ఇచ్చాడు..లేకపోతే ప్రేమకి వేళాయెరా లో జెడి ప్రక్కన, మనసిచ్చి చూడు లో నవ్వీన్ ప్రక్కన చేసిన రోల్స్ లాంటివే లైఫ్ లాంగ్ చేసుకుంటూ మధ్య మధ్య లో “చిరంజీవులు” లాంటి చిన్న సినిమాల్లో హీరో గా చేసుకుంటూ ఉండాల్సొచ్చేది. ఇవాళ టాలీవుడ్ కి చంటిగాడు లోకల్ అయిపోయాడు అంటే పూరీ చలవే!

   • నిజమే…రవితేజ కి లైఫ్ వచ్చింది ఆ సినిమాతో !!!

 3. ఈ మధ్య హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కల్చరల్ స్టడీస్ విభాగంలో ఒక విద్యార్థి రవితేజ గురించి ఒక పరిశోధనా వ్యాసం రాసాడు.

  అందులోని ముఖ్య విషయం, ఐతే హైద్రాబాద్- లేకపోతే గ్రామీణ ఫ్యాక్షన్ హీరోల “representation” గా తయారవుతున్న తెలుగు సినిమాల్లో చిన్నపట్టణాల యువత (small town youth) aspirations ను తెరమీదకి తీసుకువచ్చిన హీరో రవితేజ.

  “Urban sofisctication” లేకపోవడం. “నేను ఎర్రబస్సుగాడ్నే అయితే ఎంటి?” అనే యాటిట్యూడ్. వంటి neo- urban భావజాలం రవితేజ పాత్రల్లో కనిపిస్తుంది. అనేది ఈ పరిశోధన సారాంశం. నిజమేనేమో!

  చాలా ఆసక్తికరంగా సాగిన ఈ వ్యాసాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాను.

  • నిజమే, మిడిల్ టౌన్ “లోకల్” యూత్ కి ఇప్పుడు- “వీడే! (మా అండ మా ఆశ)” అయిపోయాడు రవితేజ ! 🙂

   ఆ వ్యాసం దొరికితే షేర్ చేయండి.. !

   • ఒహ్ మా యూనువర్సిటీ విద్యార్థా, అయితే బ్రహ్మాండం గా రాసుంటాడు, సందేహం లేదు…హి హి.
    అతని పేరు, వ్యాసం పేరు చెప్తే, నేను సంపాదించడానికి ప్రయత్నిస్తాను.

    అవును రవితేజ సినిమా చూస్తే మాఊరు లో ఉన్నట్టుంటుంది…ఇలా అనుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు.
    ‘హేయ్ యో యో మేన్’ అనే డైలాగ్సు లెకపోతే ‘మా పేట కి రండి, మా ఊరికి రండి, కాలు ఇరగదీస్తా, తొడకొట్టి జడిపిస్తా’ లాంటీ డైలాగ్సు విని విసిగిపోయిన వాళ్ళకి అవును ‘మాది యెర్రబస్సే అనే డైలాగు’ ఎంత‌ ఇంపుగా ఉంటుందో చెవులకి కదా !!!

    • ఈ మధ్య కాలంలో, అలా మా ఊరు లో ఉన్నట్టూంది అని అనుకునేలాగ డైలాగ్సు ఉన్నా సినిమా అష్టాచమ్మా అని చెప్పుకోవాలి (నా అభిప్రాయం లో). ఆ తెలుగు, ఆ వాతావరణం ఎంతో హాయిగా అనిపించింది కళ్ళకి, చెవులకి కూడా !!!

    • రవితెజ డైలాగు “అవును, నాది ఎర్రబస్సే” కాదు – “అవున్రా, మాది ఎర్ర బస్సే, అయితే ఏంటిప్పుడు, ఆ..” 😀


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: