వ్రాసినది: mohanrazz | 2009/08/29

నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

ఐ.టి. లో పనిచేసే కొంతమంది తెలుగు ఫ్రెండ్స్ ని చూసాక- ఓ నాలుగేళ్ళ క్రితం- సరదా గా వ్రాసింది…

నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!

ఏంట్రా ఈ జీవితం అంటాడు,
వేస్ట్ లైఫ్ రా మనది అంటాడు,
ఐ.టి లో నో, ఐ.ఐ.టి లో నో ఉంటాడు !!
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!


‘మనం వేస్ట్ రా బాబూ..’ అంటాడు,
మనకి లైఫ్ ప్లానింగ్ అస్సలు చేతకాదంటాడు,
ఊరిలో వంద ఎకరాలు కొంటాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!


‘అమ్మాయిలొద్దురా బాబూ – టార్చర్ ఫెలోస్’ అంటాడు
అయినా మనకెందుకు రా అమ్మాయిలు అంటాడు
రాత్రి మినిమమ్ రెండు గంటలు సెల్ లో ‘సొల్లు’తాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!


ఫ్రెండ్ ఫొన్ చేస్తే, ఐ.టి. లోకి రావద్దంటాడు
వర్క్ లోడ్ ఎక్కువంటాడు – జాబ్ సెక్యూరిటి తక్కువంటాడు
వచ్చావంటే నీ లైఫ్ ‘ఖండం అయిపొద్ది’ అంటాడు
వీడేమో ఆన్ సైట్, H1 తప్ప వేరే ఏమీ ఆలోచించడు!!
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!


‘ఎదవ జీవితం ‘ – పెళ్ళి కూడా కావట్లేదంటాడు
అమ్మాయి దొరకట్లేదంటాడు – అయినా మనకెవడిస్తాడంటాడు
ఇంట్లో వాళ్ళు ‘మ్యాచ్’ చూపిస్తే ఫ్లాట్, కార్ కొన్నాకే పెళ్ళి అంటాడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని!


నేను ‘కూల్-డ్యూడ్’ ని అంటాడు
నేను జాలి క్యాండిడేట్ అంటాడు
పని ఒక్కటే లైఫ్ కాదంటాడు
ఉదయం 8 కి ఆఫీస్ కి పోతే రాత్రి 11 అయినా బయటికి కదలడు
నమ్మొద్దు రా నమ్మొద్దు తెలుగు వాడిని! !!

ప్రకటనలు

Responses

 1. 🙂

 2. అదరగొట్టావ్ గురూ, కానీ అలా కేవలం ఒక్క తెలుగు వాడే చేయడం లేదు. ఆ మాటకొస్తే భారతదేశం లో అందరూ అలానే చేస్తున్నారు.

 3. బావుంది!

 4. ha ha ha, chaalaa baagaa raasaaru !!

 5. hahaha, baagaa raasaaru !!

 6. హ హ హ్హ…నేను మీ మాటలు నమ్మట్లేదులెండి.

 7. chaalaa baagudi

 8. republished

 9. chala bagundi!!

 10. 😉 😉

 11. Papam telugodiki inni kastala


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: