వ్రాసినది: mohanrazz | 2009/08/31

జూనియర్ NTR యాక్సిడెంట్/పార్టీ ఎపిసోడ్ లో.. :)

jrntr

మొన్నామధ్య టివి9 లో రెండు మూడ్రోజుల పాటు జూనియర్ NTR తాగి కారు నడపడం వల్లే యాక్సిడెంట్ అయిందా అని చర్చ/రచ్చ చేసి ఐదారు ప్రైం టైం స్లాట్లు భర్తీ చేసుకున్నారు.

 

ఎప్పటినుంచో ఆ వీడియోలు యూట్యూబు లో ఉన్నాయి. అలాంటిది టివి9 వాళ్ళు ఆ మొత్తం ఎపిసోడ్ ని తెరపైకి తెచ్చిన విధానమూ, దాన్ని తెరదించిన విధానమూ చూస్తే అన్ని చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసారనే అనిపించింది. ముందు ఒకరోజంతా ఆయన తాగి నడపడం వల్లే యాక్సిడెంట్ అయింది అని ఊదరగొట్టారు..నిజానికి ఆ మొదటిరోజే వాళ్ళకి తెలుసు ఆ పార్టీ యాక్సిడెంట్ కి ముందు రోజు జరిగింది కాదు, ఎప్పటిదో అని. అయితే ఒకరోజంతా అది యాక్సిడెంట్ ముందురోజుదే అని ప్రసారం చేయడం..ఆ తర్వాత మరుసటి రోజు..”ఆ పార్టీ ముందెన్నడో జరిగిందనీ, యాక్సిడెంట్ కి ముందు రోజు జరిగింది కాదనీ తెలుస్తోంది” అనీ ప్రసారం చేయడం..అంతా స్ట్రాటజిక్ గానే జరిగింది.

 

అయితే టివి9 లో ఆ ఎపిసోడ్ ని ప్రసారం చేసిన తీరు మాత్రం కేక కామెడీ. ప్రైం టైం లో గంటన్నర సేపు ప్రోగ్రాం ప్రసారం చేసి “అసలు మీడియా ఇలా తారల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడడం ఎంతవరకు సబబు? స్టార్ హీరో అయినంత మాత్రాన అతను తాగకూడదని ఏమీ లేదు అలాంటపుడు ఇంత చిన్నవిషయాన్ని ఇంత సెన్సేషనలైజ్ చేయవలసిన అవసరముందా? (ఈ స్టేట్ మెంట్ కైతే నాకు దిమ్మతిరిగిపోయింది, సెన్సేషనలైజ్ చేసేదీ వాళ్ళే, అలా చేయడం ఎంతవరకు సబబు అని ప్రైం టైం లొ మూడు నిముషాలకోసారి సేం వీడియోని మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ప్రశ్నించేదీ వాళ్ళే..కెవ్వు) అసలు తారలకంటూ వ్యక్తిగత జీవితం ఉండకూడదా? ఇప్పుడు మా ప్రతినిధి Jr NTR తన ఫ్రెండ్స్ తో మందుకొట్టిన గెస్ట్ హౌస్ నుండి మరికొన్ని వివరాలు అందిస్తారు 😀  “.

 

వెంటనే వాళ్ళ ప్రతినిధి సేమ్ గెస్ట్ హౌస్ లో వాళ్ళు మందు కొట్టిన సేమ్ ప్లేస్ లో కుర్చీలు టీపాయ్ పెట్టుకుని ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చుని మందుకొట్టారో డిటెయిల్డ్ గా వివరించాడు. స్క్రీన్ ని రెండుభాగాలు చేసి ఒక వైపు వాళ్ళు మందు కొట్టిన వీడియో ఇంకొక వైపు టివి9 ప్రతినిధి తాను ఒక కుర్చీలోనుంచి ఇంకొక కుర్చీ లో కి మారుతూ ఎవరెవరు ఎక్కడ కూర్చొని మందుకొట్టారు..అప్పుడు పాడిన పాట రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే ఏ సినిమాలోది, సినిమా లో ఆ పాట ఏ సందర్భం లో వస్తుంది, ఆ పాట విశిష్టత అన్నీ డిటెయిల్డ్ గా వివరించారు. వీడియోలొ కనిపిస్తున్న ఆ గోడ ఇప్పుడు ఇక్కడ ఈ గోడ కూడా మ్యాచ్ అవుతున్నాయి చూడండి 🙂 అన్నాడు.

 

అయితే మా ఫ్రెండ్ కి కాల్ చేస్తే అన్నాడు- “బాసూ, అన్నీ చూపించాడు కానీ ఇంకొకటి మిస్ అయ్యాడు టివి9 వాడు”
“అవునా? ఏం మిస్సయ్యాడు? రాజీవ్ కనకాల టివి9 కెమెరామెన్ తో ‘నేను కెమెరా వైపు చూస్తూ మాట్లాడను’ అని (బహుశా ఆఫ్ లైన్ అనుకుని) చెప్పిన విషయం కూడా వేసేశాడుగా..ఇంకా ఏం మిస్సయ్యాడు?”
“అది కాదు బాసూ…వీడియోల్ని జూమ్ చేసి, అక్కడ కూర్చున్న వాళ్ళని మార్క్ చేసి, గోడ ని మ్యాచ్ చేసి….. అన్ని చేసినవాడు..జూనియర్ NTR తాగిన మందు ఏ బ్రాండ్ దో కూడా చెప్పేసి ఉంటే పోయుండేది కదా…జనాలకి ఆ క్లారిఫికేషన్ కూడా వచ్చేసి ఉండేది..ఇప్పుడు చూడు అనవసరంగా ఇదొక సస్పెన్స్ ఎలిమెంట్ మిగిల్చేశాడు మళ్ళీ… 😀 ”


Responses

 1. 🙂

 2. ఆ మధ్య ఏదో మేక అడ్డొచ్చినందువల్ల దాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పి accident అని చెప్పారు. అయ్యింది మావాడొకడు ఆ accident కి కారణాన్ని ఇలా simple గా వివరించాడు. “మేక అడ్డొచ్చినప్పుడు break బదులుగా J.N.T.R. అలవాట్లో తొడ కొట్టుంటాడురా” అని.

 3. అసలు ఇది మొదట ఐ-న్యూస్ వాళ్ళు వెలికి తీశారు..అందుకని TV-9 వాళ్ళకి కడుపు మంట అనుకుంటా

 4. జూనియర్ ఎన్.టి.ఆర్ కు రాజకీయాలలో చెక్ పెట్టడానికి కాంగ్రెస్ వారు చేస్తున్న కుట్ర, వారికి అలవాటైన నీచ చర్యలలో ఇది ఒకటి.

  నిజం కాదు అని అందరికీ తెలుసు.

  వాదనలకు నిజాలతో పని లేదు కాబట్టి మనకు నచ్చని వాడు వెధవ అని నిరూపించడానికి పనికొచ్చే వార్త ఇది.

  రేపొద్దున్న జూనియర్ ఎన్.టి.ఆర్ వై.యస్ పాలనను విమర్శిస్తే వై.యస్ అనుచరులు ఈ వార్త వాడుకోవడానికి ఉపయోగ పడుతుంది.

  • కాంగ్రెస్ వారు జూనియర్ ఎన్.టి.ఆర్ కు రాజకీయాలలో చెక్ పెట్టడానికి ఉపయోగపడుతుంది..
   అదే సమయం లో ఇక మీదట రోడ్ షోలలో “వై.ఎస్. మన రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేష్ గా మారుస్తున్నాడు” అని విమర్శించే సాహసం జూనియర్ ఎన్.టి.ఆర్ చేయకుండా చేశారు..

   • అంతా బానే ఉంది కానీ బ్రదరూ, మద్యం కొట్టే మొనగాడు (తొడగొడతాడు కదా!) మద్యాంధ్రప్రదేష్ అని విమర్శలు చేయటం ఏమిటి? కామెడీ కాకపోతే? 😉

 5. […] నిజం మాట్లాడండి కాంగ్రెస్ వారి నీచ చర్యలలో ఇది ఒకటి: […]


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: