వ్రాసినది: mohanrazz | 2009/09/01

ఆ సీన్ కి “సెల్యూట్” :)

                           

విశాల్, నయనతార హీరో హీరోయిన్లుగా ఉపేంద్ర స్పెషల్ క్యారెక్టర్ లో మొన్నామధ్య సెల్యూట్ అని ఒక సినిమా వచ్చింది. నిజానికి ఈ సినిమా రిలీజ్ కి ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ డైరెక్టర్. ఈయన సినిమా డైరెక్టర్ అవ్వడానికి ముందు ఓ పదేళ్ళు ఇండియాటుడే లో రిపోర్టర్ గా పనిచేసినప్పుడు రిపోర్టర్ గా తను చేసిన కొన్ని సాహసాల గురించి చెబుతూ – వీరప్పన్ ఆకృత్యాల గురించే తప్ప వీరప్పన్ ఫోటో కానీ వీరప్పన్ తో డైరెక్ట్ ఇంటర్వ్యూ కానీ ఎక్కడా ఏ పత్రికలోనూ రానిరోజుల్లో (1990s)  ఎన్నో సాహసాలకోర్చి వీరప్పన్ ఏ ఏ గ్రామాల్లో ఉంటాడొ వివరాలు సేకరించి, అతన్ని కలిసి, మాట్లాడి, అతని ఫోటో, ఇంటర్వ్యూ తీసుకున్న మొదటి రిపోర్టర్ గా తన పేరు “ఇండియా టుడే” రికార్డ్స్ లో ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత సినిమాలవైపు అట్రాక్ట్ అయి సురేష్ కృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి చివరికి ఇప్పుడు డైరెక్టర్ అయ్యానని చెప్పాడు. నిజంగా కొంచెం సంభ్రమమనిపించింది. జర్నలిజం లో ఇలాంటి సెన్సేషన్స్ చేసిన వ్యక్తి “పోలీస్” సబ్జెక్ట్ తో సినిమా తీస్తున్నాడంటే ఆ సినిమా సబ్జెక్ట్ ఎక్స్‌ట్రార్డినరీ గా ఉంటుందని, పోలీస్ సబ్జెక్ట్స్ లో ఎవ్వరూ గెస్ చేయలేని సీన్స్ కానీ ట్విస్ట్స్ కానీ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసా. కానీ సినిమా చూసాక “అంతోటి సబ్జెక్ట్ ఏమీ కాద”నిపించింది. అయితే, అంత ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఈ కథ ని కథగా వింటే మరీ రొటీన్ పోలీస్ సబ్జెక్ట్ గా కాకుండా “లైట్” గా బాగానే ఉంటుంది. కాకపోతే ఆ “లైట్” సబ్జెక్ట్ సినిమా మొత్తం నింపలేము అని ప్యాచప్ గా వ్రాసుకున్న కొన్ని కామెడీ సీన్లు, ఇంకొన్ని లవ్ సీన్లు గట్రా మరీ దారుణంగా తలబొప్పికట్టించేలా ఉంటాయి. ఉపేంద్ర పాత్ర కాసేపు పర్వాలేదు కానీ “ఓవరాల్ సినిమా బోర్” అనే ఫీడ్ బ్యాక్ తప్ప వేరే ఏ ఇతర ఫీడ్ బ్యాక్ ఈ సినిమాకి రాలేదు. అదీకాక కొన్ని అర్థం పర్థం లేని సీన్లు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. అలాంటి ఒక సీన్-

ఈ సినిమా లో ఒక సీన్ ఉంటుంది. ఒకసారి విశాల్ తన పోలీస్ జీప్ లో వెళుతూ ఉంటే ఒక స్కూల్ బయట ఒక ఐస్ క్రీం బండి దగ్గర చిన్న పిల్లలంతా (హై స్కూల్ కంటే చిన్న పిల్లలు) మూగిపోయి ఆ ఐస్ క్రీం కోసం తహతహలాడుతుంటారు. ఎందుకో విశాల్ కి డౌట్ వచ్చి ఆ ఐస్ క్రీం ని తీసుకుని ల్యాబ్ కి పంపిస్తే ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే ఆ ఐస్ క్రీం లో డ్రగ్స్ పెట్టి అమ్ముతూంటారు. అది తెలిసి షాక్ అవుతారు-విశాల్, స్కూల్ మేనేజ్ మెంట్, ఆ పిల్లల పేరేంట్స్ – అందరూ. పిల్లలని టెస్ట్ చేస్తే వాళ్ళలో చాలా మంది ఆల్రెడీ డ్రగ్స్ ప్రభావం లో ఉంటారు. అప్పుడా పేరెంట్స్ విశాల్ తో – “సార్, చిన్న పసిపిల్లల జీవితాలతో ఆడుకున్న ఆ వెధవలని కాల్చి పడేయండి సార్..”, “సార్, దయచేసి ఎలాగైనా వాళ్ళని పట్టుకుని నడిరోడ్డు మీద ఉరి తీయండి సార్..” “సార్, పాపం పసిపిల్లలు సార్..” ఇలాంటి డైలాగులు కొన్ని చెబుతారు. వాళ్ళు చెప్పిన డైలాగులు..అన్నీ కరక్టే…కానీ నాకు అర్థం కానిది ఒక్కటే. డ్రగ్స్ ఏమీ చెట్లకి కాయవు విలన్లకి. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి చిన్న పిల్లలకి ఐస్ క్రీం లో డ్రగ్స్ కలిపి అర్ధరూపాయకి, పావలా కి అమ్మడం లో వాళ్ళకేంటి బెనెఫిటో సినిమా అయిపోయాక జుట్టు పీక్కున్నా అర్థం కాలేదు. పోనీ వాళ్ళేమైనా పాకిస్తాన్ టెర్రరిస్టులయి, లాంగ్ రన్ లో పిల్లల్ని పాడు చేసి దేశ భవిష్యత్తు ని దెబ్బకొట్టడానికి ప్లాన్ చేసారేమోనని కిలోమీటర్ అవతల ఆలోచిద్దామనుకుంటే అంత సీనూ లేదు..వాళ్ళేమీ పాకిస్తాన్ తీవ్రవాదులూ గట్రా ఏమీ కాదు…కేవలం లోకల్ డాన్ లు. లోకల్ విలన్లు. పోనీ ఎవరైనా ఒక వ్యక్తి మీద శతృత్వం తో అతని కొడుకుని టార్గెట్ చేసి డ్రగ్ చేసారంటే అదొక పద్దతి. అదేమీ ఉండదు సినిమలో. మరి అంతేసి ఖర్చుపెట్టి ఒక పర్టికులర్ స్కూల్ దగ్గర పిల్లలందరికీ ఐస్ క్రీం లమ్మితే వాళ్ళకేమి లాభమో (హీరో కి విలన్ మీద కోపం ఇంకా పెరగడం తప్ప) ఎంత ఆలోచించినా అర్థం కాలేదు..ఏదేమైనా ఈ సీన్ కి సెల్యూట్   😀

ప్రకటనలు

Responses

  1. ఒకసారి అడిక్టయ్యాక వంద రూపాయల ధరైనా కొంటారు. అందుకే మొదట చవుకగా అమ్మడం.

    • పాయింట్ కరక్టే. బ్రిటిష్ వాళ్ళు మొదట “టీ” ఫ్రీ గా అలవాటు చేసినట్టు వీళ్ళూ మొదట ఫ్రీగా అలవాటు చేసారేమోనన్న కోణం లోనూ ఆలోచించాను నేను. కానీ ఈ సీన్ ని అల్లడం లోనే ఒక flaw ఉన్నట్టు అనిపించింది. నిజంగా డబ్బే లక్ష్యమైతే టీనేజ్ కుర్రాళ్ళని కానీ కాలేజ్ కుర్రాళ్ళని కానీ టార్గెట్ చేయాలి. ఎంత తక్కువ మోతాదు డ్రగ్ అయినా వందకి రెండొందలకి రాదు కాబట్టి ప్లస్ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు వేలు పోసో లేదంటే ఎక్కువ డబ్బు పెట్టో ఆ తర్వాతైనా కొనలేరు కాబట్టి. కేవలం- పసిపిల్లల మీద సీన్ అల్లుకుంటే సెంటిమెంట్ బాగా పండిచ్చొచ్చు అనే కోణం లో మాత్రమే దర్శకుడు ఆలోచించి మిగిలిన లాజిక్ ని గాలికి వదిలేసినట్టనిపించింది.

  2. మీ post ఏదో బాగారాసారే అనుకుంటే, పైన budugoy comment
    ఇంకా బాగుంది.నిజమే కదా!!!!!

  3. haha


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: