వ్రాసినది: mohanrazz | 2009/09/02

బాలచందర్ చెప్పిన “స్టోరీ టెల్లింగ్” టెక్నిక్..

    

 

ఓ సారి ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడు.వినడానికి చాలా సింపుల్ విషయం లా అనిపించినా స్టోరీ రైటర్ కి చిన్నపాటి చెక్ పాయింట్ లా ఉపయోగపడే పాయింట్.
-మనం చెప్తున్న కథ పాతకథ అయితే దాన్ని చాలా కొత్తగా చెప్పాలి.
 చెప్తున్న కథ కొత్తదైతే దాన్ని చాలా సాదాసీదా గా చాలా మామూలు గా చెప్పాలి.

ఎన్నో రకాల కథలతో ఎన్నో రకాల ప్రయోగాలతో దశాబ్దాలపాటు తెలుగు తమిళ ప్రేక్షకుల్ని (అప్పుడప్పుడు కన్నడ, హిందీ కూడా) ఆకట్టుకున్న వెటరన్ డైరెక్టర్ చెప్పిన చాలా సింపుల్ స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ ఇది. పాత కథ ని చెప్పేటపుడు ఎంతో కొత్తగా ప్రేక్షకులు గెస్ చేయలేని విధంగా చెప్పి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తే దాదాపు ఆ సినిమా విజయవంతమైనట్టే. దీనికి ఉదాహరణ కావాలంటే మన హిట్ సినిమాల్ని పరిశీలించండి- విజయవంతమయ్యే తెలుగు సినిమాల్లో సగానికి పైగా అవే. కొత్త కథలు కరువై పాత కథల్నే వీలైనంత కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తూ చాలాసార్లు అందులో విజయం సాధిస్తున్నారు మన దర్శక రచయితలు. అయితే పాత కథని పాత గానే చెప్పి ఫ్లాప్ మూటగట్టుకునే సినిమాలకీ తెలుగులో కొదవ లేదు.

 
కొత్త కథని చెప్పేటపుడు చాలా సాదాసీదాగా చెప్పాలనేది ఇంకో సూత్రం. చాలామంది అప్ కమింగ్ రచయితలు, ఒక్కోసారి అనుభవఙ్ఞులు కూడా- వాళ్ళకి గనక ఒక కొత్త పాయింట్ దొరికితే ఆ ఎగ్జైట్ మెంట్ లో కథ ని ఇంకా కొత్త గా చెప్పాలనే తపన లో కథని కాంప్లెక్స్ చేస్తూ పోతుంటారు. కానీ కొత్త కథని చెప్పేటపుడు చాలా స్ట్రెయిట్ గా సింపుల్ గా చెప్తేనే అది సరిగ్గా “ఎక్కుతుంది” ప్రేక్షకుల మెదడు లోకి. ఆదిత్య 369 సినిమా చూసినపుడు ఇదే అనిపించింది. నిజానికి ఈ సబ్జెక్ట్ ని ఎంత కాంప్లెక్స్ కావాలంటే అంత కాంప్లెక్స్ చేసి ఉండొచ్చు. కానీ టైం మిషన్ అనే కాన్సెప్ట్ మనవాళ్ళకి తెలీదు, మన ప్రేక్షకుల్లో చాలా మంది విద్యావంతులు కాదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని సింగీతం గారు చాలా సింపుల్ గా స్టోరీని చెబుతూనే ఆద్యంతం ఆసక్తికరంగా మలచిన విధానం భలే ఉంటుంది. కొత్త కథని సింపుల్ గా చెప్పి విజయం సాధించిన సినిమాల గురించి ఉదహరించాలంటే చాలా సినిమాలే కనిపిస్తున్నాయి కానీ కొత్త కథని సింపుల్ గా చెప్పకుండా కాంప్లెక్స్ చేసి ఫ్లాపయిన సినిమాల ఉదాహరణలే అంత సులువు గా తట్టట్లేదు.. 🙂


Responses

  1. that is 100% True.

    వి.వి.వినాయక్ interview లో చదివాను.నేను పక్కా ఫార్ములలోనే తీస్తాను, కాని కొన్ని ఇంటరెస్టెంగ్ ఎపిసోడ్స్ మాత్రం యాడ్ చేస్తాను. అని చెప్పాడు.

    మగధీరలో అఘోర క్యారెక్టర్ ను చాలామంది విమర్శించారు. అసలు ఆ క్యారెక్టర్ వుద్దేశం విలన్ కు పూర్వజన్మ విశేషాలు చెప్పడం. రియాల్టీకి పోకుండా ప్రేక్షకులకు అర్ధం కావడానికి కావలసిన విధంగా మార్చి పాడేసాడు. ఫోటులు కూడా చూపెట్టాడు. well clicked.

    ఫైనల్ గా ప్రేక్షకులకు అర్ధం కావాలి మరియు ఇంటరెస్ట్ గా కూర్చోపెట్టాలి. సినీ విమర్శకులు అది మర్చిపోయి శంఖాలు శంఖాలుగా విమర్శలు గుప్పెచ్చేస్తారు. అటువంటి వారికే రాంగోపాలవర్మ జావాబులే కరెక్ట్.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: