వ్రాసినది: mohanrazz | 2009/09/04

వై.ఎస్. గుండె ధైర్యానికి Jr.NTR ఫ్యాన్ – నాగార్జున

untitled

ఎలక్షన్ రిజల్స్ట్స్ వచ్చిన కొత్తలో ఒక సారి సాక్షి టివి లో ఇంటర్వ్యూ ఇస్తూ నాగార్జున అన్న మాటలివి. (అంతకు ముందు ప్రచార సమయం లో వై.ఎస్. ని Jr NTR దుమ్మెత్తిపోసినా) తనతో వ్యక్తిగత సంభాషణల్లో ఆయన గుండె ధైర్యానికి తాను ఫ్యాన్ ని అని Jr NTR చెప్పారన్నాడు నాగార్జున. నిజమే, రాజకీయంగా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన దృక్పథం ఉండటం, ఆ దృక్పథాల కారణం గా కొంతమందిని అభిమానించడం ఇంకొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యం లో అత్యంత సహజమైన ప్రక్రియ. అయితే రాజకీయాల్ని ప్రక్కనపెట్టి మాట్లాడినప్పుడు వై.ఎస్. గుండె ధైర్యాన్ని శ్లాఘించే వాళ్ళే దాదాపు అందరూ.

కోట్లాది మంది తెలుగుప్రజల్లాగే నిన్నంతా నేనూ టివికి అతుక్కుపోయే ఉన్నాను. ఈటీవీ లో నిన్న వాయిస్ ఓవర్ చెబుతూ యాంకర్ అంది – తను చేయాలనుకున్న పనిని దేనికీ వెరవకుండా చేసే గుండె ధైర్యం, విశ్వసనీయత, తనని నమ్ముకున్న వాళ్ళకి ఆదుకునే స్నేహశీలత, తనకి ప్రత్యర్థులైన వాళ్ళకి ముచ్చెమటలు పట్టించే నైజం- వెరసి వై.ఎస్. వ్యక్తిత్వం అని. నిజం. పథకాలతో పాటు -వైఎస్  వ్యక్తిత్వాన్ని ప్రజలు గుర్తుంచుకునేదీ ఈ నాలుగు గుణాలతోనే.

ఎన్నికలకి ముందు – ప్రత్యర్థి పార్టీలన్నీ ఒక్క త్రాటిపైకి వచ్చి మహాకూటమి ఏర్పాటు చేసి, తెలుగు ప్రజల్ని ఎంతో ప్రభావితం చేసిన NTR కుటుంబం లోని అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకులందరూ ప్రచారానికి దిగి, ఈ రెంటికీ మించి ఇప్పటివరకూ దేశం లో అమలైన ప్రజాకర్షక పథకాలన్నింటిలోకీ మిన్న అని రాజకీయవేత్తలు అభిప్రాయపడ్డ “కోటి కుటుంబాలకి నగదు బదిలీ” పథకం ఒక వైపు ఉంటే- ఇంకో వైపు గత రెండు దశాబ్దాల్లో అత్యంత ప్రజాకర్షణ కలిగిన తెరవేలుపు చిరంజీవి రాజకీయ ప్రవేశం సునామీ సృష్టిస్తుందని – రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూంటే, “సామాజిక న్యాయం” చాటున దాగి ఉన్న ఈక్వేషన్లు కాంగ్రెస్ కొంపముంచవచ్చేమోనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతూంటే- మూడో వైపు సొంత పార్టీలోనే కొందరు ఒంటరి ఎన్నికలకి వెళ్ళి తప్పు చేస్తున్నామని వారిస్తూంటే- అలాంటి సమయం లో –
 “ఈ ఎన్నికల్లో రాష్ట్రం లో కాంగ్రెస్ గెలిచినా ఓడినా దానికి పూర్తి బాధ్యత నాదే”

 అని ప్రకటించిన ఆ గుండె ధైర్యానికి ఎవరు మాత్రం గులాం అవరు??   

జలయఙ్ఞం చేసి ఇన్ని ప్రాజెక్టులు కట్టగలిగే గుండె ధైర్యం ప్రత్యర్థి పార్టీల్లో ఎవరికైనా ఉందా అని ఆయన సవాల్ విసిరినపుడు ప్రజలకెవరికీ అది ఎబ్బెట్టుగా అనిపించకపోగా నిజమే కదా ఇన్ని ప్రాజెక్టులు కట్టగలిగిన నాయకుడు ఇంకెవరున్నారు రాష్ట్రం లో అని ఇతర రాజకీయవర్గాల్ని అభిమానించేవారికి సైతం అనిపించడమే ఆయన గుండె ధైర్యానికి తార్కాణం. బహుశా రాష్ట్ర కాంగ్రెస్ లో ఇలాంటి నాయకుడు మళ్ళీ రాకపోవచ్చు. కనీసం ఇందులో సగం ఛరిస్మా అయినా ఇంకో నాయకుడు సంపాదించుకోగల్గడానికి దశాబ్దాలు పట్టవచ్చు.


Responses

 1. నిజానికి వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అణిచివేతను తట్టుకుంటూ సమర్దుడైన ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన తీరు, అతను గుండెధైర్యం ప్రజలకు బాగా నచ్చడం వల్లే కాంగ్రెస్ అధికారం లొకి రాగలిగింది.

 2. ఒక ఆదర్శ ప్రతిపక్ష నేత అని చెప్పలేము కానీ ఇప్పటి ప్రతిపక్ష సభ్యులు మాత్రం వయ్యస్సార్ ని చూసి నేర్చుకోవాల్సిన సంగతులెన్నో ఉన్నాయి. ఉదాహరణకి ప్రజలతో మమేకమవగలగటం

 3. How come you will take so seriously views of jokers like Jr. NTR and Nagarjuna. And you are trying to assess YSR based on these fools comments. If somebody offers XXXCrores Nagrjuna will jump to that party. ANR & his family members does not have any values. ANR used to suck CBN when he was in power calling him as AlluDu. His son pro cong just before elections. His grandson will joing some other party. You are writing these jokers as if they achieved a lot. r. NTR he blamed everyone in the cong and how come after elections Nagrajuna will tell he admires YSR. If you compare telugu sinema people with prositutes. Prositutes are far better than telugu sinema gang except a few people like Krishna, Dharavarapu, K. Viayachander .

 4. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను .మీరు చాల చక్కగా విశ్లేషించారు.అభినందనలు.
  రాజకీయంగా,సిధ్ధాంతపరంగా, వ్యతిరేకాలెన్నున్నా, పార్టీలకతీతంగా,ఆయన పై నాకు కలిగిన అభిమానాన్ని ,నా బ్లాగులో ప్రచురించకుండా వుండలేక పోయానంటే ,అలా చేయించ గలిగిన మహత్తర వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. రాజకీయంగా చేసిన కొన్ని పనులు,రాజకీయ దుగ్ధతొ సేసినవే కాని ప్రజా వ్యతిరేకం కావని అందరూ గుర్తించాలి. భాద్యతాయుతమైన పౌరుడిగా ఆలోచించినప్పుడు, వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించే వారెవ్వరూ వుండరు. మీదుమిక్కిలి,ప్రేమ అభిమానాలు అందరి మనసుల్లో అంతర్గతంగా నిలిచి వుంటాయి. అదే యీ దుర్ఘటన జరిగినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా బహిర్గతమయ్యింది.స్త్రీలు, పిల్లలు ,పేదలు, బదుగులు , ఒకరేమిటి, అన్ని వర్గాలకు ఆరాధ్య దైవం రాజశేఖరుడు.

  వాస్తవానికి కాంగ్రేసు పార్టీ పై గొప్ప అభిప్రాయం లేకున్నా,నేను సైతం నా బ్లాగు ముఖంగా, నా బాధను నా సైలిలో వ్యక్తపరచకుండా కుండా వుండలేక పోయాను. ఆయన హెలికాప్టర్ మిస్సయిన విషయం తెలియగానే నా మనస్తాపాన్ని ,కలిగిన బాధను, నా బ్లాగులొ,….
  ‘దుర్ఘటన పాలయిన సి. ఎం హెలికాప్టరు ‘
  అనే పేరుతో (తెలుగు బ్లాగుల లోనే మొట్ట మొదటి తెలుగు పోస్టు గా) ప్రచురించాను. అదే విధంగా ఆయన మరణ వార్త అధికారికంగా ప్రకటించగానే …..
  ‘శిఖరాగ్రపు శిధిల వుదంతం’
  పేరుతొ నా మనసులో వుధ్భవించిన వ్యధను నా బ్లాగులొ వ్యక్త పరిచాను. …… శ్రేయోభిలాషి …..నూతక్కి రాఘవేంద్ర రావు.

 5. ILIKE YSR NOW YSJ FAN

 6. YSR IS BASTAED AND YSJAGAN IS BIG BASTARD

 7. ysr is not a man he is wild animal

 8. ధన్యవాదాలు – భండారు శ్రీనివాసరావు


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: