వ్రాసినది: mohanrazz | 2009/09/08

డైరెక్టర్ గీతా కృష్ణ – గుర్తున్నాడా???

 geetakrishna

అప్పుడెపుడో కోకిల సినిమా చూస్తున్నా. టైటిల్ చూసి ఏదో లవ్ స్టోరీ అయి ఉంటుందిలే అనుకుని తాపీ గా కూర్చుంటే – కొద్దిసేపటికే, ఏం జరుగుతుందో అర్థమయ్యేలోగా పూర్తిగా డైరెక్టర్ గ్రిప్ లోకి వెళ్ళిపోతాం. ఇక అక్కడినుంచి క్లైమాక్స్ దాకా మనల్ని అదే గ్రిప్ లొ ఉంచి డైరెక్టర్ కథ నడిపిన తీరు ఎక్స్ట్రార్డినరీ అసలు. దాదాపు 20 ఏళ్ళయి ఉంటుందనుకుంటా ఆ సినిమా వచ్చి. పగ ప్రతీకారాల సినిమాలు, అత్త అల్లుడు సినిమాలు, హీరో అంటే ‘దొంగ ‘ అయి ఉండే సినిమాలు నడుస్తున్న రోజుల్లోనే ఆయన – ఒక మనిషి చనిపోయేముందు అతను చివరి సారిగా చూసిన చిత్రం అతని కంటి మీద ఇమేజ్ గా అలాగే ఉండిపోయే అవకాశం ఉంది అని ఒక సైన్స్ ఇంటర్నేషనల్ మేగజైన్ లో వచ్చిన న్యూస్ ఐటెం ని పట్టుకుని ఒక చిక్కని మర్డర్ మిస్టరీ ని థ్రిల్లర్ ఫార్మాట్ లో అల్లుకుని తెలుగు ప్రేక్షకుల్ని రెండున్నరగంటలపాటు కూర్చోబెట్టి సూపర్ హిట్టు కొట్టడం ఆషామాషీ విషయం కాదు. అయితే ఆ న్యూస్ ఐటెం కి శాస్త్రీయత లేదని తర్వాత ప్రూవ్ అయింది, అది వేరే విషయం. కె విశ్వనాథ్ గారిదగ్గర పనిచేయడం వల్ల ఆ ఇంఫ్లూయెన్స్ తో మొదట్లో “సంకీర్తన” సినిమా ద్వారా పరిచయమైనా ఆ తర్వాత కోకిల ఇచ్చిన ఉత్సాహం తో కీచురాళ్ళు, ప్రియతమా లాంటి సినిమాల్లో వైవిధ్యం చూపించాడు. ప్రియతమా సినిమా లో – ఒక హత్య చూసి షాకై, స్కీజోఫ్రీనియా తో సతమతమయ్యే హీరోయిన్ కి క్లైమాక్స్ లో ఇచ్చే షాక్ ట్రీట్ మెంట్ సీన్ – ఇప్పుడు చూస్తే అన్ సైంటిఫిక్ అనిపించవచ్చు కానీ – ఆ రోజుల్లో ఒళ్ళు జలదరించింది.

అయితే “20 ఏళ్ళ తర్వాత తీయాల్సిన కథలతో ఇప్పుడే సినిమాలు తీస్తాడీయన” అనే వాళ్ళప్పట్లో గీతా కృష్ణని. కానీ 20 ఏళ్ళ తర్వాత ఆయన సినిమాలే లేవు. చాలా గ్యాప్ తర్వాత ఆ మధ్య “టైం” అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేశాడు. కోకిల, ప్రియతమా(సైకలాజికల్ థ్రిల్లర్ అన్నాడు దీన్ని అప్పట్లోనే) , సర్వర్ సుందరం గారి అబ్బయి (ఇందులో హార్ట్ ట్రాన్స్ప్లంటేషన్ – ఇతివృత్తం) లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ టైం అనే టైటిల్ పెడితే ఇది మరో సైంటిఫిక్ అంశం చుట్టూ నడిచే స్టోరీ అయిఉంటుందనే ఎక్స్ పెక్ట్ చేసాను. ఖచ్చితంగా డిఫరెంట్ మూవీ అవుతుందనుకున్నాను. కానీ పరమ రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా అని తర్వాత తెలిసింది. చూసిన వాళ్ళంతా మా “టైం” బాగోక ఈ సినిమాకి వెళ్ళాం అన్నారు.

కానీ ఒక్క సినిమా తో డైరెక్టర్ ప్రతిభ ని అంచనా వేయకూడదు. కోకిల, ప్రియతమా, కీచురాళ్ళు ఇవన్నీ ఆ రోజుల్లో ప్రజల్లో విపరీతమిన ఉత్సుకత ని కలిగించిన సినిమాలే, ఆ రోజుల్లో వస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే చాలా భిన్నమైన చిత్రాలే. అప్పట్లో నేను బాగా అభిమానించిన సినిమాలే. నెట్ లో ఏదో వెతుకుతూంటే గీతా కృష్ణ అఫీషియల్ వెబ్ సైట్ దొరికింది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ చూడొచ్చు.


Responses

 1. నిజానికి ‘కోకిల’ అప్పట్లో పెద్ద ఫ్లాఫ్. ఇళయరాజా చేసిన పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్. నాకు మాత్రం అప్పట్లోనే బాగా నచ్చిందీ సినిమా. గీతాకృష్ణ సినిమాల జయాపజయాలు అటుంచితే కచ్చితంగా అతనో విభిన్న దర్శకుడు.

  • నిజానికి ‘కోకిల’ అప్పట్లో పెద్ద ఫ్లాఫ్ >>>

   అవునా?? ఏమో మరి….నాకెందుకో అది హిట్టన్నట్టు గుర్తుండిపోయింది..అయితే నాకు చాలా బాగా నచ్చిన సినిమా ఇది.

 2. నాకు అలాగే గుర్తు…సినిమ హిట్ అయినట్టు గుర్తు లేదు, నేను ఆ సినిమా చూడలేదనుకోండి. కానీ పాటలు మాత్రం సూపర్ డూపర్ హిట్స్. ముఖ్యం గా ‘కోకిల, కొ కొ కోకిల’ పాట. ఎప్పుడూ రేడియో లో, టివి లొ చిత్రలహరి లో ఆ పాటే వచ్చేది.

 3. గంజాయి వనం లో తులసి మొక్క

  ప్రవీణ్ నిద్ర లేచావా ?

 4. కమర్షియల్ సక్సెస్ మాట పక్కనబెడితే వైవిధ్యానికి మారుపేరు గీతాకృష్ణ. గొప్ప స్టార్ కాస్ట్ లేకపోయినా ఆయన సినిమాలు ఇంకా గుర్తున్నాయంటే ఫార్ములా స్టోరీలకు భిన్నంగా ఆయన ఎంచుకున్న కథలే కారణం.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: