వ్రాసినది: mohanrazz | 2009/09/09

టక్కరి దొంగ హీరోయిన్ కి అరుదైన కేన్సర్

lisaray

లీసారే- తెలుగు లో టక్కరి దొంగ చిత్రం లో మహేష్ బాబు తో నటించిన హీరోయిన్. తమిళ్ లో శరత్ కుమార్ తో కలిసి నేతాజీ అనే సినిమాలో నటించింది. ముందు మోడల్ గా చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన లీసారే హిందీ లోనూ ఒక పది సినిమాల దాకా నటించింది. కసూర్ అని ఒక సినిమా ఉంటుంది అఫ్తాబ్ తో. ఒక 20 ఏళ్ళ క్రితం వచ్చిన సుమన్ సినిమా “నేరం నాది కాదు” కథ ఈ కసూర్ సినిమా కథ ఒకేలా ఉంటాయి. బహుశా రెంటికీ ఒకే ఇంగ్లీష్ మూలం ఉండి ఉండవచ్చు.

లీసారే ఓ వారం కిందే తన సొంత బ్లాగు ప్రారంభించింది. బ్లాగు లో వ్రాసుకుంది- జూన్ 2009 న తనకి కేన్సర్ అని తెలిసిందని. అరుదైన ఈ కేన్సర్ గురించిన వివరాలూ, తన ట్రీట్ మెంట్ సంబంధించిన కొన్ని వివరాలూ వ్రాసింది. అయితే కేన్సర్ అని తెలిసాక దాని పట్ల తన మాటల్లో వ్యక్తమైన దృక్పథం, కేన్సర్ తో పోరాడుతూనే – కొంత వరకు పర్సనల్ అంశమైన ఈ విషయాన్ని పబ్లిక్ తో షేర్ చేసుకుంటూ ముందుకు నడవాలనుకుంటున్న దృక్పథం – తనని అభినందించదగినవిధంగా ఉన్నాయి. All the best to her.

పూర్తి డిటెయిల్స్ కావాలంటే లీసారే బ్లాగ్ చూడండి.


Responses

 1. అయ్యో పాపం!

  అదిసరే, ఈవిడ టక్కరి దొంగలో చేసిందా! నాకైతే అదేదో సబ్బు కి (Evitaఅనుకుంటా) మోడల్ గానే తెలుసు!

 2. ఈమె Water సినెమా కోసం గుండుతో నటించింది కదా…

 3. బాంబే డైయింగ్ కి మోడల్ గా ఉండేది

 4. she acted in many ads including one with sprite – గుర్తుందా – “ఈ సినిమా తారలు డబ్బిస్తే, ఏం చెప్పమంటే అది చెప్తారు, స్ప్రైట్ తీరుస్తుంది కేవలం దాహం, మిగతావన్నీ బూటకం” ..
  She acted in “Water” also

 5. I liked her ‘Hollywood Bollywood’.

 6. sad news..! she acted in many ads..!!!

 7. she acted in many ads..!!! sad news to hear that she has cancer…

 8. ఆ అమ్మాయి, మొట్టమొదట్లో lux ad కి కూడా వచ్చేది. చాలా popular model. Water సినిమా లో నటించింది. సినిమా చాలా బాగుంటుంది. 2000 లోనో, 2001 లోనో గుర్తు లేదు, జాన్ అబ్రహం తో ఒక‌ సినిమా (పేరు గుర్తు లేదు) లో నటించినప్పుడు, వీళ్ళీద్దరు మంచి జోడి అని మేము అనుకునేవాళ్ళం. ఇద్దరు మంచి personality తో, ఒడ్డు, పొడుగు అన్ని సరిపోయాయి అని అనుకునేవాళ్ళం. మళ్ళి వాళ్ళిద్దరు Water లో కలిసి నటించారు.

  మోహన్ గారు, మీరు చెప్పిన తరువాత లీసా రె బ్లాగు చూసాను. చాల బాగుంది. ఆ అమ్మయికి అలాంటి కష్టం కలగడం విచారకరం.

  • yes, she is more popular as a model than as an actress!!!

   • మీరు English లో reply ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకునంటా…ఎప్పుడూ చూడలేదు 🙂

    • హ హ..అవును నిజమే….అంత గమనించుకోలేదు నేనూ..!


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: