వ్రాసినది: mohanrazz | 2009/09/09

నాగ చైతన్య నెక్స్ట్- గీతాంజలి రీమేకా?

second_film

 

నాగచైతన్య రెండో సినిమా గౌతం మీనన్ దర్శకత్వం లో కృష్ణ కూతురు మంజుల నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రారంభం అప్పడు నాగార్జున – ఈ సినిమా తో చైతూ కి నాకు గీతాంజలి కి వచ్చినంత పేరు వస్తుంది అన్నాడు. సరే హీరోలు వాళ్ళ ప్రీవియస్ హిట్స్ తో కొత్త సినిమాల్ని కంపేర్ చేయడం సహజమే కదా అని అనుకున్నాను. కానీ జోష్ చూసాక ఆ స్టేట్మెంట్ నాకు ఇంకోరకంగా అర్థం అవుతోంది.

దిల్ రాజు కొత్తబంగారు లోకం సబ్జెక్ట్ తో చైతన్యని ఇంట్రడ్యూస్ చేద్దామని సబ్జెక్ట్ చెప్తే నాగార్జున కథ బాగుంది, సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది కానీ ఈ సినిమా తో చైతూ ని పరిచయం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాట్ట. నిజానికి వారసుల సినిమాలు యావరేజ్ గా ఉన్నా సూపర్ డూపర్ హిట్ అవుతాయి – ఎందుకంటె కుర్రాడెలా వున్నాడో చూద్దామనే కుతూహలం వల్ల సినిమా ని దాదాపు చాలామంది చూస్తారు- ఆరకంగా సినిమా యావరేజ్ గా తీస్తే హిట్ అవుతూంటాయి. ఈ లాజిక్ ప్రకారం చూస్తే కొత్తబంగారు లోకం నాగచైతన్య తీస్తే ఖచ్చితంగా ఇప్పుడు హిట్ అయిన దానికంటే ఎక్కువగా హిట్ అయ్యేది ఆ సినిమా. వరుణ్ సందేశ్, తరుణ్, సిద్దార్థ లాంటి హీరోల స్లాట్ లో చైతన్య ని ఇంట్రడ్యూస్ చేయడం బహుశా నాగార్జునకి ఇష్టం లేదేమో.

ఇవన్నీ చూసాక- ముందుగా instruct చేసే, జోష్ కథ ని శివ లైన్స్ లో తయారు చేసి ఉంటారనిపిస్తోంది. నిజానికి నాగార్జున కి కూడా ఈ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు- తను మొదట్లో చేసిన “మజ్ఞు” సినిమా కథ ANR దేవదాసు లైన్స్ లో ఉంటుంది. అలాగే “జానకి రాముడు” కథ మూగమనసులు ని (ఆరోజులకి) మాడ్రనైజ్ చేసినట్టు ఉంటుంది. ఈ లెక్కన గౌతం మీనన్ సినిమా-మరీ గీతాంజలి కి రీమేక్ లా కాకపోయినా కథ అదే లైన్స్ లో ఉండొచ్చనిపిస్తోంది. ఓసారెపుడో గౌతం మీనన్ తనకిష్టమైన సినిమాల గురించి చెప్తూ గీతాంజలి ని ప్రస్తావించినందువల్లేమో నాకు ఇంకొంచెం గట్టిగా అలా అనిపిస్తోంది.

ప్రకటనలు

Responses

  1. మమ్మల్ని ప్రాణాల్తో ఉండనివ్వరా ?

  2. time bad anukunta.. iha kaskondi.. Ohh priya Priya and Aamani padave hayiga songs ki remix chesi padesi vadhultharu . naa saami rangaa, unaatdhi.. keko keka..

  3. One of the ‘Discussion Board’ friends was saying yesterday that this film might not be remake of geetanjali, and it might be,most probably, remake of Gautam meenan’s movie “Vinnaitthaandi Varuvaayaa” (which is currently on sets) that stars simbu and trisha . But this is also not confirmed. BTW Vinnaitthaandi Varuvaayaa is also a romantic/love story. !!!

  4. ఇంకా నయం. జూ ఎన్టీయారూ, ఈ చై’తోడు’ ఇద్దర్నీ కలిపి మాయా బజార్ తీస్తామనలేదు. ఎస్వీయార్ పాత్రకి ఏ దేవ్ గిల్లి గిజిగాడో, బాల కృష్ణనో పెట్టితే ఇక చూస్కోండి మీ సామిరంఘా…!

  5. జనరేషన్ మారినా అవే కథలా? కొత్తదనం రాదా?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: