వ్రాసినది: mohanrazz | 2009/09/10

బార్న్ డైరెక్టర్స్ Vs మేడ్ డైరెక్టర్స్ – రాజమౌళి

born-made

డైరెక్షన్ గురించి చెబుతూ ఓ సారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో అన్నాడు- “డైరెక్టర్లు రెండు రకాలు ఒకరు బార్న్ డైరెక్టర్స్ రెండు మేడ్ డైరెక్టర్స్. నాకు తెలిసి బార్న్ డైరెక్టర్స్ చాలా తక్కువగా ఉంటారు. వీళ్ళకి పుట్టుక తో ఆ మైండ్ సెట్ అలా నేచురల్ గా వచ్చి ఉంటుంది. మిగతా వాళ్ళు మేడ్ డైరెక్టర్స్. అలాంటి బార్న్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా చేసో లేక బార్న్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా చేసి డైరెక్టర్స్ అయిన మేడ్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్స్ గా చేసో డైరెక్టర్స్ అయ్యే వాళ్ళు. ఇప్పుడున్న దర్శకుల్లో దాదాపు అందరూ మేడ్ డైరెక్టర్సే- నాతో సహా. తెలుగు దర్శకుల్లో బార్న్ డైరెక్టర్స్ అంటె ఉదాహరణకి రాం గోపాల్ వర్మ, బాపూ లాంటి వాళ్ళని చెప్పుకోవచ్చు”.

నిజమే- చాలా మంది డైరెక్టర్స్- “డైరెక్షన్” నేర్చుకుని డైరెక్టర్స్ అయ్యారు. వర్మ బాపూ లాంటి వాళ్ళు చాలా మందికి డైరెక్షన్ నేర్పించారు. అసిస్టెంట్స్ గా చేర్చుకొనే కాదు, బాపూ కి గానీ వర్మ కి కానీ ఏకలవ్య శిష్యులు ఎక్కువే ఇండస్ట్రీ లో!


Responses

 1. బార్న్ డైరెక్టర్లు అంటూ ఎవరూ ఉండరు. బాపుగారు బొమ్మలతో షాట్ డివిజన్లు గీసి నేర్చుకుంటే, వర్మ సినిమాలు చూసి వాటి గురించి చదివీ నేర్చుకున్నారు.

  అంటే… కొందరు సొంతంగా నేర్చుకుంటారు, మరి కొందరు కోర్సులు చదివో లేక ఎవరిదగ్గరన్నా శిష్యరికం చేసుకునో నేర్చుకుంటారు అంతే తేడా…everybody has to LEARN to direct.

  So,its only self tough directors & tough by others directors.

  • i dont agree with u et all

   born director is completely different hope u understand d concept

 2. రాజమౌళి చెప్పినది అక్షరాల సత్యం. బార్న్ డైరెక్టర్స్ చాలా కొద్దిమంది ఉంటారు. వెనుకటి రోజులలో అయితే కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్ గార్లు అలాంటి బార్న్ డైరెక్టర్స్ అనిపిస్తుంది నాకు. కె.వి.రెడ్డి గారు తీసిన మాయాబజార్ సినిమా లో ప్రతీ ఒక్క సీను ఎంతో ఆహ్లాదంగా, interesting గా ఉంటుంది. ఎన్నిసార్లు చూసినా ఏ సీను లోను బోర్ కొట్ట్దదు. ఈ సినిమా కి డైరెక్షన్ ఒక ఎత్తయితే, చిత్రానువాదం ఇంకో ఎత్తు. రెండు ఎత్తులని కె.వి.రెడ్డి గారు ఎంతో సులభం గా అందుకున్నారు. అలాగే బి.ఎన్.రెడ్డి గారు తీసిన మల్లీశ్వరి చిత్రం నచ్చని తెలుగు ప్రేక్షకుడుంటాడని నేను అనుకోను. ఎల్.వి.ప్రసాద్ గారు తేసిన, మిస్సమ్మ సినిమా ఆద్యంతం అలరిస్తుంది. వీరు అందరు తీసిన సినిమాలు అన్ని ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి.

  తరువాతి కాలం లో బాపు గారికి తెలిసినంత అందంగా దర్శకత్వం గురించి ఇంకెవరికి తెలీదనిపిస్తుంది. అల్లాంటి బాపు గారికే ఫ్లాపులున్నయంటే నమ్మబుద్దికాదు కదా! కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాస్ గార్లు కూడా బార్న్డైరెక్టర్స్ కోవ లోకి వస్తారు.

  ప్రస్తుత కాలం లో ఉన్న డైరెక్టర్స్ లో చాలామటుకు అందరూ మేడ్ డైరెక్టర్స్ అనే చెప్పొచ్చు. కాని, ‘మిస్సమ్మ(2007)’, ‘అనుకోకుండా ఒకరోజు’ చూసిన తరువాత చాలారోజులకి డైరెక్టర్స్ పుట్టారు అనిపించింది. నీలకంఠ, చంద్రశేఖర్ యేలెటి నిజంగానే బార్న్ డైరెక్టర్స్ అనిపించింది. వాళ్ళూ పై చెప్పిన చిత్రాలని మలచిన తీరు చూస్తే అద్భుతం అనిపించింది. ‘షో’ సినిమా చూసినప్పుడే నాకు నీలకంఠ మీద మంచి అభిప్రాయం కలిగింది. మిస్సమ్మ చూసాక చాలా గొప్పగాఅనిపించింది. నందనవనం 120 kms కూడా చాలా బాగుంది, మంచి concept. కానీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలీదు. అలాగే చంద్రశేఖర్ యేలెటి ‘అనుకోకుండా ఒకరోజు’ ని మలిచిన తీరు చూస్తే అద్భుతం, అమోఘం అనిపించింది. అసలు ఆ సినిమా లో ఎన్ని concepts ని touch చేసారో చెప్పలేము. అసలు అంత heavy subject ని అన్ని concepts ఉన్నదాన్ని ఎంపిక చేసుకుని, గొప్ప అర్థవంతంగా ఆకర్షణీయంగా తీయడం లో డైరెక్టర్ దమ్ము కనిపిస్తున్నది. ఈయనకి ఇది పుట్టుకతో వచ్చిన విద్యేమో అనిపించింది.

  ఇవి అన్నీనా అభిప్రాయాలు సుమండీ…!!

  • yes, i agree with the most of the points here. మీరు చెప్పిన ఆ పాత తరం దర్శకుల్లోనూ, అనుకోకుండా ఒక రోజు, షో లాంటి సినిమాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించే అంశం ఏంటంటే- “ఒరిజినాలిటీ”. కొంత మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒక తరహా ఆలోచనాసరళి కనిపిస్తూంటూంది- ఒక్క ఒరిజినల్ థాట్ ఉంటే దాన్ని పట్టుకుని మొదటి సినిమా హిట్ కొట్టేస్తే చాలు ఆ తర్వాత ఒరిజినల్ క్రియేటివిటి అక్కర్లేదు borrowed creativity 🙂 తో లాగించేయచ్చు అని. అసలు మొదటి సినిమాకి కూడా “ఒరిజినల్ థాట్” అక్కర్లేదు, ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చెప్పబడని పాయింట్ ఒకటి ఏదో భాష లోని సినిమాలోంచి దొరకపట్టుకుంటే చాలు, దానితో మొదటి సినిమా హిట్ కొట్టేయొచ్చు ఆ తర్వాత “ఎలాగో లాగించేయొచ్చు” అనుకునే ఔత్సాహిక దర్శకులు రెండో కోవలోని వాళ్ళు. ఆల్రెడీ తెలుగులో వచ్చిన పాయింటైనా పర్లేదు, “కొంచెం డిఫరెంట్ గా” కథనం తయారు చేసుకుంటే చాలు పని అయిపోతుంది అనుకునే వాళ్ళు మూడోరకం. వీళ్ళెవరిలోనూ(this assistant directors) నాకు బార్న్ డైరెక్టర్ కనబడలేదు.

   మహేష్ గారన్నట్టు – everybody should learn అనేది కరక్టే కానీ- to be precise- “every body should learn THE PROCESS” సొంతంగా కానీ వేరే వాళ్ళ దగ్గర పనిచేసి కానీ. BUt ఎవరి దగ్గరైనా పనిచేసి కానీ సొంతంగా పుస్తకాలు చదువుకుని కానీ
   నేర్చుకునేది “ప్రాసెస్” మాత్రమే. రాజమౌళి గారు బార్న్ డైరెక్టర్స్, మేడ్ డైరెక్టర్స్ అని చెప్పింది “learning ప్రాసెస్” గురించి కాదనుకుంటా!

 3. There is no such thing. It is just a respectful image you’re projecting onto an artist you admire.

  • రాజమౌలి చెప్పాడంటే you’re projecting అంటారేమిటి ?

 4. మూడవ మరియు నాలుగవ రకం కూడా ఉన్నారు:

  3. Unborn Directors: కుర్రా రంగారావులా ఎల్లప్పటికీ సహాయ దర్శకులుగానే మిగిలిపోయేవాళ్లు. వాళ్ల కింద పనిచేసిన asociate directors కాలం కలిసొచ్చి దర్శకులైపోతే, ఆ జూనియర్స్ దగ్గరే సిగ్గు పడకుండా సహాయ దర్శకులుగా చేరే ఉదాత్తులు వీళ్లు. వీళ్లనే నిస్సహాయ దర్శకులు అని కూడా అంటారు.

  4. Born Again Directors: మొదటి ప్రయత్నంలో ఇండస్ట్రీ మెగా ఫ్లాప్ తీసి కనుమరుగైపోయి, ఆ తర్వాత ఐదేళ్లకో పదేళ్లకో మళ్లీ తెరమీదికొచ్చి వరుస హిట్లు కొట్టే వాళ్లు. తెలుగులో కె. విజయభాస్కర్, హిందీలో అశుతోష్ గోవారికర్, సంజయ్ లీలా భన్సాలీ ఇటువంటివారికి ఉదాహరణ.

  ———

  Jokes aside, దర్శకుల్లో బార్న్, మేడ్ ఏంటండీ? కొత్తపాళీ చెప్పినట్లు, ఇవన్నీ గౌరవంతోనో అభిమానంతోనో చెప్పే గొప్పలు. నిర్మాతలకి సంబంధించినంతవరకూ దర్శకుల్లో ఉన్న రెండు రకాలూ: హిట్లిచ్చే దర్శకుడు, ఫ్లాపులిచ్చే దర్శకుడు. అదే ప్రేక్షకుల దగ్గరికొస్తే: మంచి సినిమాలు తీసే దర్శకుడు, చెత్త సినిమాలు తీసే దర్శకుడు. అంతే. వాళ్లు బార్నో, మేడో అనవసరం.

  • కుర్రా రంగారావు ఒకట్రెండు సినిమాలు దర్శకుడిగా కూడా తీశాడనుకుంటానండీ..అయితే ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు పెవీలియన్..షిండే అని నిన్నే ప్రేమిస్తే సినిమా దర్శకుడు కూడా..ఎన్నో సినిమాలకి “సహాయం” చేసి చివరికి 60 ఏళ్ళ వయసు లో దర్శకుడయ్యాడు అర్.బి.చౌదరి పుణ్యమా అని…!

 5. కొత్తగా ఆలోచించి, సృజనాత్మకంగా తీసేవారిని బోర్న్ డైరెక్టర్లు అంటున్నారేమో !!
  వాళ్ళు బాగా మంచి సినిమాలు తీసాక అలా అనిపిస్తుందేమో కానీ , నిజానికి బోర్న్ డైరెక్టర్లు అంటూ ఉండరని అనుకుంటున్నాను.

 6. Born direstors ఉండకపోవచ్చు కానీ, The Bourne identity కి మాత్రం ఒక దర్శకుడున్నడు. ఆయన పేరూ…. 😉

  • బార్న్ ఐడెంటిటీ డైరెక్టర్ పేరు నాకూ తెలీదు కానీ..బార్న్ ఐడెంటిటీ ని కాపీ కొట్టి తీసిన విజయేంద్ర వర్మ డైరెక్టర్ “స్వర్ణ సుబ్బారావు” మాత్రం కళ్యాణ్ రాం తో “హరేరాం” సినిమా తీసేటపుడు తన పేరు హర్షవర్ధన్ అని మార్చుకున్నాడని తెలుసు.. 😀


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: