వ్రాసినది: mohanrazz | 2009/09/11

పి.వి. ఆత్మకథ పై దాసరి సెటైర్

PV-DASARI

ఇది ఇప్పటి న్యూస్ కాదు. చాలా పాతది. పివి నరసింహారావు గారు తన ఆత్మ కథ (?) “INSIDER” అనే పేరుతో ఒక నవల వ్రాసాడు. నిజానికి ఇది ఆత్మకథ కాదు. నవల. ఆనంద్ అనే వ్యక్తి కథ. అయితే ఉన్నతభావాలు గల ఆనంద్ రాజకీయాల్లోకి రావడం, ఉన్నత శిఖరాలు అధిగమించడం, వాటికి తోడ్పడిన సంఘటనలు, వ్యక్తులు అన్నీ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది- ఇది పివి గారి స్వీయానుభవాల్లోనుంచి వచ్చిన కథ అని. ఇంకొక అడుగు ముందుకు వేసి కొందరు దీన్ని ఆయన ఆత్మకథగా పరిగణించారు. మొదట్లో ఇది ఆత్మకథనా లేక ఫక్తు ఫిక్షనా అన్న విషయం మీద స్పందించని పివి గారు – ఆ తర్వాత ఓ సారి – “ఇది ఆత్మకథ లాంటి నవల” అని చెప్పారు.

ఆంధ్రప్రభ దినపత్రిక లో అప్పట్లో దీని తెలుగు అనువాదం “లోపలి మనిషి” పేరు తో డైలీ సీరియల్ గా వచ్చేది. మొదట్లో కొంత చదివాను కానీ కథ లో కాస్త రాజకీయాలు ప్రారంభమయ్యాక కొంచెం బోర్ అనిపించి మానేసాను.

అయితే అప్పట్లో దాసరి నారాయణరావు గారు ఇచ్చిన ఒక స్టేట్‌మెంట్ మాత్రం అలా గుర్తుండి పోయింది. ఎవరో ఆయన్ని మీరు మీ ఆత్మకథ వ్రాస్తారా అని అడిగితే – “వ్రాస్తానో వ్రాయనో చెప్పలేను కానీ వ్రాయాలనుకుంటే మాత్రం ఆత్మకథ లాంటి నవలో లేక నవల లాంటి ఆత్మకథో వ్రాయను ధైర్యంగా ఆత్మకథే వ్రాస్తాను” అన్నారు. నా వరకు నేను ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ఏకైక తెలుగు వాడైన పివి ని చాలాకారణాల వల్ల అభిమానిస్తాను- తెలుగు వాడు ప్రధాని అయ్యాడనే కాదు, కొన్ని స్కాములు ప్రక్కన పెడితే- రాజకీయపరంగా దేశ ఆర్థికవ్యవస్థ కి జీవం పోసిన వ్యక్తిగా, బహు భాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా ఇంకా ఎన్నో కారణాలవల్ల ఆయనని అభిమానిస్తాను. అలాగే సినిమాల పరంగా దాసరి ని. నిన్న లక్ష్మీ టాక్ షో లో త్వరలో తన జీవితానుభవాల్ని గ్రంథస్థం చేయబోతున్నట్టు దాసరి గారు చెబితే ఈ పాత స్టేట్‌మెంట్ గుర్తొచ్చింది.


Responses

 1. hahahhah…..meeru mareenu, how can u compare daasari with p.v ……..

 2. <<>>

  మీరు నిజంగా ఇలా ఫీలవుతున్నారా?? 😦 నా వరకు దాసరి అంటే ఒక బి-గ్రేడ్ డైరక్టర్. వంద సినిమాలు తీసాడన్న మాటే కానీ క్వాలిటీ మత్రం నిల్. మంచివనుకున్న ఒకటో అరో కూడా మిగిలిన భాషా చిత్రాల స్ఫూర్తి. అతన్ని మేధావి అని పి.వి. పక్కన పెడితే మనసు చివుక్కుమంది.

  • దాసరి ని పివి తో సరిసమానంగా పోల్చే ఉద్దేశ్యం ఏ మాత్రమూ లేదు నాకు… కేవలం ‘దాసరి కూడా తన రంగం లో మేధావే’ అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం..అయితే పివి పై దాసరి సెటైర్ నాకూ అప్పట్లో చివుక్కుమనిపించబట్టే ఇంతకాలం గుర్తుందీ విషయం….

 3. నక్కను నాగలోకంతో పోల్చడమా !

 4. “దాసరి కూడా తన రంగంలో మేధావే” నేనైతే ఏ కోశాన ఒప్పుకోలేను. పా.ప. గారిని ఘొస్ట్ రైటర్ గా వాడుకున్నాడని చాలా ఖచ్చితంగా చెబుతారు. దాసరి గారికి సినిమా కథలని వినిపించడానికి అప్పట్లో జంకేవారని ఉవాచ.
  దాసరి సినిమా రంగంలో ఉచ్చదశలో ఉన్నదశ తెలుగుసినిమాకి క్షీణ – హీన దశ.

  పోనీ పొలిటిషియన్ గా ఏం పొడిచాడో నాకిప్పటికీ అర్థం కాదు.

 5. dasari tana rangam lo anubhavagnudu ante.pv bahu mukha pragnasaali.rajakeeya rangam lo vunnata viluvalu paatinchina vyakti.alaanti vaadu maroka jati lo putti vunte intakante rettimpu peru pratistalu sampadinchi vundevaaru.alaanti vyaktini vimarsinche arhatha dasariki vundaa.?nonsense.

 6. meeku chala vishyalu “alane gurthuvundi potayi” anukuntunnna 🙂

  • ha ha good catch 🙂
   అయినా..’అలా గుర్తుండిపోయిన’ అంశాలు పంచుకోడానికే బ్లాగు పెట్టాను మరి… 🙂

 7. mee blog follow avutuntanu rooju…different news to update chestunatru roju….good work…meeku time ela saripotundi to update an article or two everyday… 🙂

 8. పీవీ ఆత్మకథ రాస్తే చాలామంది చరిత్రలు బయటపడుండేవేమో (ఆయన చరిత్రతో సహా). అబద్ధాలు, అర్ధసత్యాలతో ఆత్మకథ రాసేబదులు అసలు రాయకుండా ఉండటం మెరుగనుకుని ఊరుకుని ఉంటాడాయన.

  ఈ సందర్భంగా – పీవీ ప్రధాని పీఠాన్ని వాజపేయికి అందించి తప్పుకున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు గుర్తొస్తున్నాయి. దేశ భద్రత, రక్షణకి సంబంధించిన కొన్ని విషయాలపై విలేకర్లు ఆయన్నేవో ప్రశ్నలేస్తే, ‘ఆ వివరాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పాను. మీకు చెప్పనవసరం లేదు’ అన్నాడు క్లుప్తంగా. ఆ తర్వాత కొన్నేళ్లకి పీవీని ఏదో సందర్భంలో పొగుడుతూ వాజ్‌పేయి అన్న మాటలు: ‘పోఖ్రాన్ అణుపరీక్షలు మేం చేపట్టగలిగామంటే, దానికి పీవీ ప్రభుత్వం వేసిన బలమైన పునాదే కారణం’. పీవీ మాటల్లో అర్ధం అన్నేళ్లకు తెలిసింది నాకు.

  • ఐక్యరాజ్యసమితి లో ఏదో విషయం మీద భారత్ ని రెప్రెజెంట్ చేయడానికి ఎంతోమంది కాంగీయులని కాదని వాజ్ పేయి ని పంపించాట్ట అప్పట్లో. అంతర్జాతీయ వేదికమీద వాదన వినిపించడానికి పంపేటపుడు నేత ప్రతిపక్షం వాడా మనపక్షం వాడా అన్నది కాదు చూడవలసినది అని ఇంత స్పష్టంగా చేతలతో చూపించిన నాయకుడు ఈయనేనేమో!

 9. Inspite of PV’s so many initiatives and contributions none of the congress leaders have recognised him as he was supposed to be.
  Even YSR has not named none of his projects on PV’s name though he belongs to Andhra, everyproject is rajiv, indira and I think now everything in Andhra will be named on YSR.

 10. India is here today only because of initiatives taken by P.V. But unfortunately Congress do not want to memorise his Era only due to the reason that it is the only black period for the Gandhian family after Independence. Bofors case progress left black mark on Rajiv for which Sonia took revenge after Congress lost election.
  Unfortunately no congress C.M dare to mention P.V. name as they are scared of losing the seat very next day!!

 11. // రాజకీయపరంగా దేశ ఆర్థికవ్యవస్థ కి జీవం పోసిన వ్యక్తిగా, బహు భాషా కోవిదుడిగా, సాహితీవేత్తగా ఇంకా ఎన్నో కారణాలవల్ల ఆయనని అభిమానిస్తాను.

  నిస్సందేహంగా ఆర్ధిక వ్యవస్థకు జీవం పోసిన మహానుభావుడు.బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఆత్మకధ ఉన్నదున్నట్లుగా రాస్తే ఎంత మంది జీవితాలు బట్టబయలయ్యేవో !!

 12. పీవీ తెలుగు వాడైనందుకు నేను చింతిస్తున్నాను. అదే ఏ తమిళియనో అయితే ఖచ్చితంగా చాలా గొప్ప పేరు వచ్చి ఉండేది. ఈ పాటికి చాలా చోట్ల ఆయన పేరే వినిపించేది.

  గురజాడ అన్నట్టు “మనవాళ్ళుత్త వెధవాయలోయ్”. పాపం ఆయన తప్పుచెప్పారు. ఉత్త వెధవాయ్ లు కాదు. వెధవామ్ముప్పాతికాయ్ లు. We don’t deserve such people as PV. అందుకే అలాంటి నాయకులు మళ్ళా పుట్టరు. కానీ రా’చొల్’ గాంధీలు మాత్రం పుడతారు.

  • అబ్బ ఎంత కరెక్ట్ గా చెప్పారండి. నేనూ ఇంచుమించు గా ఇదే ఉద్దేశ్యంలో రాద్దామనుకున్నాను, మీరే రాసేసారు. ఆ రా’చొల్’ గాంధి ల పేర 100 ప్రోజెక్ట్ లు, ఇంకో 100 వీధులు, నగరాలు వస్తాయి.

 13. మోహన్ రాజ్,

  నేను మీ బ్లాగ్ ని ప్రతి దినము చూస్తూవుంటాను.మీరు రాసిన అన్నీ విషేషాలు చదివాను చాలా బావుంటాయి మోహన్.మీ ఒక స్నేహితుడు గిరిధర్ రాజు “కెరటం” రాశారని చెప్పారు అతని క్లాస్మేట్ అమెరికా లొ నా సహోద్యోగి.అతని పేరు ఈశ్వర్ రాజు.మీ బ్లాగ్ ఇతనికి చూపించాను.బ్లొగు లొని కొన్ని మి కాలేజ్ కబుర్లు అన్నీ మీరు చెప్పినట్టుగా నేను చెప్ప..చాలా సంతొషపడ్డాడు.మీరు ఇలాగే అద్భుతంగా రాస్తూ వుండాలని కోరుకుంటూ..

  మాది ప్రొద్దుటుర్ కడప జిల్ల..మీ ఈ మైల్ ఇవ్వండి వీలైతే..

  చంద్ర

 14. పీ.వీ. నరసిహరావు గారు ఒక్క మహొన్నతమైన వ్యక్థి
  గీతా చార్య గారు చెపినట్లు ఆయన తమిల నాడు లొ పుట్టి వుంటె ఆయన చెయని ఆయనకి సంబందము లెని కుంబకొణాలలొ ఎవరు ఆయనని ఆనటానికి సాహసించెవారు కాదు.

  మన తెలుగు వారికి అందునా మన తెలుగు రాజకియ నాయకులకి మనవారిని ఎలా కించపరచాలి ఎలా నలుగురిలొ నవ్వులు పాలు చెయాలి అని ఆలొచిస్తారె కాని అయ్యొ మనవాడె మన దెశానికి ప్రాతినిద్యం వహించాడె దిక్కు లెని ఇందిరాగాంది కుటుంబాని ఒక దారి లొకి తిసుకు వచాడె ఎమి తెలియని రాజివు గాందిని మనచి రాజకియ నాయకుడిగా అందరికి పరిచయం చెసాడె
  దికుమొకు లెని మన దెశ కజానాని కాపాడినాడె ప్రపంచ పటములొ మనకి ఒక మంచి స్తానము కలిపించాడె అనె రాజివుగాంది చెసిన తప్పులు తన మిద వెసుకున్నాడె అన్నది కుడా చుడరు యెఫ్ఫుడు గొతికాడ నక్క లా వుండటమె మన వారికి తెలిసింది


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: