వ్రాసినది: mohanrazz | 2009/09/12

కుర్రాడు – పొల్లదవన్ – రైడ్ -చిరుత -బైసికిల్ థీఫ్ : ఏంటి వీటి మధ్య సంబంధం?

kurradu

కుర్రాడు- వరుణ్ సందేశ్ కొత్త సినిమా. ధనుష్ నటించిన పొల్లదవన్ అనే తమిళ్ సినిమా కి రీమేక్. ధనుష్ రజనీకాంత్ కి అల్లుడయ్యాక కొంచెం క్రేజ్ కోసం దర్శక నిర్మాతలు రజనీకాంత్ పాత సినిమా(1980s)  టైటిల్ ఒక దాన్ని పట్టుకొచ్చి అదే పేరు ఈ సినిమాకి పెట్టారు- పొల్లదవన్ అని. పొల్లదవన్ కథేంటంటే – ఓ కుర్రాడుంటాడు.ఉద్యోగం సద్యోగం లేదు. కానీ వాడికి బైక్ కొనాలి, బైక్ వేసుకుని తిరగాలి అని కోరిక. కానీ వాళ్ళ ఫాదర్ ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఓ సారి వాళ్ళ నాన్న తో పోట్లాడి మరీ బైక్ కొనిపించుకుంటాడు. ఆ తర్వాత కుర్రాడికి తెగ కలిసొచ్చేస్తుంది. బ్యాంక్ ఉద్యోగం వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఈ లోగా ట్విస్ట్ ఏంటంటే ఒక లోకల్ గూండా వేరే గొడవలో ఈ బైక్ తీసుకెళతాడు. ఈలోగా బ్యాంక్ ఉద్యోగం పోతుంది (హి హి బ్యాంక్ ఉద్యోగం అంటే పర్మనెంట్ జాబ్ అనుకున్నారా?? కాదు..ప్రైవేట్ బ్యాంక్ ఏమో 😀 ). గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తుంది. మళ్ళీ గూండా తో పోట్లాడి తన బైక్, జీవితం లోని మిగతా అంశాలు తాను ఎలా తిరిగి తెచ్చుకున్నాడనేది మిగతా కథ.

పొల్లదవన్ కి అధికార రీమేక్ ఈ సినిమా అయితే ఆ మధ్య వచ్చిన “రైడ్” సినిమా ఇదే కథ తో రూపొందుతోందని న్యూస్ వచ్చి “కుర్రాడు” నిర్మాత కేస్ వేసి- పొల్లదవన్ లో సీన్లేవీ “రైడ్” లో మక్కి కి మక్కి దించకుండా జాగ్రత్త పడ్డారు. అయినప్పటికీ అందులో ఇలాంటి బైక్ థ్రెడ్ ఒకటుంటుందని విన్నాను, నేనైతే ఆ రైడ్ సినిమా చూడలేదు. సరే ఇక “కుర్రాడు” టైటిల్ ని మొదట్లో రాం చరణ్ మొదటి సినిమా కి అనుకున్నార్ట. అయితే “కుర్రాడు” తో సహా చాలా టైటిల్సే కన్సిడర్ చేసారు “చిరుత” అని ఫైనలైజ్ చేయడానికి ముందు. చివరికి “చిరు”త అందరికీ నచ్చడం తో అదలా కన్‌ఫర్మ్ అయిపోయింది. ఇక అప్పట్లో వచ్చిన ఒక గాసిప్ ఏంటంటే- చిరుత తర్వాత పొల్లదవన్ రీమేక్ చరణ్ తీయొచ్చు అని. అయితే ఆ గాసిప్ గాసిప్ గానే మిగిలిపోయింది . చిరుత హీరోయిన్ కి కూడా ఆ తర్వాత సినిమాలేమీ రాలేదు కానీ చివరికి మళ్ళీ ఈ కుర్రాడి తో జతకట్టింది.

అదీ- కుర్రాడికి-పొల్లదవన్ కి- చిరుతకి-రైడ్ కి ఉన్న సంబంధం. ఇక బైసికిల్ థీఫ్ లాంటి 1940s క్లాసిక్ ని పట్టుకొచ్చి ఈ స్రవంతి లో కలిపేసేయడం భావ్యం కాదు కానీ- పొల్లదవన్ కి స్ఫూర్తి బైసికిల్ థీఫ్ అని పొల్లదవన్ రిలీజ్ అవక ముందు కొన్ని గాసిప్స్ , రిలీజైన తర్వాతా కొన్ని అనాలసిస్ 😀 వచ్చాయి. బహుశా బైసికిల్ థీఫ్ పొల్లదవన్ కి “స్ఫూర్తి” అయి ఉండవచ్చు కూడా!

ప్రకటనలు

Responses

  1. bicycle theieves tho mana cinema comparision??

    but its a good attempt

  2. ఈ సినిమాలకు స్పూర్తి బైసికిల్ థీవ్స్ కాదు. బీజింగ్ బైసికిల్స్ అనే చైనీస్ చిత్రం.

  3. బీజింగ్ సైకిళ్లకి సైకిల్ దొంగ ప్రేరణయ్యుండొచ్చు 😀

  4. మొత్తానికి అందరూ దొంగలే 😉

  5. సంభందం ఏమో గాని.. తమిల్ లొ ఐతే బాగానే ఆడింది.. తెలుగు లొ ఎలా ఉంటుందో.. లెట్స్ సీ.. 😉

  6. ‘పొల్లాదవన్’ అంటే భయంకరమైనవాడు, భయపెట్టేవాడు అని కూడా అర్థముంది. కానీ ‘కుర్రాడు’ కి అంత సీను లేదే !!!
    పొల్లాదవన్ సినిమా తమిళ్ లో యావరేజ్ గా అడింది. కానీ సినిమా నాకైతే అస్సలు నచ్చలేదు. అదే స్టోరీ తెలుగు లో తీస్తున్నరంటే..హ్మ్మ్మ్….i am disappointed 😮


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: