వ్రాసినది: mohanrazz | 2009/09/14

కమల్ హాసన్ స్పాంటేనిటీ

           

మొన్న “ఈనాడు” సినిమా ప్రమోషన్ కోసం టివి9 లో వచ్చాడు కమల్(శృతి హాసన్ కూడా వచ్చింది). కొంతమంది వ్యూయర్స్ కాల్ చేసారు. వాటికి కమల్ తన సహజ శైలి లో సమాధానాలిచ్చాడు. వాటిల్లో ఒకటి మాత్రం భలే నచ్చింది నాకు.

అది చెప్పే ముందు ఇంకో విషయం చెప్పాలి. కమల్ గొప్ప నటుడు, మంచి నటుడు, ఆయన నటన కొన్ని సినిమాల్లో న భూతో న భవిష్యత్.. కాదనను..కానీ కమల్ హాసన్ ఫ్యాన్స్ అంటూ మాట్లాడిన వాళ్ళంతా “ఇంగ్లీష్ లో నే మాట్లాడటానికి తంటాలు పడటం” నా దృష్టిని దాటిపోలేదు. కమల్ క్లాస్ హీరో కాబట్టి (నిజానికి-కమల్ ని అభిమానించే వాళ్ళలో మాస్ జనాలు కూడా బానే ఉంటారు), కమల్ లాంటి క్లాస్ హీరో ని మనం అభిమానిస్తున్నాం కాబట్టి, మనం కూడా క్లాస్ కాబట్టి- మన “క్లాస్” జనాలకి అర్థమవాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని నిర్ణయించేసుకుని – తడబడుతూ..సెంటెన్స్ ఫ్రేం చేసుకుంటూ లేదా ఫ్రేం చేసుకున్న సెంటేన్స్ ని అక్కడ అప్పజెప్పేస్తూ మాట్లాడినట్టనిపించింది. కమల్ హాసనే శుభ్రంగా తెలుగు లో మాట్లాడుతుంటే న్ని తంటాలు పడుతూ మరీ.. మనం ఇంగ్లీష్ లో మాట్లాడటం ఎందుకో!!!

సరే, ఈ విషయాన్ని ప్రక్కన పెడితే కమల్ టివి షోల్లోనూ ఏదైనా లైవ్ ప్రోగ్రాంస్ లోనూ కనబరిచే స్పాంటేనిటి చాలా బాగుంటుంది. ఒకాయనెవరో కాల్ చేసి- “Sir, if I have to touch the feet of one person in this world for his sheer.. (ఇక్కడేవో మూడు నాలుగు పదాలు చెప్పాడు-కానీ అవి నాకు గుర్తు లేవు)..it will be only you and no one else అన్నాడు. దానికి కమల్ అన్నాడు….”Thanks for that..but instead of touching my feet, if you touch your own feet, it will keep you healthy :)”

ప్రకటనలు

Responses

 1. // కమల్ లాంటి క్లాస్ హీరో ని మనం అభిమానిస్తున్నాం కాబట్టి, మనం కూడా క్లాస్ కాబట్టి- మన “క్లాస్” జనాలకి అర్థమవాలంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి అని నిర్ణయించేసుకుని – తడబడుతూ..సెంటెన్స్ ఫ్రేం చేసుకుంటూ లేదా ఫ్రేం చేసుకున్న సెంటేన్స్ ని అక్కడ అప్పజెప్పేస్తూ మాట్లాడినట్టనిపించింది.

  🙂

  //Thanks for that..but instead of touching my feet, if you touch your own feet, it will keep you healthy

  🙂 🙂 🙂

 2. చలోక్తి బాగుంది

 3. 😀

 4. సౌమ్యా!! కామెంటు తొందరగా

  • హేవిటీ ప్రవీణ్ లాంటి కథకులు నా కామెంట్ కోసం ఎదురుచూసేయడమే…ఏమి నా భాగ్యమూఊఊఉ…. !!!!! 😀

   • ఎవడు కామెంటితే బ్లాగుల్లో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఆవుతో వాడే పండు గాడు 🙂

    • ఆ పండుగాడు నేనా, నువ్వా? నాకర్థంకాలేదు
     ఒకవేళ ‘నువ్వే’ అని అనుకుంటే గనక నీకంత సీను లేదు.
     ఒకవేళ నన్నే అంటే గనక ‘ధన్యవాదాలు’. నేను నా గురించి అలా అనుకోకపోయిన, నువ్వనుకున్నందుకు!!!

     • అతని స్టోరీస్ మీద కామెంట్స్ చేసిన సౌమ్య మీరేనా……… చాల గ్రేట్ అండి.నేను అలా కామెంట్ రాద్దామని మరలాఎందుకులే +ve తీసుకోకుండా బ్యాక్ ఫైర్ అవుతాడేమో నని అంత ధైర్యం చేయలేదు.

      నాకు కమలహాసన్ గురించి అంత ఇంటరెస్ట్ లేదు కాబట్టి నేను ఎం చెప్పలేను.

      • వినయ్!! నువ్వు తెలుగు లో రాయడం ఎప్పుడు నుండి మొదలెట్టావ్ ?

       • hahaha…………..gud satire man……….from now i will do this……..

      • అవును నేనే ఆ సౌమ్య ని…backfire అయితే నేను double backfire అవుతాను. 🙂

 5. అవును, కమల్ హాసన్ స్పాంటేనిటీ చాలా బాగుంటూంది. ‘దశావతారం’ లో కూడా చివరి లో అంటాడు గా…”దేముడు లేడని నేనెక్కడన్నాను, ఉంటే బాగుంటుంది అన్నాను” అని. of course అది క్రేజీ మోహన్ డైలాగ్ అనుకోండి. కమల్ హాసన్ కి suit అవుతుందనే అలా రాసారేమో!!! 🙂

 6. ఏమైనా కాని నా వైరాగ్యపు బుద్ధి ని మార్చుకోవడం కష్టమే !!
  ఒక్కసారి బ్లాగ్ లోకి ఎంటర్ అయితే నేనేం మాట్లడుతుననో నాకే తెలియదు 🙂

  • ఒక్కసారి బ్లాగ్ లోకి ఎంటర్ అయితే నేనేం మాట్లడుతుననో నాకే తెలియదు>>
   hmm..మీరేమి మాట్లాడుతున్నారో మాక్కూడా తెలీట్లేదు..just kidding 😀

   • mmmmmmm excellent reply………..

   • మోహన్ కి నేను పూర్తి అంగీకారాన్ని, మద్దతు ను తెలియపరుస్తున్నాను 🙂
    kidding కాదు నిజంగానే 😀

    • తెలియాలంటే కదలు చదవండి.. చదివించండి 😀

 7. అవునా ! అందుకే నేమో నా కధల్లో చాలా సీన్లు వుంటాయి

 8. 😀

 9. 😉 😉 😉


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: