వ్రాసినది: mohanrazz | 2009/09/15

కొత్త క్లైమాక్స్ వ్రాయడం ఎలా???

 

సినిమాకి క్లైమాక్సే ఆయువుపట్టు అంటూంటారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉన్న సినిమాలు బాగా హిట్టయే అవకాశాలూ ఎక్కువే. కానీ మనకి ఉన్న కథల్లో మరీ వైవిధ్యం ఉండట్లేదు కాబట్టి అదే రీతిలో క్లైమాక్సుల్లోనూ మొనాటనీ కనిపిస్తోంది. అయితే ఒక తరహా కథ ని చెబుతున్నపుడు..కథ బేసిక్ పాయింట్ జనాలకి పరిచయమున్నదే అయినపుడు ఆ కథ కి అప్పటివరకూ రాని కొత్త క్లైమాక్స్ ఇవ్వడం ద్వారా మొత్తం కథాస్వరూపాన్నే మార్చేయొచ్చు. అలా గనక ఒక కొత్త క్లైమాక్స్ ని ఆల్రెడీ తెలిసిన కథకే మీరు ఇవ్వగలిగితే మీరు సినీ కథా రచయిత అయిపోవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే కథ అలకగానే పండగ కాదు, దాన్ని మార్కెట్ చేసుకొని తెరంగ్రేటం చేయడానికి పెద్ద కసరత్తే చేయాల్సొస్తుంది. సరే, ఆ కసరత్తులూ వ్యాయామాలూ ప్రక్కన పెడితే…

 అప్పటి వరకు మునుపటి సినిమాల్లో చెప్పబడని కొత్త తరహా క్లైమాక్స్ సృష్టించినపుడు సినిమా విజయం సాధించే సందర్భాలే ఎక్కువ. ఇక క్లైమాక్స్ తెలీకుండా బిగినింగ్ సీన్ మనకి తట్టినప్పటి సందర్భం తో పోలిస్తే-క్లైమాక్స్ ఏం చెప్పాలనుకున్నాం అనేది మనకి తెలిస్తే కథ ని వెనక్కి అల్లుకోవడం బహుశా ఈజీ అనుకుంటా. బిగినింగ్ సీన్ మాత్రమే ఉంటే క్లైమాక్స్ దాకా కథని డెవెలప్ చేసుకోవడం కొంత కష్టమే. ఉదాహరణకి ప్రేమ దేశం సినిమా ని తీసుకుంటే – కదిర్ కి ఒక కొత్త క్లైమాక్స్ ఆల్రెడీ తట్టింది. అప్పటిదాకా వచ్చిన హీరోలు ఇద్దరున్న అన్ని ట్రయాంగులర్ లవ్ స్టోరీల్లోనూ ఒక హీరో త్యాగం చేయడమో, లేదా చనిపోవడమో జరుగుతూ వచ్చింది. అంతకి మించి ముందుకి వెళ్ళలేకపోయారు మన రచయితలు. అందుకే ఒక్కసారి- కదిర్ దీనికి “ఫ్రెండ్ షిప్” కలరిచ్చే సరికి -ఈ సినిమా యూత్ ని ఒక ఊపు ఊపేసింది. అయితే క్లైమాక్స్ తెలిసాక కదిర్ కథని వెనక వైపుకి డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడనుకుంటా- ఈ సారి ఈ సినిమా చూస్తే గమనించండి- టబు ని ఒకసారి వినీత్ కాపాడతాడు, నెక్స్ట్ టైం అబ్బాస్ కాపాడుతాడు. మళ్ళీ ఒక సీన్ లో హీరోయిన్ వినీత్ కి దగ్గరయితే ఆ తర్వాత సీన్లో అబ్బాస్ కి దగ్గరవుతుంది. ఇంతే కథ. చివర్లో క్లైమాక్స్ పాయింట్!

 

సరే క్లైమాక్స్ తెలిస్తే కథ అల్లుకునే సంగతి ని ప్రక్కన పెడితే- తెలిసిన కథకే -ఒక కొత్త క్లైమాక్స్ కానీ కొత్త పాయింట్ కానీ జత చేసి చెప్పినపుడు దాదాపు 99% సార్లు సినిమాలు విజయవంతమయాయి. ఉదాహరణకి హీరో సామాజం కోసం ఏదయినా చేయాలని తపనపడే/పాటుపడే తరహా పాత్ర ఉన్న ఒక కథ తీసుకుందాం. ఇలాంటి తరహా కథల్లో ఇప్పటిదాకా వచ్చిన క్లైమాక్సులు/స్టోరీ పాయింట్లు ఇవీ-


1. హీరో (చెప్పిన మాటలవల్ల/చేసినపనులవల్ల) వల్ల ప్రజలు/పాత్రలు చైతన్యవంతులు అయి మారిపోవడం – రుద్రవీణ etc..
2. హీరో దొంగతనాలు చేసో (రాబిన్ హుడ్ తరహాలో) లేదా ఉన్నోళ్ళ డబ్బు కొట్టేసో – ప్రజలకోసం హస్పిటలో, స్కూలో లేదా ఇంకోటో కట్టివ్వడం లేదా వాళ్ళకే డబ్బులు పంచడం -భలే దొంగ, జెంటిల్మేన్, గణేష్ etc..
3. సమాజానికి చీడపురుగులయిన వాళ్ళని హీరో చంపేయడం, ఏరివేయడం- భారతీయుడు, బెబ్బులి పులి, ఠాగూర్, ఇంకా చాలా.

ఇలాంటి తరహా చిత్రాలకి ఇవి కాకుండా (ఇంకొన్ని ఆల్రెడీ వచ్చిన్వై కాకుండా) కొత్త పాయింట్ లేదా క్లైమాక్స్ మీరు చెప్పగలిగితే మీ కథ పాసయ్యే ఛాన్సులే ఎక్కువ. ఇంక ఇవి కాకుండా వేరే ఏముంటాయి పాయింట్లు అంటారా…అక్కడే ఉంది మరి అసలు సరుకంతా… సిటిజన్ సినిమా చూస్తున్నపుడనుకుంటా క్లైమాక్స్ విన్నాక – ఈ మూడు కేటగరీల్లోనూ పట్టకుండా కొంత వెరయిటీ క్లైమాక్స్ చూపించాడే అనిపించింది. జనాలకీ ఎక్కింది. కొత్త క్లైమాక్సంటే గ్రహాంతరాల నుంచి ఊడి పడక్కర్లేదు. ఉన్నంత లో – ఇంతకు వచ్చిన వాటికి భిన్నంగా ఉండి కాస్త కన్విన్సింగ్ గా ఉంటే చాలు- బ్రహ్మరథం పట్టడానికి ప్రేక్షకులు రెడీగానే ఉంటారు.

ప్రకటనలు

Responses

 1. విభిన్నమైన క్లైమాక్సంటే ఇలాగుండొచ్చా? సరదాకేనా అని అడిగేరు.. 🙂 🙂 చదివాక మీరే చెప్పండి…

  1)హీరో (చెప్పిన మాటలవల్ల/ చేసినపనులవల్ల) వల్ల ప్రజలు/పాత్రలు అప్పటిదాకా ఉన్న తెలివి కూడా పోయి ఒకరి వీణ ఒకరు వాయించటం.ఆ తీగలన్నీ తెగిపోయాక హీరోని చితగ్గొట్టటం. శుభం కార్డు పడటం etc -( వీణతో వెఱ్ఱి లేక తంత్రితో తన్నులు – సినిమా టైటిలు)

  2)ముందు ఉన్నోళ్ళ దగ్గర కొట్టేసి, జనాలకు పంచేసిన హీరో, సివరాఖరికి మోసాలు చేసి, లేనోళ్ళ దగ్గర కంబళ్ళు, సత్తు సామానూ అవీ కొట్టేసి ,అమ్ముకుని వచ్చిన డబ్బుతో దుబాయికి పారిపోవటం, తర్వాత తన బంధుమిత్రులను మాత్రమే దుబాయికి తీసుకునిపోవటం, జనాలు అసలు అలాఎందుకు చేసాడా అని ఆచ్చెర్యపోటం, భావితరాలకు అది పాఠ్యాశం కావటం etc etc. శుభం కార్డు పడటం

  3)ఇంటర్వెల్లు ముందు కొంత మంది దుర్మార్గులను చంపేసిన హీరో, ఇంటర్వెల్లు కాగానే సమాజానికి మంచి చేసేవాళ్ళని చంపెయ్యడం, ఏరివేయడం, ఆపైన ప్రజలందరికీ దుర్మార్గోపదేశం – అంటే దుర్మార్గాలు ఎలాచెయ్యాలో ఒక మైక్రోచిప్పులో పెట్టి , బలవంతపు ఆపరేషన్ ద్వారా బుర్రలోకెక్కించ్చెయ్యటం, మంచివాళ్ళకు డిప్రెషను పిల్లులు మింగించటం. శుభం కార్డు పడటం

  4)హీరోగారు సివరాఖరికి టైము కాప్సూలు ఒకటి తయారు చేసి, మంచివాళ్ళందరినీ భారత యుద్ధ కాలానికి తీసికెళ్ళి – ఇది మన ఆంధ్రుల సినిమా కాబట్టి, ఆంధ్రులు కౌరవుల వైపు పోరాడారు కాబట్టి, ద్రోణుడి అక్షౌహిణిలో కలిపెయ్యటం. ఆ టైము కాప్సూల్లోకి తస్కరించిన అర్జునుడి గాండీవం, కర్ణుడి కుండలాలు, కృష్ణ భగవానుడి సుదర్శనం ..ఇల్లా అన్నమాట, అన్నీ తెచ్చి రైతుబజారులో దొంగతంగా అమ్ముకోవటం – వచ్చిన డబ్బుతో తాగి తందనాలడటం. శుభం కార్డు పడటం.

  5) ఇంటర్వెల్లు ముందు తనకున్న ఐదుగురు పిల్లలలు, పెంచుకున్న ఐదు కుక్కలనీ ప్రాణప్రదంగా చూసుకోవటం. ఇంటర్వెల్లు తర్వాత సరదాగా కుక్కలకు ఒక్కో రకమైన ట్రైనింగు ఇచ్చి ఐదుగురు పిల్లల కండలు వివిధ రకాలుగా పీకిచ్చటం.శుభం కార్డు పడటం

  ఇలా ఇంకో సహస్రమైన అవిడియాలున్నాయండీ మోహనరాజ్జు గారూ! పేటెంటు తెచ్చుకోటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ పని కాగానే ఈ అవిడియాలన్నిటికీ పెట్టుబడి పెట్టి సినిమా తియ్యటానికి నేను రెడీ, విజయవంతం చేసే బాధ్యతా, బ్రహ్మ(భ్రమ)రథం పట్టించే బాధ్యతా మటుకు మీదే. 🙂 🙂

  • ప్రతిసారీ “శుభం కార్డు పడటం” మొనాటనీ ఐపోయిందన్నయ్యా… 🙂 నువ్వుముందిక్కడనుంచి మొదలెట్టు. రధానికి ఏర్పాట్లు నేనుచూసుకుంటాగా.

  • @ Vamsi,

   gud one..second one and third one are awesome 🙂

   -On a serious note – //ఇంతకు వచ్చిన వాటికి భిన్నంగా ఉండి కాస్త కన్విన్సింగ్ గా ఉంటే చాలు /
   pls underline here: కాస్త కన్విన్సింగ్ గా ఉంటే ..!!!వైవిధ్యంగా ఉండటమొకటే సరిపోదు..కన్విన్సింగ్ గా ఉన్నపుడే అది ప్రేక్షుకలని ఆకట్టుకుంటుంది..

 2. హిట్ అంటే అంచనాలని రిచ్ అవ్వడం.

  ఇలా ఇస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అని ఎవరికీ తెలియదు. అవుతుందేమో అని ఒక ప్రయత్నం చేయడమే.

  ప్రయత్నం సిన్సియర్ గా చేస్తే హిట్ కాకపోయినా పేరు మాత్రం వస్తాది.

  ఈ రోజుల్లో సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో కలిసి రావాలి.

  • //ఇలా ఇస్తే కచ్చితంగా హిట్ అవుతుంది అని ఎవరికీ తెలియదు. అవుతుందేమో అని ఒక ప్రయత్నం చేయడమే. //

   కరక్టే..కానీ ఆల్రెడీ తీసిన పాయింటే తీసి హిట్టు కొట్టడం చాలా కష్టం..ఎందుకంటే ప్రేక్షకులు ముందేం జరగబొతోందో సులభంగా ఊహిస్తారు..అలాంటుపుడు కూడా ప్రేక్షకులకి ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాలంటే చాలా కష్టం. దానితో పోలిస్తే కాస్త కొత్త పాయింట్ చెప్పడం ఈజీ. కొత్త పాయింట్ ఉన్న సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పొరపాట్లని సైతం ప్రేక్షకులు ప్రక్కన పెట్టేస్తారు..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: