వ్రాసినది: mohanrazz | 2009/09/16

99 ఫ్లేవర్స్ ఇంకోసారి

 

 ఆ మధ్యెపుడో 17 లక్షల బడ్జెట్ లో హైదరాబాద్ బ్లూస్ తీసి దాన్ని ముందు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించి అక్కడ “విజయవంతమయాక”, తద్వారా సినిమాకు కొంత పబ్లిసిటీ వచ్చాక, మెయిన్ థియేటర్స్ లోనూ ప్రదర్శించి కమర్షియల్ గా కూడా హిట్ చేసి కాసిని డబ్బులు సంపాదించొచ్చనే కాన్సెప్ట్ ని నగేష్ కుకునూర్ మొదలెట్టాక చాలా సినిమాలే వచ్చాయి ఆ పంథాలో. హైదరాబాద్ బ్లూస్ తర్వాత డాలర్ డ్రీమ్స్, గ్రీన్ కార్డ్ ఫీవర్, ఫ్లేవర్స్ గట్రా గట్రా చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్లూస్ తరహాలో నే కమర్షియల్లీ ప్రాఫిట్ వెంచర్సా అంటే డౌటే. శేఖర్ కమ్ముల ఆ మధ్య ఇంటర్వ్యూ లో చెప్తున్నాడు- డాలర్ డ్రీమ్స్ కి ఇప్పటికీ నాకు ఎకనామికల్ గా “బ్రేక్-ఈవెన్” రాలేదు అని. అయితే మొదటి సినిమా కి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నాడు కాబట్టి ఆ మాత్రం మార్జినల్ లాస్ ఉన్నా భరించేయొచ్చనుకుంటా. గ్రీన్ కార్డ్ ఫీవర్ అని ఇంకో సినిమా వచ్చింది- నగేష్ కుకునూర్, శేఖర్ కమ్ముల మాదిరిగా ఇతనూ తెలుగువాడే ‘బాలశేఖరుని ‘ అని. ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ని అనో అలా ఇంకేదో చెప్పాడు. బట్ ఆ సినిమా అటు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో కానీ ఇటు కమర్షియల్ గా కానీ పెద్ద ప్రభావమంటూ చూపలేదు. సరే ఇవి కాకుండా ఇంకో సినిమా వచ్చింది Flavours అని. రాజు-కృష్ణ అని దర్శక ద్వయం. వాళ్ళు ఏదో ఇంటర్వ్యూలో చెప్పారప్పట్లో- ఇప్పటిదాకా వస్తున్న ఈ తరహా సినిమాలన్నీ ABCD (American born confused Desi) గురించో, డాలర్ లెక్కల్ గురించో వస్తున్నాయి. కాబట్టి మేము తీసే సినిమా ఈ కేటగరీలో పడకుండా ఒక డీసెంట్ ఎంటర్టైనర్ ఇద్దామని మా ప్రయత్నం అని.


ఈ సినిమా బాగానే ఉంటుంది. ఈ సినిమాలోని ఒక సీన్ ని “వెన్నెల” సినిమాలో యాజిటీజ్ గా వాడుకున్నారు. అలాగే ఈ సినిమాలో ఇంకో సీన్ నాకు బాగా ఇష్టం. (US లో) ఉద్యోగాల్లేక ఖాళీ గా ఉన్న టైం లో – రూం లో మాట్లాడుకుంటూ- ఒకడంటాడు- “అయినా ఈ జాబ్స్ గట్రా ప్రక్కన పడేసి ఇంక వేరే ఏమయినా చేద్దాం” అని. ఏం చేద్దాం..ఏం చేద్దాం అనుకుంటూ..పోనీ బిజినెస్ పెడదామా అంటాడొకడు. ఏం బిజినెస్ అంటే ఇండియన్ రెస్టారెంట్ అంటాడు..ఇంకాస్త తర్జనభర్జన తర్వాత ఇది వర్కవుటయ్యే ప్లాన్ కాదు అని తేల్చేస్తాడు. అప్పుడింకొకడంటాడు- పోనీ సినిమా తీద్దాం అని. అనగానే ప్రక్కనుండేవాడు అంటాడు- “అయినా మనలాంటి వెధవలు సినిమా తీస్తే చూసేటోళ్ళు కూడా ఉంటారా???” . అలా అని అందరూ ఒక్క క్షణం పాజ్ ఇచ్చి కెమెరావైపు చూస్తారు. అంటే సినిమా చూస్తున్న మన వైపన్నమాట 🙂 జనాలు కూడా ఒక్క క్షణం ప్రక్కున నవ్వారు, వార్నీ, వంద రూపాయలిచ్చి వీడి సినిమా చూడటానికి వస్తే మన మీదే సెటైర్ వేసాడే అని 😀 . ఈ ఫ్లేవర్స్ సినిమా బాగానే ఆడింది. ఆ తర్వాతెపుడో దర్శకుల ఇంటర్వ్యూ చదివితే తెలిసింది ఇంకో విషయం 🙂 – వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చదివింది మా కాలేజీలోనే అనీ, నేను ఎంటరవడానికి ఓ నాలుగైదేళ్ళ ముందే ఇంజనీరింగ్ ముగించుకున్నారనీనూ. అయితే అదే ఇంటర్వ్యూ లో ఇంకో మాట చెప్పారు- “ఈసారి తీసే సినిమా ఫిల్మ్ ఫెస్టివల్స్ గురించని కాకుండా నేరుగా బాలీవుడ్ కమర్షియల్ సినిమా తీస్తాము” అని. బాలీవుడ్ లో కమర్షియల్ సినిమా అనగానే ఏ ఖాన్ తో నో ప్లాన్ చేసుకున్నారేమో అనుకున్నా కానీ – 99 అనే పేరు తో ఒక సినిమా తీసారు. 99 టైటిల్ బాగా వెరైటీ గా ఉందని ఫీలవుతున్నారా..99 అంటే ఏమీ లేదు 1999 అని. ఈ సినిమా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి. అందులో డబ్బులు పెట్టేవాళ్ళ సైకాలజీలు గట్రా బాగానే స్టడీ చేసారు, 1999 లో కథ జరుగుతున్నట్టు బాగానే “చూపించారు”. బేసిక్ గా కామెడీ సినిమాయే కానీ మొదట్లో చాలా సినిమా స్లో గా ఉండటం వల్ల కొంతమందికి నచ్చలేదు. ఆ మాత్రం స్లో ఉన్నా పర్లేదు, డిఫరెంట్ స్టోరీ ని చూడాలనుకునే వాళ్ళు బాగానే ఆస్వాదించారు. అయితే బొమన్ ఇరానీ పెర్ఫార్మెన్స్ ని మాత్రం సినిమా బయటికొచ్చాక అందరూ మెచ్చుకున్నారు. నాకు తెలిసి 99 సినిమాని తీసిన బడ్జెట్ తో పోలిస్తే- కలెక్షన్స్ పరంగా ఈ సినిమా సూపర్ హిట్టే అనుకుంటా.


సరే, ఇద్దరు తెలుగువాళ్ళు (ఒకరు US కి H1 మీద వెళ్ళారు, ఒకరు F1 మీద వెళ్ళారు, అక్కడ సెటిలయారు) ఒక ఇంగ్లీష్, ఒక హిందీ సినిమా తీసారు కాబట్టి ఇక ఒక తెలుగు సినిమా ఎప్పుడు తీస్తారు అనే ప్రశ్న సాధారణంగా ఎవరయినా అడుగుతారు. అయితే దర్శకత్వం వహించడం కాదు కానీ ఇప్పుడు నిర్మాణం లో ఉన్న ఒక సినిమా కి కథ/స్క్రిప్ట్ అందజేస్తున్నారు వీళ్ళు. ఆ సినిమా పేరు “ఇంకోసారి”. కాలేజయ్యాక ఓ పదేళ్ళ (లేదా ఇరవయ్యేళ్ళా??) తర్వాత “క్లాస్ మేట్స్” 🙂 అంతా ఇంకోసారి కలుసుకున్నపుడు జరిగే సంఘటనలే ఈ “ఇంకోసారి” సినిమా అని చెప్తున్నారు. సరే, ఈ సారయినా ఈ పాయింట్ (మళయాళం లో సూపర్ హిట్టయి, తెలుగు లో అట్టర్ ఫ్లాపయిన) క్లాస్ మేట్స్ సినిమా లా కాకుండా కాస్త ఇంట్రెస్టింగా తీస్తారేమో చూడాలి.

ప్రకటనలు

Responses

  1. somehow i enjoyed the film “flavours” verymuch.

    The indian parents(“waagle ki duniya” serial pair),the confused house wife, the guy who calls for ‘geeta’ every night…great entertainment..!!

    its very refreshing.

  2. ఈ సినిమా హిట్టే. కాకపోతే అనుకున్నదానికన్నా ఎక్కువ ఖర్చుపెట్టేసారు. అందుకని నిర్మాతలు ఆశించినంత “లాభం” రాలేదు. విమర్శకులుకూడా ఈ సినిమాను మొచ్చుకున్నా పరిశ్రమలో పెద్ద impact ఇవ్వలేదు.

  3. Director is my friend suman, hopefully he will get a big hit. Also wonder how abcd can make a desi youth movie.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: