వ్రాసినది: mohanrazz | 2009/09/17

చినరాయుడు పెదరాయుడెందుకు చేయలేదు …

వెంకటేష్ చంటి తర్వాత చాలా రీమేకులే చేసాడు – చినరాయుడు, అబ్బాయి గారు, సుందరకాండ ఇలా… కొన్ని ఆడాయి, కొన్ని ఓడాయి. అయితే మంచి సినిమా తమిళ్ లో వచ్చిన ప్రతిసారీ ఇమేజ్ ని పట్టించుకోకుండా కూడా సినిమాలు ఒప్పుకున్నాడు. చంటి ఒప్పుకున్నపుడు చాలా మంది శ్రేయోభిలాషులే వారించార్ట- చేయొద్దని. కానీ ఆ సినిమా చేయడమూ అది బ్లాక్ బస్టర్ అవ్వడమూ జరిగిపోయాయి. సరే, ఇన్ని సినిమాలు రీమేక్ చేసినవాడు తమిళ్ లో నాట్టామై అంత అంత పెద్ద హిట్టయితే దానినెందుకు వదిలేసాడు మరి. దానికి జవాబు సూర్యవంశం రిలీజప్పుడు చెప్పాడు.

నిజానికి నాట్టామై సూపర్ హిట్టయాక ఒక ప్రముఖ తెలుగు నిర్మాత తమిళ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి రైట్స్ అడిగాట్ట- బాలకృష్ణ, ఎన్టీయార్ కాంబినేషన్ లో ఈ సినిమా చేయడానికి. బాలకృష్ణ కూడా అప్పట్లో సమ్మతించడం వల్ల ఇక పెద్దాయాన్ని ఎలాగోలా ఒప్పించేయొచ్చనుకుని వెళ్ళి రైట్స్ గురించి అంతా మాట్లాడేసాక, అడ్వాన్స్ తీసి ఆ తమిళ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టబోయేముందు అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చిందట. ఫోన్ మాట్లాడి వచ్చాక ఆ తమిళ ప్రొడ్యూసర్- ఇందాకే రజనీకాంత్ ఫోన్ చేసాడండీ, రైట్స్ కావాలంటున్నాడు అని చెప్పాట్ట. ఇకచేసేదేమీ లేక ఆ తెలుగు నిర్మాత వెనక్కి వచ్చేసాట్ట. నిజంగా బాలకృష్ణ, ఎన్టీయార్ కాంబినేషన్ లో చివరి సినిమాగా ఇది గనక పడి ఉంటే తెలుగు సినీ చరిత్ర లో అలా నిలిచిపోయి ఉండేది ఈ సినిమా. అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా పెదరాయుడు సినిమా కి తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రత్యేక స్థానం ఉందనుకోండి. సో, అలా రజనీకాంత్, మోహన్ బాబు కాంబినేషన్ లో ఈ సినిమా రావడమూ..దీనితో పాటు రిలీజయిన బిగ్ బాస్ , మాతో పెట్టుకోకు సినిమాలు బిగ్ లాస్ అవడమూ పెదరాయుడు మాత్రం బ్లాక్ బస్టర్ అవడమూ జరిగిపోయాయి.

సూర్యవంశం రిలీజప్పుడు వెంకటేష్ చెప్తున్నాడు- బాలకృష్ణ, రజనీకాంత్ ల కంటే ముందుగా ఈ సినిమా వెంకటేష్ కి పడాల్సిందట. వెంకటేష్ ఒప్పుకుంటే రైట్స్ తీసుకుంటానని ఒక ప్రొడ్యూసర్ అడిగితే వెంకటేషే వద్దన్నాట్ట. మరి కథ బాగనే ఉంది కదా ఎందుకు వద్దన్నారని అడిగితే అన్నాడు- సూర్యవంశం సినిమా లోనూ హీరో డబల్ యాక్షనే, కానీ మెయిన్ హీరో – చిన్న క్యారెక్టర్. కానీ పెదరాయుడు లో – పెద్ద క్యారెక్టర్ మెయిన్ హీరో. నా వయసుకి తగ్గట్టు పాత్రలు చేసినపుడే ప్రేక్షకులు ఆదరిస్తారు, ఆ కథకి కూడా సూటవుతుంది. కాబట్టి డబల్ రోల్ చేసేటప్పుడు మెయిన్ రోల్ హీరో వయసుకి దగ్గరగా ఉన్న రోల్ అయితే ప్రేక్షకులు కూడా ఇబ్బంది లేకుండా ఆస్వాదిస్తారు సినిమాని. అందువల్లే అవకాశమొచ్చినా పెదరాయుడు(నాట్టామై) నేను చేయలేదు. అందుకు నో రిగ్రెట్స్ అని.


Responses

 1. నాకేమో బాలక్రిష్ణ గాని, వెంకటేష్ గానీ పెదరాయుడు కారక్టర్ కి సూట్ అవుతారనిపించట్లేదు. సూర్యవంశంలో కూడా వెంకటేష్ పెద్ద కారక్టర్ నాకు నచ్చలేదు. చిన్నపిల్లాడికి పెద్దవాడి వేషం వేసినట్టే అనిపించింది. రాధిక ఆ పాత్రలో ఒదిగిపోయిందికానీ, వెంకటేష్ ఒదగలేకపోయాడు. ఇక బాలక్రిష్ణ విషయానికొస్తే పెదరయిడి పాత్ర కి ఒక హుందాతనం ఉంది. అది బాలక్రిష్ణ తెప్పించగలడని నేననుకోవట్లేదు.

  నాకయితే పెదరాయుడి పాత్రకి మోహన్ బాబు కరెక్ట్ గా సరిపోయాడు. నేను అసలు మోహన్ బాబు సినిమాలు చూడను. కాని నాకు నచ్చిన ఒకేఒక్క సినిమా పెదరయుడు. ఆ పాత్ర తనకోసమే పుట్టిందా అన్నట్టు చేసాడు. తనకి చాలా బాగా సూట్ అయింది. తమిళ్ లో శరత్ కుమార్ కన్నా కూడా మోహన్ బాబే నచ్చాడు. ఆ రోజుల్లో నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను.

 2. ఆ సినిమా హిట్టవ్వటానికి, ఆదరణ పొందటానికి ఒకే ఒక్క కారణం – పాపారాయుడు (అదేనండీ – రజనీ!) ఐతే చిన్న సంగతి – ఎస్.వీ.ఆర్ లాంటి మహామహులతో చేసేటప్పుడు “చినమాయను పెనుమాయ” తాత గుర్తున్నాడుగా – ఆయన ఆ సన్నివేశాన్ని బ్రహ్మాండంగా రక్తి కట్టిస్తాడు. అంత కాదనుకుంటే సావిత్రి పక్కన నటించిన “మైనా”నే చూడండి – ఆ చెలికత్తెలో హావభావాలు బ్రహ్మాండం. ఇక్కడ మనకు కనపడేది ఎస్.వీ.ఆర్, సావిత్రి పర్సనాలిటీ మాయాజాలంలో ఇవతలి కళాకారులు ఇరుక్కుపోయి అంత బాగానూ చెయ్యాలి అని పడే శ్రమే అన్నమాట. రజనీతో చేసేటప్పుడు మోహనుబాబు పరిస్థితి అదే. లేకపోతే మోహనుబాబు ఏమిటి? యాక్షనేమిటి ? అంతా రజనీ మాయ! జై రజనీ జై జై రజనీ!

 3. మొత్తం కామెంటు అంతా ఒక్కసారి రాలేదెందుకో – సరే – కాబట్టి అక్కడ బాలయ్య వున్నా, వెంకీ వున్నా – రజనీ పాపారాయుడిగా వుంటే ఏ పంచైనా పంట్లామయిపోవాల్సిందే, పంట్లాం పంచె అయిపోవాల్సిందే ! అదీ లెఖ్ఖన్నమాట. ఆయన అంటే చినరాయుడు చేసినా, చెయ్యకపోయినా ఎవరికీ పోయేదేమీ లేదు..సినిమా మటుకు హిట్టు ఖాయమే!

  • అంతేనంటారా 🙂

   మీరు గానీ ఆంధ్ర రజనీ యూత్ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ కాదు కదా 😀

 4. రజనీకాంత్ ఉన్న ఆ అరగంటే సినిమాని నిలబెట్టింది. మిగతా సినిమా సోసో. దీనికన్నా ఎమ్.ధర్మరాజు ఎమ్.ఎ. లో మోహన్ బాబు (విలన్ పాత్రలో) మరింత బాగ ఒదిగిపోయాడని నాకనిపిస్తుంది. (అదీ ఇదీ రీమేకే కాబట్టి పోలిక)

  అన్నట్టు – మోహన్ రాజ్ – ఈ టపాకి సంబంధం లేని విషయం ఒకటి.

  ‘పోకిరి’లో ‘గలగల పారుతున్న గోదారిలా’ పాట ఏదో పాత పాటకి రీమిక్స్ అని మణిశర్మో, ఆ పాట పాడిన గాయకుడో ఏదో ఇంటర్‌వ్యూలో అన్నట్లు ఎక్కడో చదివిన గుర్తు. అలాంటి పాత పాట ఎక్కడా విన్న గుర్తైతే నాకు లేదు. మీకేమైనా తెలుసా?

  • ఆ పాట ఒక పాత కృష్ణ సినిమాలోది. సినిమా పేరు గుర్తు లేదు..కావాలంటే కనుక్కోవచ్చు.. 🙂

   నిజానికి ఒక ఇంగ్లీష్ సాంగ్ ట్యూన్ ని కాపీ కొట్టి అప్పట్లోనే ఆ ‘గలగల పారుతున్న గోదారిలా’ పాట ట్యూన్ చేసారు. మణిశర్మ ఆ ఇంగ్లీష్ ట్యూన్ వినిపించి ఈ ట్యూన్ ని వాడుకుందామని చెబితే- పూరీ, ఈ ట్యూన్ ని ఆల్రెడీ కాపీ కొట్టిన ఒక పాట కృష్ణ గారి సినిమాలోనే ఉంది (లక్కీగా). కాబట్టి దాన్ని రీమిక్స్ చేద్దామని సజెస్ట్ చేస్తే..ఆ సజెషన్ ఏకగ్రీవామోదాన్ని పొందడం వల్ల ఆ పాటని రీమిక్స్ చేసారు.
   అయినా ఆ పాట ఎందుకు గుర్తు వచ్చింది మీకు? 🙂

 5. Title: గౌరి
  (original)
  గలగల పారుతున్న గోదారిలా రెపరెప లాడుతున్న తెరచాపలా
  ఈ చల్లనీ గాలిలా ఆ పచ్చనీ పైరులా

  తారాగణం: కృష్ణ , జమున,
  సంగీతం: సత్యం

  (remix)
  గలగల పారుతున్న గోదారిలా జలజల జారుతుంటే కన్నీరలా
  నాకోసమై నువ్వలా.. కన్నీరులా మారగా
  నాకెందుకో ఉన్నదీ.. హాయిలా

 6. ఇందాక ఆ పాట వినిపిస్తే, గుర్తొచ్చింది. అంత గొప్ప పాటలా అనిపించలేదు. ఇదే ఇలా ఉంటే దీని ఒరిజినల్ ఇంకెలా ఉందో అనుకుని – అడిగా. దాని మాతృక సైతం అంత హిట్ అయ్యుండకపోవచ్చు …. just my guess.

  Thanks for the source.

  • ur guess is correct… హిట్టయి ఉంటే మనకి కూడా అల్రెడీ ఆ పాట ఏ సినిమాలోదో తెలిసి ఉండేదిగా ముందే 🙂
   anyway …vacation aa??

 7. ఆ రీమేకుల కాలం తలచుకుంటే భయమేస్తుంది. పోటిపడి మరీ చేసేవారు. చిరంజీవి జీవితా-రాజశేఖర్లకు శత్రువు అయ్యింది కూడా ఈ పోటీలోనే.

  ఆ ట్రెండ్ నుంచి బయటకు తీసుకొచ్చిన మన దర్శకులను నిజంగా అభినందించవచ్చు.

  ఇదెంత కాలం నడుస్తాదో కానీ ఇప్పుడు కాంబినేషన్ ట్రెండ్ నడుస్తుంది. కాంబినేషన్ పేరుతొ సినిమాను హైప్ చేస్తున్నారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్గాలు

%d bloggers like this: